న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీతో ఉన్న ఆ ఫొటోను నా రూమ్‌లో పెట్టుకొని రోజు చూస్తా: సూర్యకుమార్ యాదవ్

 Suryakumar Yadav says framed photograph of Virat Kohli appreciating me Up front in my trophy room

న్యూఢిల్లీ: ఆసియాకప్ 2022లో భాగంగా హాంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ దుమ్మురేపిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 68 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. ఇన్నింగ్స్ అనంతరం విరాట్ కోహ్లీ అతనికి టేకే బౌ ఇచ్చాడు. నీ బ్యాటింగ్ సలాం అంటూ వంగి వంగి దండాలు పెట్టాడు. అప్పట్లో ఈ వీడియో వైరల్‌గా మారింది. అయితే ఈ ఫొటోను ఎవరైనా గిఫ్ట్‌‌గా ఇస్తే తన ట్రోఫీ రూమ్‌లో పెట్టుకొని జీవితాంతం రోజుకు ఒకసారి చూస్తానని తాజాగా సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు.

జీవితాంతం రోజుకు ఒకసారి..

ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న సూర్యకుమార్ యాదవ్.. ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో నిర్వహించిన ర్యాపిడ్ ఫైర్‌లో ఆసక్తికర సమాధానాలు చెప్పాడు. హాంగ్ కాంగ్‌తో మ్యాచ్‌లో కోహ్లీ టేకే బౌ ఇచ్చిన ఫొటోను గిఫ్ట్‌గా ఇస్తే ఏం చేస్తావని ప్రశ్నించగా.. ట్రోఫీ రూమ్‌లో పెట్టుకొని రోజు ఉదయం లేవగానే ఒకసారి చూస్తానని చెప్పాడు. సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌తో కోచింగ్ సెషన్ ఉంటే అతన్ని ఏం అడుగుతావని ప్రశ్నించగా.. వెన్ను ఎలా సమన్వయం చేసుకుంటున్నారని ప్రశ్నిస్తానని సూర్య బదులిచ్చాడు.

మరో చాన్సే లేదు.. కోహ్లీనే విన్నర్..

మరో చాన్సే లేదు.. కోహ్లీనే విన్నర్..

హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, సూర్య మధ్య 100 మీటర్ల పరుగుపందెం పెడితే ఎవరు గెలుస్తారని ప్రశ్నించగా.. విరాట్ కోహ్లీనేనని మరో ముచ్చటే లేదని సూర్య పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌తో అరంగేట్ర మ్యాచ్‌లో (31 బంతుల్లో51) చేసిన హాఫ్ సెంచరీ తన అత్యుత్తమ టీ20 ఇన్నింగ్స్ అని పేర్కొన్నాడు. టీమిండియా బెస్ట్ బీచ్ బాడీ కలిగిన ఆటగాళ్లు ఎవరని ప్రశ్నించగా.. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా అని సూర్య బదులిచ్చాడు. నీ కెరీర్‌లో ఫ్యామిలీతో చూడగలిగిన బెస్ట్ ఇన్నింగ్స్ ఏదని ప్రశ్నించగా.. 2019లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ ఆడిన క్వాలిఫయర్ 1 అని తెలిపాడు.

ఆ మైదానంలో సిక్స్‌లు కొట్టడం..

ఆ మైదానంలో సిక్స్‌లు కొట్టడం..

హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లో ఎవరూ ఎక్కువగా ఫ్యాషనబుల్‌గా ఉంటారనే సూర్య రాహుల్ పేరు చెప్పాడు. ఈ ప్రపంచంలో అందమైన క్రికెటర్ విరాట్ కోహ్లీ అని చెప్పిన సూర్య.. ముంబైలో అందరూ తినవల్సిన స్ట్రీట్ ఫుడ్ పావ్ బజ్జీ అని తెలిపాడు. టీమ్‌తో కలిసి మ్యాచ్ చూస్తున్నప్పుడు ఇషాన్ కిషన్ ఎక్కువగా మాట్లాడుతాడని సూర్య పేర్కొన్నాడు. కోహ్లీ, సూర్య మధ్య వాగ్వాదం జరిగితే ఎవరు గెలుస్తారనగా తానే అని చెప్పాడు. కీరన్ పొలార్డ్ మాట్లాడే బాషా విధానం తనకు అర్థం కాదని, అతని స్లాంగ్ తనకు చాలా కష్టంగా ఉంటుందని చెప్పాడు. చెపాక్ మైదానంలో సిక్స్‌లు కొట్టడం తనకు చాలా కష్టమని తెలిపాడు.

సూపర్ ఫామ్‌లో..

సూపర్ ఫామ్‌లో..

ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. తొలి టీ20లో అజేయ సెంచరీతో జట్టును ఒంటి చేత్తో గెలిపించిన అతను రెండో టీ20లో విఫలమైనా.. వర్షం కారణంగా మ్యాచ్ టై అవ్వడంతో సిరీస్ భారత్ వశమైంది. వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విఫలమైన సూర్య.. ఆదివారం జరిగే రెండో మ్యాచ్‌లో సత్తా చాటేందుకు సిద్దమవుతున్నాడు. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

Story first published: Saturday, November 26, 2022, 15:40 [IST]
Other articles published on Nov 26, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X