న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అనిల్ కుంబ్లేకు కోహ్లీ బర్త్‌డే విషెస్ .. అవాక్కైన ఫ్యాన్స్.. చెప్పింది విరాటేనా? అని సందేహం!

Virat Kohli Leaves Fans Surprised With Birthday Message For Anil Kumble

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ హెడ్ కోచ్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్రస్తుత కోచ్ అనిల్ కుంబ్లే శనివారంతో 50వ ఏట అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ఈ భారత మాజీ కెప్టెన్‌కు అభిమానులతో పాటు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు, సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం తన మాజీ కోచ్‌కు బర్త్ డే విషెస్ తెలియజేశాడు. 'జన్మదిన శుభాకాంక్షలు అనిల్ భాయ్.. ఈ రోజు మీకు గొప్పగా ఉండాలి'అని విరాట్ ట్వీట్ చేశాడు.

అయితే అనిల్ కుంబ్లేకు కోహ్లీ బర్త్‌డే విషెస్ చెప్పడం పట్ల అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చెప్పింది విరాటేనా లేకుంటే ఎవరైనా అతని ట్విటర్ అకౌంట్‌ను హ్యాక్ చేశారా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

కుంబ్లే X విరాట్..

అనిల్ కుంబ్లే టీమిండియా హెడ్ కోచ్‌గా పని చేస్తున్న సమయంలో కెప్టెన్ కోహ్లీతో విబేధాలు నెలకొన్నాయి. కుంబ్లే వ్యవహార శైలి పట్ల విరాట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. అతను కోచ్‌గా కొనసాగడానికి వీల్లేదని బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ ముందు విరాట్ బల్ల గుద్ది చెప్పినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. టీమిండియా ఇంగ్లండ్ పర్యటనలో ఉండగానే.. కోచ్, కెప్టెన్ మధ్య విబేధాలు తారా స్థాయికి చేరాయి. దీంతో వీరి మధ్య సయోధ్య కుదర్చడం కోసం బీసీసీఐ చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. చివరకు కోహ్లి పంతమే నెగ్గింది. కెప్టెన్ డిమాండ్‌కు బీసీసీఐ తలొగ్గడంతో.. ఏడాది కాంట్రాక్ట్ ముగియగానే కుంబ్లే కోచ్ పదవిని తప్పుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి 2019 వరల్డ్ కప్ ముగిసే వరకూ కుంబ్లే కాంట్రాక్ట్ పొడిగిస్తారని భావించినా.. అలా జరగలేదు.

అందుకే అభిమానుల సందేహం..

ఈ క్లాష్ అనంతరం విరాట్, కుంబ్లే దూరం దూరంగానే ఉన్నారు. దాంతో కుంబ్లే, విరాట్ కలిసినా.. సోషల్ మీడియా వేదికగా ఒకరికొకరు విష్ చేసుకున్నా అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. గతంలో కూడా విరాట్, కుంబ్లే బర్త్ డే విషెస్ చెప్పుకున్నారు. అంతేకాకుండా విరాట్ మ్యారెజ్ రిసెప్షన్‌కు కూడా కుంబ్లే హాజరయ్యాడు. కానీ అభిమానులు మాత్రం ఇంకా వారి మధ్య వైరం ఉందనే భావిస్తున్నారు. అందుకే కోహ్లీ విషెస్ చెప్పడాన్ని నమ్మలేకపోతున్నారు.

పంజాబ్‌తో ఓడిన తర్వాత కూడా..

ఇక కింగ్స్ పంజాబ్ చేతిలో ఆర్‌సీబీ రెండు సార్లు ఓడిన తర్వాత కూడా అభిమానులు ఇదే తరహా ట్రోలింగ్ చేశారు. కోహ్లీపై కుంబ్లే పర్‌ఫెక్ట్ రివేంజ్ తీర్చుకున్నాడని క్రికెట్ ఫ్యాన్స్ ట్వీట్లు చేశారు. కుంబ్లే కోచ్‌గా ఉన్న సమయంలో టీమిండియా మంచి విజయాలే సాధించింది. అయినప్పటికీ.. అవమానకర రీతిలో అతడు కోచ్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఐపీఎల్‌లో కోహ్లీ నాయకత్వంలోని ఆర్‌సీబీపై రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవడం ద్వారా కుంబ్లే ప్రతీకారం తీర్చుకున్నాడని ఫ్యాన్స్ గతాన్ని గుర్తు చేశారు.

ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు..

ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు..

1990 ఏప్రిల్‌ 5న శ్రీలంకపై వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి కుంబ్లే.. అదే ఏటా ఇంగ్లండ్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. తన సుదీర్ఘ కెరీర్‌లో 132 టెస్ట్‌ల్లో 619 వికెట్లు, 271 వన్డేల్లో 337 వికెట్లు తీశాడు. షేన్‌వార్న్‌ తర్వాత టెస్ట్‌ల్లో 600 వికెట్ల క్లబ్‌లో చేరిన రెండో బౌలర్‌ కుంబ్లేనే. 1996 వన్డే ప్రపంచకప్‌లో కుంబ్లే 16 వికెట్లు తీసాడు. టెస్టు క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌ కుంబ్లే. బౌలింగ్‌లో ఇన్ని ఘనతలు అందుకున్న జంబో టెస్టుల్లో తన సెంచరీని 118వ మ్యాచ్‌లో పూర్తిచేసాడు.

పార్టీలు కాదు.. మా అగస్త్యా డైపర్లను మార్చుడు మిస్సవుతున్నా: హార్దిక్ పాండ్యా

Story first published: Saturday, October 17, 2020, 18:23 [IST]
Other articles published on Oct 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X