న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా జీవితంలోనే తొలి సారి.. అది అనుష్క బర్త్‌డే రోజే: విరాట్ కోహ్లీ

Virat Kohli narrates standout quarantine story Baked a cake for first time

న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఆటలు ఆగిపోయి, అనూహ్యంగా వచ్చిన 'లాక్‌డౌన్ లైఫ్'ను కుటుంబంతో ఆస్వాదించానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. సహచర ఆటగాడు మయాంక్ అగర్వాల్‌తో ఇన్‌స్టా లైవ్ సెషన్‌లో మాట్లాడిన కోహ్లీ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అయితే ఫేవరేట్ క్వారంటైన్ స్టోరీ ఏంటనీ మయాంక్ ప్రశ్నించగా... కేక్ తయారు చేయడమని, అది కూడా తన సతీమణి అనుష్క బర్త్‌డే రోజునా..అని సమాధానమిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది.

నా క్వారంటైన్ స్పెషల్..

‘నా జీవితంలోనే తొలిసారి కేక్ తయారు చేశాను. అది కూడా అనుష్క బర్త్‌డే రోజున. అదే నా క్వారంటైన్ స్పెషల్. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు నేను కేక్ తయారు చేయలేదు. తొలి ప్రయత్నమే అయినా కేకు బాగుంది. అనుష్కకు ఎంతో నచ్చింది. తనకు చాలా ప్రత్యేకమని చెప్పింది'అని కోహ్లీ తెలిపాడు. ఇక లాక్‌డౌన్ సమయంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌తో ఇన్‌స్టా లైవ్‌లో మాట్లాడుతూ.. సతీమణి అనుష్కతో కలిసి ఈ నిర్భంధాన్ని ఆస్వాదిస్తున్నానన్నాడు.

ఇక భారత జట్టులో ప్రొటీన్ షేక్‌లను అద్భుతంగా చేసేదేవరని ప్రశ్నించగా.. మయాంక్ అగర్వాల్, తనతో పాటు నవదీప్ సైనీ బాగా చేస్తాడని విరాట్ బదులిచ్చాడు. ‘నీ పేరు చెబుతాననే కదా ఈ ప్రశ్న అడిగవు'అని మయాంక్‌ను ఉద్దేశించి చమత్కరించాడు.

నేను అస్సలు రాజీ పడను..

నేను అస్సలు రాజీ పడను..

ఒక కెప్టెన్‌గా తానెప్పుడూ జట్టు విజయాల గురించి మాత్రమే ఆలోచిస్తానని, ఆ విషయంలో రాజీపడడం తనకు ఇష్టం ఉండదని కోహ్లీ స్పష్టం చేశాడు.'ఎలాంటి పరిస్థితుల్లోనూ నేను ఫలితం కోసం రాజీపడను. మ్యాచ్‌ను డ్రా చేసుకోవడం నాకు చివరి అవకాశంగా ఉండాలి. ఒకవేళ భారత్‌ గెలవడానికి చివరి రోజు ప్రత్యర్థి జట్టు 300 పరుగులు లక్ష్యంగా నిర్దేశిస్తే ఆటగాళ్లకు ఒకటే చెబుతా.. మనం ఆ స్కోరు కోసం ప్రయత్నిద్దామని అంటా. సెషన్‌కు వంద పరుగుల చొప్పున బాదితే సరిపోతుందని, ఒకవేళ తొలి సెషన్‌లో వికెట్లు కోల్పోయి 80 పరుగులే చేసినా.. చివరి సెషన్‌లో 120 పరుగులు చేద్దామని చెబుతా' అని అన్నాడు.

డ్రా అంటే నాకు నచ్చదు:

డ్రా అంటే నాకు నచ్చదు:

‘మ్యాచును డ్రా చేసుకోవడం నాకు నచ్చదు. పరిస్థితులు మరీ చేయిదాటిపోతే తప్ప దాని గురించి ఆలోచించను. చివరి గంటలో ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంటే అప్పుడు డ్రా చేసుకోవాలని అనుకుంటా. ఒక ఆటగాడికి ఓడిపోతామనే భయమే అత్యంత ప్రతికూల అంశం, అది ఆ ఆటగాడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. మ్యాచ్‌ను మలుపు తిప్పే ఘటనలు చోటుచేసుకుంటే.. ఆటగాళ్లు వావ్‌ అంటారు. నా లక్ష్యం ఒక్కటే.. టీమిండియాను చూసి ఎవరైనా మంచి జట్టు అని మెచ్చుకోవాలి' అని విరాట్ చెప్పుకొచ్చాడు.

మా అమ్మకు నేను బొద్దుగా ఉండాలి..

మా అమ్మకు నేను బొద్దుగా ఉండాలి..

‘నేను బక్కచిక్కిపోయినట్లు మా అమ్మ అంటుండేది. అయితే ప్రతీ తల్లి అలా అనుకోవడం సహజమే. "నువ్వు చాలా వీక్‌ అవుతున్నావు. ఏమైనా తింటున్నావా లేదా?" అని అడిగేది. మాతృమూర్తులకు తమ కుమారులపై ఉండే బెంగకు, ఆటగాళ్ల ప్రొఫెషనలిజమ్‌కి తేడా తెలియదు. వాళ్ల పిల్లలు లావుగా కనపడకపోతే ఏదో అయిపోయిందని కంగారు పడతారు' అని విరాట్ కోహ్లీ వివరించాడు. అలాగే తాను అనారోగ్యానికి గురయ్యానని కూడా తన తల్లి అంటుండేదని విరాట్ చెప్పుకొచ్చాడు. ఇలాంటి సన్నివేశాలు ఒక్కోసారి సరదాగా అనిపించినా ఒక్కోసారి చాలా చిరాకు తెప్పిస్తాయన్నాడు. తాను బాగా ఉన్నానని, ఆటకోసం అలా మారాల్సి వస్తోందని చెబుతానని చెప్పాడు.

Story first published: Sunday, July 26, 2020, 20:54 [IST]
Other articles published on Jul 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X