న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జుట్టును తాకానని ఆ ఆసీస్ పేసర్ కోప్పడ్డాడు: సురేశ్ రైనా

Suresh Raina recalls when Doug Bollinger lost his cool at him

ముంబై: క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ సెంచరీ, హాఫ్ సెంచరీ చేసినా.. బౌలర్ వికెట్ తీసినా..ఫీల్డర్ రనౌ చేసినా.. మైదానంలో సహచర ఆటగాళ్లతో సెలెబ్రేట్ చేసుకోవడం సర్వసాధారణం. అయితే ఇలా తన సహచర ఆటగాడు వికెట్ తీసాడనే ఆనందంలో ఓ సారి జుట్టును నిమిరి అతని ఆగ్రహానికి గురయ్యానని టీమిండియా సీనియర్ క్రికెటర్ సురేశ్ రైనా తెలిపాడు.

<strong>బీసీసీఐ, ఐసీసీల మధ్య ట్యాక్స్ వార్.. ఒప్పందాలు రద్దు చేసుకుంటామని వార్నింగ్!</strong>బీసీసీఐ, ఐసీసీల మధ్య ట్యాక్స్ వార్.. ఒప్పందాలు రద్దు చేసుకుంటామని వార్నింగ్!

 సెలెబ్రేషన్స్‌లో ముందుంటాడు..

సెలెబ్రేషన్స్‌లో ముందుంటాడు..

చెన్నైసూపర్ కింగ్స్ సూపర్ ప్లేయర్ అయిన రైనాను ఆ ఫ్రాంచైజీ అభిమానులు చిన్న తాళ అని పిలస్తుంటారు. ఇక మైదానంలో చాలా చురుకుగా ఉండే రైనా.. బౌలర్లు వికెట్ సెలెబ్రేషన్స్‌లోనూ చాలా ముందుంటాడు. అతను సర్కిల్లో ఉన్నా.. బౌండరీ లైన్ వద్ద నిల్చున్నా.. దాంతో సంబంధం లేకుండా పరుగెత్తుకొచ్చి బౌలర్‌తో సంబరాలు చేసుకుంటాడు. ఇలానే తన సంతోషం వ్యక్తం చేయబోయి తన సహచర ఆటగాడు, ఆసీస్ పేసర్ డౌగ్ బొలింగర్ ఆగ్రహానికి గురైనట్లు రైనా గుర్తు చేసుకున్నాడు.

విగ్ ఊడిరావడం చూసి చాలా భయపడ్డా..

విగ్ ఊడిరావడం చూసి చాలా భయపడ్డా..

స్పోర్ట్స్ స్క్రీన్ యూట్యూబ్ చానెల్‌తో ఇటీవల మాట్లాడిన రైనా చాలా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో 2010 ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డౌగ్ బొలింగర్తో జరిగిన విచిత్రమైన సంఘటనను గుర్తు చేసుకున్నాడు.

‘డౌ బొల్లింగర్‌తో జరిగిన ఆ ఘటన ఇప్పటికీ గుర్తుంది. వాస్తవానికి నేను చాలా భయపడ్డా. ఐపీఎల్ 2010 సీజన్‌లో చెన్నై వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను సౌరవ్ గంగూలీకి బౌలింగ్ చేసి ఎల్బీడబ్ల్యూ‌గా పెవిలియన్ చేర్చాడు. చాలా క్షిష్ట స్థితిలో కీలక వికెట్ పడటంతో నేను రెట్టించిన ఉత్సాహంతో బొల్లింగర్ దగ్గరకు వచ్చి అతని జట్టును లాగాను. అయితే అతను విగ్ పెట్టుకోవడంతో అది మొత్తం వచ్చేసింది

కిక్కిరిసిన మైదానంలో విగ్ ఊడిరావడంతో బొల్లింగర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. అతను ‘మీరు నా జట్టును తాకవద్దని ఎంతో ప్రయత్నించా'అనేటట్లు నా వైపు కోపంగా చూశాడు. ఆ ఘటన అనంతరం మైదానంలో కొంత భౌతిక దూరం పాటిస్తూ సంబరాలు చేసుకున్నా'అని రైనా నవ్వుతూ చెప్పుకొచ్చాడు.

అతనే బెస్ట్ ఫీల్డర్..

అతనే బెస్ట్ ఫీల్డర్..

భారత టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్ అజింక్యా రహానే జట్టులో అత్యుత్తమ ఫీల్డర్ అని రైనా తెలిపాడు. ‘‘రహానే అద్భుతంగా క్యాచ్‌లు అందుకుంటాడు. అతనిలో ఓ విభిన్నమైన శక్తి ఉంది. అతని శరీరం అతను ఎలా చెబితే అలా కదులుతుంది. అతను అత్యుత్తమమైన స్లిప్ ఫీల్డర్, బ్యాట్స్‌మెన్ కదలికలను పసిగట్టి.. క్యాచ్‌లు అందుకొనేందుకు ఎదురుచూస్తుంటాడు. అది చాలా ముఖ్యం. ఎందుకంటే.. బ్యాట్స్‌మెన్‌‌కు, స్లిప్ ఫీల్డర్‌‌కు మధ్య దూరం తక్కువ ఉంటుంది'' అని రైనా తెలిపాడు.

భారత్ తరఫున చివరిసారిగా..

భారత్ తరఫున చివరిసారిగా..

ఇప్పటి వరకు భారత్ తరఫున రైనా 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. 2006లో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన రైనా.. టీ20ల్లో 134.79 స్ట్రైక్‌రేట్‌తో 1,604 పరుగులు చేశాడు. గత ఏడాది జూలైలో చివరిగా వన్డే ఆడిన రైనా.. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం రీఎంట్రీ కోసం రైనా ఎదురుచూస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ జరగనుండగా.. ఎలాగైనా ఆ టోర్నీలో ఆడాలనే సంకల్పంతో ఉన్నాడు.

భారత హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ కన్నుమూత

Story first published: Monday, May 25, 2020, 14:27 [IST]
Other articles published on May 25, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X