న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా బౌలింగ్ కోచ్ రేసులో మాజీ స్పిన్ మాంత్రికుడు

Sunil Joshi Applies for Team India Bowling Coach Post || Oneindia Telugu
Sunil Joshi applies for bowling coach’s job, says India need a spin expert

హైదరాబాద్: టీమిండియా మాజీ స్పిన్నర్ సునీల్ జోషి టీమిండియా బౌలింగ్‌ కోచ్‌ పదవికి దరఖాస్తు చేశారు. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టుకు ఓ స్పిన్ మాంత్రికుడు అవసమనే ఉద్దేశ్యంతో తాను ఈ పదవికి దరఖాస్తు చేసుకున్నట్లు సునీలో జోషి తెలిపారు.

యాషెస్: జాక్వస్ కల్లిస్ బ్యాటింగ్ రికార్డుని సమం చేసిన స్టీవ్ స్మిత్

టీమిండియా హెడ్ కోచ్‌తో పాటు బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ సహా పలు ఇతర విభాగాలకు చెందిన సిబ్బంది నియామకానికి బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. కోచ్‌ల దరఖాస్తుల స్వీకరణకు ఆఖరి తేదీని జులై 30గా బీసీసీఐ నిర్ణయించింది. దీంతో పలువురు దరఖాస్తు చేసుకున్నారు.

2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా ఓటమి తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీతో విబేధాలు నెలకొనడం... ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో హెడ్ కోచ్‌ పదవి నుంచి అనిల్ కుంబ్లే తప్పుకున్న తర్వాత టీమిండియా ప్రత్యేకించి స్పెషలిస్ట్ స్పిన్ కన్సల్టెంట్ అంటూ ఎవరూ లేరు.

సునీల్ జోషి మాట్లాడుతూ

సునీల్ జోషి మాట్లాడుతూ

ఈ నేపథ్యంలో సునీల్ జోషి మాట్లాడుతూ "అవును, బౌలింగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేశాను. బంగ్లాదేశ్‌ జట్టుతో అద్భుతమైన రెండున్నర ఏళ్ల కోచింగ్ అనుభవం నా సొంతం. దీంతో నా తదుపరి ఛాలెంజ్‌కు నేను సిద్ధంగా ఉన్నాను. టీమిండియాకు సరైన స్పెషలిస్ట్ స్పిన్ కోచ్ అంటూ ఎవరూ లేరు. దీంతో నా అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటారని భావిస్తున్నా" అని అన్నారు.

పొలార్డ్‌కు జరిమానా.. మ్యాచ్‌ ఫీజులో 20 శాతం కోత

టీమిండియాకు స్పెషలిస్ట్ స్పిన్ కోచ్ అవసరం

టీమిండియాకు స్పెషలిస్ట్ స్పిన్ కోచ్ అవసరం

"మీరు చూస్తే, చాలా అంతర్జాతీయ జట్లకు వారి సహాయక సిబ్బందిలో కోచ్‌లు ఉంటారు. ఇది పేస్ బౌలింగ్ కోచ్ లేదా స్పిన్ కోచ్ కావచ్చు. భారత జట్టుకు కూడా అలాగే స్పెషలిస్ట్ స్పిన్ కోచ్ అవసరం. ఇది నేను లేదా వేరొకరి అయినా నాకు పెద్దగా పట్టింపు లేదు" అని 49 ఏళ్ల సునీల్ జోషి చెప్పుకొచ్చాడు.

1996 నుంచి 2001 మధ్య కాలంలో

1996 నుంచి 2001 మధ్య కాలంలో

ఇక, సునీల్ జోషి విషయానికి వస్తే 1996 నుంచి 2001 మధ్య కాలంలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. భారత్ తరుపున 15 టెస్టులు ఆడి 35.85 యావరేజితో 41 వికెట్లు... 36.36 యావరేజితో 69 వికెట్లు పడగొట్టాడు. ఇక, 160 ఫస్ట్ క్లాస్ గేమ్స్ ఆడి 25.12 యావరేజితో 615 వికెట్లు పడగొట్టాడు.

ట్విటర్‌లో వైరల్.. 'బిగ్గెస్ట్‌ బాస్‌'తో విరాట్ కోహ్లీ

ద‌క్షిణాఫ్రికాపై అత్యుత్త‌మ గ‌ణాంకాల‌ు

ద‌క్షిణాఫ్రికాపై అత్యుత్త‌మ గ‌ణాంకాల‌ు

ద‌క్షిణాఫ్రికాపై అత్యుత్త‌మ గ‌ణాంకాల‌ను న‌మోదు చేశారు. కేవ‌లం ఆరు ప‌రుగుల‌ను ఇచ్చి అయిదు వికెట్ల‌ను ప‌డ‌గొట్టిన ఘ‌న‌త సునీల్ జోషికి ఉంది. ఇప్ప‌టిదాకా- ఆ రికార్డును ఏ స్పిన్న‌ర్ కూడా చెరిపేయ‌లేదు.అం తర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత సునీల్ జోషి రంజీ క్రికెట్‌లో పలు జట్లకు కోచ్‌గా వ్వవహారించాడు.

Story first published: Tuesday, August 6, 2019, 15:46 [IST]
Other articles published on Aug 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X