#BringBackWarner ట్రెండింగ్.. మా డేవిడ్ భాయ్‌ను వెనక్కితేండి.. నెట్టింట ఫ్యాన్స్ బీభత్సం!

IPL 2021 : Warner లేని SRH హీరో లేని తెలుగు సినిమా | #BringBackDavidWarner || Oneindia Telugu

న్యూఢిల్లీ: ఓవైపు కరోనా కలకలంతో ఐపీఎల్ 2021 సీజన్‌పై నీలినీడలు కమ్ముకోగా.. మరోవైపు డేవిడ్ వార్నర్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ నెట్టింట బీభత్సం సృష్టిస్తున్నారు. తమ అభిమాన ఆటగాడికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇక సీజన్ మధ్యలో డేవిడ్ వార్నర్‌పై వేటు వేసిన సన్‌రైజర్స్ యాజమాన్యం టీమ్ సారథ్య బాధ్యతలను కేన్ విలియమ్సన్‌కు అప్పగించిన విషయం తెలిసిందే.

అంతేకాకుండా ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఒంటి చేత్తో ఎన్నో విజయాలతో పాటు టైటిల్ అందించిన వార్న‌ర్‌‌ను తుది జట్టులో నుంచి కూడా తప్పించారు. తమ ప్రణాళికల్లో భాగంగా అతను ఈ సీజన్‌లో మళ్లీ ఆడకపోవచ్చని కూడా తెలిపారు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఫ్యాన్స్.. వార్నర్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.

యాష్ ట్యాగ్ ట్రెండ్..

ముంబై ఇండియన్స్‌తో నేడు(మంగళవారం) సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ రెండో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌ నేపథ్యంలో వార్నర్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ #BringBackWarner అనే యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఐపీఎల్ అతను సాధించిన ఘనతలు, పరుగుల గణంకాలను షేర్ చేస్తూ.. డేవిడ్ భాయ్‌ను తీసుకోవాల్సిందేనని తమ గళాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. డేవిడ్ వార్నర్ లేకుండా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఊహించుకోవడం అంటే హీరో లేకుండా తెలుగు సినిమా తియడం లాంటిదేనని కామెంట్ చేస్తున్నారు.

ఫ్యామిలీతో కలిసి..

డేవిడ్ వార్నర్ జట్టుతో ఎంతో అనుబంధం ఏర్పరుచుకున్నాడని, తన ఫ్యామిలీతో కలిసి కూడా ఆరెంజ్ ఆర్మీకి మద్దతుగా నిలిచాడని గుర్తు చేస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడే మ్యాచ్‌లకు ముందు డేవిడ్ వార్నర్ భార్యా క్యాండిస్ వార్నర్, పిల్లలూ ఆరెంజ్ ఆర్మీ జెర్సీలు ధరించి శుభాకాంక్షలు తెలిపేవారు. ఈ ఫొటోలను షేర్ చేస్తున్న అభిమానులు మిగిలిన జట్లకు నాయకత్వం వహిస్తున్న విదేశీ క్రికెటర్ల ఫ్యామీలు కాదు కదా, భారత క్రికెటర్ల ఫ్యామిలీలు కూడా ఇంత అనుబంధం ఏర్పరుచుకోలేదని ఘాటుగా విమర్శిస్తున్నారు.

వార్నర్ ఓ ఏమోషన్..

సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌ను నాలుగు సార్లు ప్లే ఆఫ్ చేర్చి, 2016లో 800కిపైగా పరుగులు చేసి టైటిల్ అందించిన డేవిడ్ వార్నర్‌ను ఇలా జట్టులో నుంచి తీసేసి అవమానిస్తుంటే చూస్తూ సహించబోమని ఫ్రాంచైజీని హెచ్చరిస్తున్నారు. కెప్టెన్‌గా కేన్ మామను నియమించడాన్ని తప్పుబట్టడం లేదని, కానీ డేవిడ్ వార్నర్‌ను జట్టులో కొనసాగించాలని సూచిస్తున్నారు. అతను సన్‌రైజర్స్ ఏమోషన్ అని కామెంట్ చేస్తున్నారు. సౌతిండియా ఫేవరెట్ మూవీ కేజీఎఫ్ పవర్ ఫుల్ డైలాగ్స్‌తో మీమ్స్ షేర్ చేస్తున్నారు. ‘అతన్ని ఒక్కసారి డ్రాప్ చేశారు.. ఐపీఎల్ మొత్తం వణికింది'అనే మీమ్ ఆకట్టుకుంటుంది.

ఏ అన్యాయం చేసాడు రా..?

వార్నర్ ఏం అన్యాయం చేశాడని తప్పించారని, సన్‌రైజర్స్ డైమండని మరికొందరూ కామెంట్ చేస్తున్నారు. గంట వ్యవధిలోనే 50వేలకు పైగా ట్వీట్లతో వార్నర్‌గా అండగా నిలిచారు. ఇతర ఫ్రాంచైజీ అభిమానులు కూడా వార్నర్‌ను తీసుకోవాలని సూచిస్తున్నారు. జట్టు కోసం ఎంతో చేసిన ఆటగాడిని.. ఒక్క బ్యాడ్ సీజన్‌తో ఇంతలా అవమానపర్చడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, May 4, 2021, 10:46 [IST]
Other articles published on May 4, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X