న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బతికుంటే ఐపీఎల్ గురించి ఆలోచిద్దాం : సురేశ్ రైనా

Suresh Raina Says When Life Gets Better, We Can Think About IPL
IPL 2020 : Life is More Important Than IPL, Suresh Raina Opens Up

హైదరాబాద్: కరోనా కకలావికలం చేస్తున్న తరుణంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ కోసం మరికొద్ది రోజులు నిరీక్షించాల్సిందేనని టీమిండియా సీనియర్ క్రికెటర్ సురేశ్ రైనా తెలిపాడు. జీవితం కంటే ఏది విలువైనది కాదనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలని సూచించాడు.

ఇక కరోనా వైరస్‌ కారణంగా క్రీడా టోర్నీలు రద్దయిన విషయం తెలిసిందే. మార్చి 29న జరగాల్సిన ఐపీఎల్ కూడా ఏప్రిల్ 15కు వాయిదా పడింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల్లో ఈ క్యాచ్ రిచ్ లీగ్ జరుగుతుందో లేదోననే అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సురేశ్ రైనా మాట్లాడుతూ.,.. మన జీవితాలు ముందు బాగుంటేనే.. మిగతా అంశాలు గురించి ఆలోచించ గలమని తెలిపాడు

ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు..

ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు..

‘జీవితం కంటే ఏదీ ముఖ్యం కాదు.. మన జీవితాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. మనం చేసే పని కంటే కూడా ముందు జీవితానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఐపీఎల్‌ కోసం మనం నిరీక్షించడం ఒక్కటే మన ముందున్న మార్గం. కరోనా వైరస్‌ మహమ్మారి వల్ల ఎన్నో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మనం ఆ సంక్షోభం నుంచి బయటపడాలి' అని రైనా పేర్కొన్నాడు. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్‌కు అంతా సహకరించాలన్నాడు. మనల్ని మనం రక్షించుకోవడమే మనముందున్న మార్గమని తెలిపాడు. అందుకు సాధ్యమైనంత వరకూ ఇంట్లో ఉండటమే ఉత్తమ మార్గమని రైనా సూచించాడు.

52లక్షల విరాళం..

52లక్షల విరాళం..

క‌రోనా వైర‌స్‌పై ప్ర‌భుత్వం చేస్తున్న పోరాటానికి చేయూత అందించాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ పిలుపునిచ్చిన పిలుపుకు రైనా స్పందించిన సంగ‌తి తెలిసిందే. తనవంతు సాయంగా రైనా రూ. 52 ల‌క్ష‌ల రూపాయ‌ల ఆర్థిక సాయాన్ని పీఎం కేర్స్‌కు అందజేశాడు. ఈ సాయానికి ప్రధాని కూడా స్పందించారు. రైనాకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

మరోసారి తండ్రైన రైనా..

మరోసారి తండ్రైన రైనా..

గత నెలలో రైనా రెండోసారి తండ్రి అయ్యాడు. అతని భార్య ప్రియాంక.. బాబుకు జన్మనిచ్చింది. అతనికి రియో రైనాగా నామకరణం చేశాడు. అంతకుముందు ఈ జంట గ్రేసియా రైనాకు జన్మనివ్వగా, గత నెల చివరి వారంలో బాబుకు జన్మనిచ్చారు. బాబు రియో పుట్టినందుకు రైనా ఘనంగా వేడుకలు జరుపుకోవాలనుకున్నాడు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని వాయిదా వేసుకున్నాడు.

Story first published: Friday, April 3, 2020, 20:45 [IST]
Other articles published on Apr 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X