For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ కన్నుమూత

Hockey legend and triple Olympic gold medallist Balbir Singh Sr passes away
Balbir Singh Sr, Triple Olympic Gold Medallist Hockey Legend Passes Away

చండీగఢ్‌ : భారత హాకీ దిగ్గజం‌ బల్బీర్‌ సింగ్‌(95) కన్నుమూశారు. మెదడు సంబంధిత వ్యాధితో మొహాలీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు(సోమవారం) ఉదయం తుదిశ్వాస విడిచారు. ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడుసార్లు స్వర్ణ పతకాలు తీసుకురావడంలో బల్బీర్‌సింగ్‌ కీలక పాత్ర పోషించారు. అనారోగ్యంతో ఈ నెల 8న ఆసుపత్రిలో చేరిన బల్బీర్‌ సింగ్‌కు కొన్ని రోజులుగా వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయితే అప్పటికే ఆయన‌ ఆరోగ్యం క్షీణించిందని ఫార్టిస్‌ ఆస్పత్రి డైరెక్టర్‌ అభిజిత్‌ సింగ్‌ మీడియాకు తెలిపారు. ఈరోజు ఆరోగ్యం మరింత క్షీణించడంతో మృతి చెందినట్లు వెల్లడించారు.

ఏకైక ఆసియా అథ్లెట్

ఏకైక ఆసియా అథ్లెట్

ఆధునిక ఒలింపిక్‌ చరిత్రలో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ ప్రకటించిన 16 మంది దిగ్గజాలలో బల్బీర్‌ ఒకరు. ఈ ఘనత సాధించిన ఏకైక భారత అథ్లెట్‌, ఆసియా ఆటగాడిగా ఆయన గుర్తింపుపొందారు. అలాగే ఒలింపిక్స్‌ హాకీ ఫైనల్స్‌ చరిత్రలో 1952లో నెదర్లాండ్స్‌తో తలపడిన మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత గోల్స్‌ సాధించిన ఘనత బల్బీర్‌కే దక్కింది. ఈ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు.

శాండ్‌విచ్ తింటుంటే బ్యాటింగ్‌కు వెళ్లమన్నాడు: సురేశ్ రైనా

 చెక్కు చెదరని రికార్డు..

చెక్కు చెదరని రికార్డు..

నెదర్లాండ్స్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో బల్బీర్ ఐదు గోల్స్ చేయగా.. భారత్ 6-1తో ఘన విజయాన్ని అందుకుంది. అతని కెప్టెన్సీలో భారత్ జట్టు 1956 ఒలింపిక్స్‌లో ఏకంగా 38 గోల్స్ చేసి అరుదైన ఘనత సాధించింది. ఇక 1948లో జరిగిన లండన్ ఒలింపిక్స్‌లో ఇంగ్లాండ్‌పై ఫైనల్లో 4-0 తేడాతో భారత్ గెలవడం అప్పట్లో పెద్ద సంచలనం.

టీమిండియాలో అతనే బెస్ట్ ఫీల్డర్: సురేశ్ రైనా

పద్మశ్రీ అవార్డుతో..

పద్మశ్రీ అవార్డుతో..

1948, 1952, 1956లో ఒలింపిక్స్‌లో స్వర్ణాలు సాధించిన భారత హాకీ జట్టులో బల్బీర్‌ కీలక పాత్ర పోషించారు. 1957లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది. ఆ తర్వాత 2015లో మేజర్ ధ్యాన్‌చంద్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో హాకీ ఇండియా సత్కరించింది. 1982లో పాట్రియోట్ న్యూస్ పేపర్ నిర్వహించిన పోల్‌తో బల్బీర్ ఇండియన్ స్పోర్ట్స్ ఆఫ్ ది సెంచరీగా గుర్తింపు పొందారు. ఇక ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం భారత హాకీ జట్టుకు కోచ్‌గా, మేనేజర్‌గా కూడా ఆయన సేవలందించారు. 1975 పురుషుల హాకీ ప్రపంచకప్‌ భారత్ గెలవడంలో కోచ్‌గా బల్బీర్‌ది కీలక పాత్ర.

Story first published: Monday, May 25, 2020, 10:21 [IST]
Other articles published on May 25, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+