పార్టీలు కాదు.. మా అగస్త్యా డైపర్లను మార్చుడు మిస్సవుతున్నా: హార్దిక్ పాండ్యా

దుబాయ్: ఐపీఎల్ పదమూడో సీజన్‌లో ముంబై ఇండియన్స్ పంజా విసురుతోంది. ఆల్‌రౌండ్ షోతోఅదరగొడుతుంది. ప్రత్యర్థితో పని లేకుండా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. శుక్రవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో 8 వికెట్లతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. తొలుత బౌలింగ్‌‌‌‌లో పంజా విసిరి ఆ జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేసిన ముంబై తర్వాత క్వింటన్‌‌‌‌ డికాక్‌‌‌‌ (44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 78 నాటౌట్‌‌‌‌) మెరుపు బ్యాటింగ్‌‌‌‌తో చిన్న టార్గెట్‌‌‌‌ను ఆడుతూ పాడుతూ ఛేజ్‌‌‌‌ చేసింది. లీగ్​లో ఆరో విక్టరీతో టేబుల్‌‌‌‌లో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌కు వచ్చేసింది.

ఇక డికాక్‌కు తోడుగా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (11 బంతుల్లో 21 నాటౌట్) మెరుపులు మెరిపించి సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో పాండ్యాను బయో బబుల్ కారణంగా ఏమైనా పార్టీలు మిస్సవుతున్నావా? అని హోస్ట్ డానీ మోరిస్ ప్రశ్నించాడు. దీనికి పాండ్యా తనదైన శైలిలో బదులిచ్చాడు. తాను ఓ తండ్రినని తెలిపిన పాండ్యా.. పార్టీల కన్నా తన కొడుకు డైపర్స్ మార్చడం మిస్సవుతున్నానని బదులిచ్చాడు. దీంతో అక్కడ నవ్వులు పూసాయి. 'ఇప్పుడు నేను ఓ తండ్రిని. పార్టీల కన్నా మా అగస్త్య డైపర్స్ మార్చడమే ఎక్కువ మిస్సవుతున్నా'అని తెలిపాడు.

బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తున్నా..

బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తున్నా..

ఇక తన బ్యాటింగ్‌పై మాట్లాడుతూ.. మరింత మెరుగయ్యేందుకు కృషి చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. ‘నేను గత మూడేళ్లుగా బ్యాటింగ్ చేస్తున్నాను. కాబట్టి బాగా ఆడాలి. నా టెక్నిక్‌తో ఆడుతూ దాన్ని అలానే కొనసాగించడం చాలా ముఖ్యం. బ్యాటింగ్ చేసేటప్పుడు చాలా డీప్‌గా ఆడుతాను. నేను రాణించడానికి గల కారణాలను తెలుసుకోవాలనుకుంటున్నాను. నా బ్యాటింగ్ మెరుగైనప్పుడు మరింత సంతోషిస్తా. ప్రస్తుతం నా ఆటను ఆస్వాదిస్తున్నా'అని పాండ్యా చెప్పుకొచ్చాడు.

జనవరిలో నిశ్చితార్థం.. జూలైలో బాబు..

జనవరిలో నిశ్చితార్థం.. జూలైలో బాబు..

ఇక ఈ ఏడాది ప్రారంభంలో సెర్బీయా బ్యూటీ నటాషా స్టాన్‌కోవిచ్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించిన పాండ్యా.. జూలైలో తండ్రైనట్లు తెలిపి అందిరిని ఆశ్చర్యపరిచాడు.

కరోనాతో కలిసొచ్చిన టైమ్‌ను తెగ ఆస్వాదించిన ఈ జోడీ.. జూలైలో ఓ బాబుకు కూడా జన్మనిచ్చింది. బుల్లి హార్దిక్ పాండ్యాకు 'అగస్త్య' అని పేరు కూడాపెట్టారు. అయితే వీరి పెళ్లిపై మాత్రం క్లారిటీ లేదు. కానీ దండలు మార్చుకున్న ఓ ఫొటో మాత్రం వైరల్ అయింది. దాన్ని బట్టి మేలో పెళ్లైనట్లు వార్తలు వెలువడ్డాయి.

రెండు నెలల అగస్త్యుడు

రెండు నెలల అగస్త్యుడు

అగస్త్యాకు సెప్టెంబర్‌ 30తో రెండు నెలలు నిండాయి. ఈ సందర్భంగా నటషా తన కుమారుడి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘రెండు నెలల అగస్త్యుడు' అని క్యాప్షన్‌గా పేర్కొంది. హార్థిక్‌ పాండ్యా కూడా తన ముద్దుల తనయుడికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు. ముంబై ఇండియన్‌ జెర్సీపై (హ్యాపీ 2 మంథ్స్‌ అగస్త్యా' అని రాసి ఉన్న షాట్‌ ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు.

ప్యాంట్‌ మార్చుకోవడం మరచిన డికాక్.. నవ్వు ఆపుకోలేకపోయిన రోహిత్! (వీడియో)

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, October 17, 2020, 17:08 [IST]
Other articles published on Oct 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X