న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 
U19 World Cup:ఆస్ట్రేలియా జట్టులో భారత సంతతి స్పిన్నర్.. లెప్ట్-రైట్ బౌలింగ్‌‌తో రచ్చ! (వీడియో)

Tamil Nadu born Nivedhan Radhakrishnan

న్యూఢిల్లీ: వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్‌లో భారత సంతతి స్పిన్నర్ నివేధన్ రాధాకృష్ణన్ లెప్ట్-రైట్ బౌలింగ్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆస్ట్రేలియా తరఫున బరిలోకి దిగిన అతను ఆతిథ్య వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే మూడు వికెట్ల‌తో సత్తా చాటాడు. రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్‌కు లెప్ట్ హ్యాండ్‌తో బౌలింగ్ చేసిన నివేదన్ రాధాకృష్ణన్.. ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్‌కు రైట్ హ్యాండ్‌తో బౌలింగ్ చేయడం విశేషం. దాంతో.. వెస్టిండీస్ యువ జట్టు నివేధన్ రాధాకృష్ణన్బౌలింగ్‌ని ఎదుర్కొనేందుకు చాలా ఇబ్బందిపడింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 40.1 ఓవర్లలో 169 పరుగులకి కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసిన నివేధన్ రాధాకృష్ణన్48 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా యువ జట్టులో 10 ఓవర్ల కోటాని పూర్తి చేసిన బౌలర్ నివేధన్ రాధాకృష్ణన్ మాత్రమే కావడం విశేషం. అనంతరం 170 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 44.5 ఓవర్లలో 170/4తో ఛేదించేసింది. నివేధన్ రాధాకృష్ణన్తనకి ఆరేళ్ల వయసు నుంచే తండ్రి సూచన మేరకు రెండు చేతులతో బౌలింగ్ చేయడాన్ని ప్రాక్టీస్ చేశాడు.

తమిళనాడుకు చెందిన నివేధన్ రాధాకృష్ణన్కుటుంబం అతని10 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియా వలస వెళ్లి స్థిరపడింది. అక్కడే క్రికెటర్‌గా కెరీర్ ప్రారంభించిన నివేధన్ తన వినూత్నమైన బౌలింగ్‌తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బౌలర్లకు రెండు చేతులతో బౌలింగ్ చేసే వెసులు బాటు కల్పించాలని కోరాడు. బ్యాట్స్‌మన్ స్విచ్, రివర్స్ స్వీప్ షాట్లు ఆడుతున్నట్లు బౌలర్లు కూడా అంపైర్ల అనుమతి లేకుండా రెండు చేతులా బౌలింగ్ చేసే అనుమతివ్వాలన్నాడు.

'అంపైర్ల అనుమతి లేకుండానే రెండు చేతులతో బౌలింగ్ చేసే వెసులుబాటు బౌలర్లకు కల్పించాలి. బ్యాట్స్‌మన్ రివర్స్ స్వీప్, స్విచ్ హిట్ ఆడుతున్నట్లు బౌలర్ల కూడా రెండు చేతులతో బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వాలి. అప్పుడే బ్యాటర్, బౌలర్‌కు సమప్రాధాన్యం లభిస్తుంది'అని నివేధన్ చెప్పుకొచ్చాడు.

స్పెషల్ టాలెంట్ ఉన్న 19 ఏళ్ల నివేదన్ రాధాకృష్ణన్‌కు గత ఏడాదే ఐపీఎల్‌లోని ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి పిలుపు వచ్చింది. అయితే.. నెట్ బౌలర్‌‌గా మాత్రమే అతన్ని ఢిల్లీ ఎంపిక చేసింది. తాజ అండర్ 19 ప్రపంచకప్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన అతను ఐపీఎల్ 2022 మెగా వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉంది.

Story first published: Saturday, January 15, 2022, 19:59 [IST]
Other articles published on Jan 15, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X