న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రొటేషన్ పాలసీ వద్దు... ఐదు శాశ్వత వేదికలే ముద్దు: కోహ్లీ కొత్త పలుకు

Virat Kohli not in favour of rotation policy for allocation of Test venues


హైదరాబాద్: భారత్‌లో రొటేషన్ పద్ధతిలో టెస్ట్ మ్యాచ్‌లు నిర్వహించడంపై కోహ్లీ వ్యతిరేకించాడు. ఇకపై భారత్‌లో జరగబోయే టెస్టు మ్యాచ్‌లకు శాశ్వత వేదికలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోహ్లీ అన్నాడు. రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.

దీంతో టెస్టు క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికాపై 3-0తో సిరిస్‌ను గెలిచిన ఏకైక జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ టెస్టు క్రికెట్‌ను బ్రతకాలంటే ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా తరహాలో ఐదు టెస్టు వేదికలు ఉంటే బెటర్ అని అన్నాడు.

కోహ్లీకి విశ్రాంతి!: బంగ్లాదేశ్‌తో సిరిస్‌కు అక్టోబర్ 24న టీమిండియా ఎంపికకోహ్లీకి విశ్రాంతి!: బంగ్లాదేశ్‌తో సిరిస్‌కు అక్టోబర్ 24న టీమిండియా ఎంపిక

అభిమానులు వస్తారో లేదో

అభిమానులు వస్తారో లేదో

అభిమానులు వస్తారో లేదో తెలియని స్టేడియాల్లో టెస్టు మ్యాచ్‌లను నిర్వహించడం వల్ల లాభం లేదని కోహ్లీ స్పష్టం చేశాడు. గత కొన్నాళ్లుగా భారత్ టెస్టు మ్యాచ్‌లను వివిధ వేదికల్లో నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్ శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో టెస్ట్ మ్యాచ్‌లను ప్రధాన వేదికల్లో ఆడించేవారు.

రోటేషన్ పాలసీ ప్రకారం

రోటేషన్ పాలసీ ప్రకారం

అయితే, 2015 నుంచి రోటేషన్ పాలసీ ప్రకారం అన్ని వేదికల్లోనూ టెస్ట్ మ్యాచ్‌లు ఆడిస్తున్నారు. దీనిపై కోహ్లీ మాట్లాడుతూ "దేశంలోని అన్ని వేదికల్లోనూ టెస్ట్ మ్యాచ్‌లు ఆడించాల్సిన అవసరం లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్‌ల కోసం రోటేషన్ పద్ధతి పాటించినా.. టెస్ట్ మ్యాచ్‌లను ఎప్పుడూ ఐదు వేదికల్లో నిర్వహిస్తే బాగుంటుంది" అని అన్నాడు.

ధోనీ మా గెస్ట్.. డ్రస్సింగ్‌ రూమ్‌లో ఉన్నాడు.. హలో చెప్పండి!!(వీడియో)

టెస్టు క్రికెట్‌ బతకాలంటే

టెస్టు క్రికెట్‌ బతకాలంటే

"టెస్టు క్రికెట్‌ బతకాలంటే, ఐదు శాశ్వత వేదికలు చాలు. అభిమానులు వస్తారో లేదో తెలియని స్టేడియాల్లో నిర్వహణ వల్ల లాభం లేదు. భారత్‌కు వచ్చే ప్రతిజట్టుకు ఎక్కడ ఆడతామో ముందే తెలియాలి. అప్పుడే ఆటగాళ్లకు పిచ్‌ల గురించి అవగాహన ఉంటుంది. ఫలితంగా సిరీస్‌లు మరింత రసవత్తరంగా సాగుతాయి" అని కోహ్లీ పేర్కొన్నాడు.

టీమిండియా విజయం సాధించడంతో

టీమిండియా విజయం సాధించడంతో

ఇదిలా ఉంటే రాంచీ టెస్టులో టీమిండియా విజయం సాధించడంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికాపై అత్యధిక టెస్టు మ్యాచ్‌లు నెగ్గిన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా దక్షిణాఫ్రికాపై మొత్తం 10 టెస్టులాడి 7 టెస్టుల్లో విజయం సాధించింది.

3-0తో సిరిస్ క్లీన్ స్వీప్

3-0తో సిరిస్ క్లీన్ స్వీప్

ఇతర కెప్టెన్ల నాయకత్వంలో టీమిండియా దక్షిణాఫ్రికాపై మొత్తం 29 టెస్టులాడగా కేవలం 7 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలవగలిగింది. 2015లో భారత పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా జట్టు నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 3-0తో చేజార్చుకుంది. ఆ తర్వాత 2018లో కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా సఫారీ పర్యటనకు వెళ్లింది.

సిరిస్ నెగ్గేందుకు భారత్ కష్టతరమైన ప్రదేశం: గణాంకాలే చెబుతున్నాయి

కోహ్లీకి ఇదే తొలి వైట్‌వాష్ సిరిస్

కోహ్లీకి ఇదే తొలి వైట్‌వాష్ సిరిస్

ఈ పర్యటనలో భాగంగా టీమిండియా 2-1తో టెస్టు సిరిస్‌ను కోల్పోయింది. ఇప్పుడు దక్షిణాఫ్రికాపై 3-0తో టెస్టు సిరిస్‌ను గెలిచింది. ఫలితంగా సఫారీలను క్లీన్‌స్వీప్ చేసిన ఏకైక జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికా జట్టుపై కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఇదే తొలి వైట్‌వాష్ సిరిస్ కావడం విశేషం.

Story first published: Saturday, October 26, 2019, 9:33 [IST]
Other articles published on Oct 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X