న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'నేర్చుకోవడంలో ప్రాముఖ్యాన్ని కోహ్లీనే నేర్పించాడు'

India vs Australia 2018-2019 : Rishabh Pant Is Ready For The Challenge | Oneindia Telugu
Virat Kohli has taught me the importance of learning from mistakes: Rishabh Pant

హైదరాబాద్: ఇంగ్లాండ్ అరంగ్రేటం చూసి అరంగ్రేట్ మ్యాచ్ నుంచి దూకుడైన ఆటతో దూసుకెళ్లున్నాడు రిషబ్ పంత్. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో దూకుడైన ఆటతీరును ప్రదర్శించి.. ఆడిన తొలి టెస్టులోనే వరుసగా 92, 92 పరుగులతో ఆకట్టుకున్నాడు. అంతకుముందు ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులోనూ సెంచరీ చేసి జట్టులో స్థానంపై ఒక నమ్మకాన్ని తెచ్చుకున్నాడు. ఈ యువ క్రికెటర్‌కు ప్రశంసలతో పాటు పోలికలు చాలా ఇబ్బంది తెచ్చిపెడుతున్నాయి.

కెప్టెన్ కోహ్లీ తనకో గొప్ప పాఠం

కెప్టెన్ కోహ్లీ తనకో గొప్ప పాఠం

వాటన్నిటినీ సమన్వయం చేసుకుంటూ జట్టులో ముందుకు దూసుకెళ్లాలని ఆశపడుతున్నాడు. టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ తనకో గొప్ప పాఠం నేర్పించాడని యువ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌పంత్‌ చెప్పాడు. ఇతరుల పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకోవాలని తనతో చెప్పాడని పంత్‌ వెల్లడించాడు.

ఉద్యోగం లేకపోయినా ఆడగలననే నమ్మకముంది : కోహ్లీ

ఇమేజ్‌ను గదిలోనే వదిలేయడం

ఇమేజ్‌ను గదిలోనే వదిలేయడం

‘ప్రతి ఒక్కరి జీవితంలో ఇప్పుడు సామాజిక మాధ్యమాలు ఒక భాగమయ్యాయి. వాటిని పక్కనపెట్టలేం. అయితే మైదానం బయట ఉండే ఇమేజ్‌ను గదిలోనే వదిలేయడం నేర్చుకున్నా. ఎన్ని మ్యాచ్‌లు ఆడినా మైదానంలోకి వెళ్తే కాస్త ఆందోళన ఉంటుంది. 50 మ్యాచ్‌లు ఆడినంత మాత్రాన అనుభవం వచ్చినట్టు కాదని విరాట్‌ భయ్యా చెప్పాడు. ఇతరుల పొరపాట్ల నుంచి నేర్చుకొనే వ్యక్తి 4 మ్యాచ్‌లు ఆడినా 50తో సమానమే అని చెప్పినట్లు తెలిపాడు.' అని రిషబ్‌ వెల్లడించాడు.

మానసికంగా అందుకు సిద్ధంగానే ఉన్నా

మానసికంగా అందుకు సిద్ధంగానే ఉన్నా

ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపికైన రిషబ్‌ పంత్‌తో టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాడు. ‘కోచ్‌ రవిశాస్త్రి నాతో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారు. ఆస్ట్రేలియా పరిస్థితుల గురించి ఎలా ఆడాలో అనే విషయాలను వివరిస్తున్నారు. క్రీజులో నిలదొక్కుకొనేందుకు కాస్త సమయం తీసుకొని తర్వాత నా శైలిలో చెలరేగాలని రోహిత్‌ భయ్యా చెప్పాడు. మానసికంగా అందుకు సిద్ధంగానే ఉన్నాను' అని పంత్‌ తెలిపాడు.

భారత జట్టులో పోటీపడేందుకు రాలేదు

భారత జట్టులో పోటీపడేందుకు రాలేదు

మహేంద్రసింగ్ ధోనీతో తనకి పోలికలు తేవడంపై విసుగుచెందిన పంత్ తాజాగా స్పందించాడు.‘ఎవరితోనో పోటీపడేందుకు నేను భారత జట్టులో లేను. ఇది నా కెరీర్‌లో నేర్చుకునే సమయం. అవకాశాల్ని సద్వినియోగం చేసుకుని.. మహేంద్రసింగ్ ధోనీ నెలకొల్పిన ప్రమాణాల్ని అందుకునేందుకు ప్రయత్నిస్తున్నా' అని ఘాటుగా బదులిచ్చాడు.

Story first published: Friday, November 16, 2018, 11:36 [IST]
Other articles published on Nov 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X