ఉద్వేగం లేకుండా ఆడగలననే నమ్మకముంది : కోహ్లీ


హైదరాబాద్: కెరీర్ ఆరంభంతో పోల్చుకుంటే క్రికెటర్‌గా ఎంతో పరిణతి సాధించానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చెప్పాడు. గురువారం ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరడానికి ముందు అతడు విలేకర్లతో మాట్లాడాడు. 'కెరీర్ ఆరంభంలో దూకుడుగా ఉండేవాడిని. ఇప్పుడు అలా ఉండాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు. నా సామర్థ్యంపై నాకు నమ్మకముంది. ఉద్వేగం తెచ్చుకోకుండా ఆడగలను. కెరీర్ ఆరంభంలో అపరిపక్వంగా వ్యవహరించా' అని కోహ్లి చెప్పాడు.

వ్యక్తిగతంగానే కాకుండా బ్యాట్స్‌మెనంతా
ఆస్ట్రేలియా పర్యటనలో బ్యాట్స్‌మన్ రాణించాల్సిన అవసరముందన్నాడు. ‘ప్రతి ఒక్క ఆటగాడూ బాధ్యత తీసుకోవాలి. అంచనాలను దృష్టిలో పెట్టుకుని జట్టుగా అనుకున్నదాని ప్రకారం ఆడాలి. కేవలం వ్యక్తిగతంగానే కాకుండా బ్యాట్స్‌మెనంతా సమష్టిగా ఎలా బాగా ఆడొచ్చో అనే దానిపై దృష్టిపెట్టాం' అని కోహ్లి అన్నాడు.
ధోనీతో పోల్చొద్దు.. నేను నేర్చుకుంటున్నా: పంత్

నిజాయతీగా మరొకరు లేరు
‘రవిశాస్త్రి నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు చెప్పేస్తాడు. ఏదైనా వద్దనుకుంటే వద్దని చెబుతాడు. కోచ్‌గా అతడి కంటే నిజాయతీగా అభిప్రాయం చెప్పేవాళ్లు నాకు మరొకరు లేరు. కొద్ది సంవత్సరాలుగా అతడి మాటలు వింటూనే ఆటలో ఎన్నో మార్పులు చేసుకున్నా. ఇంతకుముందెప్పుడూ ఎవరి మాటలూ అలా వినలేదు' అని చెప్పాడు.

ఆటను ఎలా రాబట్టాలో బాగా తెలుసని
కోహ్లికి కోచ్ రవిశాస్త్రి అన్ని విషయాల్లోనూ వత్తాసు పలుకుతాడనే భావన క్రికెట్ వర్గాల్లో ఉంది. కానీ అది చాలా తప్పని కోహ్లి అన్నాడు. మిగతా ఆటగాళ్లూ శాస్త్రి నుంచి చాలా నేర్చుకున్నారని కోహ్లి అన్నాడు. ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ఆటను ఎలా రాబట్టాలో అతడికి బాగా తెలుసని చెప్పాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ 3 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేలు ఆడనుంది.

టీమిండియాలో ఎలాంటి మార్పులు ఉండవని
కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ... వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచకప్ వరకు టీమిండియాలో ఎలాంటి మార్పులు ఉండవని తెలిపాడు. టోర్నీలో తొలి మ్యాచ్‌కు ముందు 13 వన్డేలు మాత్రమే మిగిలి ఉండగా.. అందులో ఆడబోయే 15 మందితోనే కొనసాగుతామని దాంతోనే ఇప్పుడు ఆడేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications