న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sunil Gavaskar: టెస్ట్ కెప్టెన్సీ రోహిత్ వల్ల కాదు.. కోహ్లీ‌లాంటి గట్టోడు కావాలి!

Sunil Gavaskar says Why He Has Doubts Over Making Rohit Sharma Test Captain
Team India Test Captain : Doubts On Rohit Sharma's Test Captaincy | Oneindia Telugu

న్యూఢిల్లీ: టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు నుంచి తప్పుకుంటూ విరాట్ కోహ్లీ అనూహ్య నిర్ణయం తీసుకోవడంతో తదుపరి సారథి ఎవరా? అనే చర్చ మొదలైంది. పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మకే టెస్ట్ సారథ్య బాధ్యతలు కూడా అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే టీమిండియా టెస్ట్ సారథ్యం రోహిత్ శర్మ వల్ల కాదని దిగ్గజ బ్యాట్స్‌మన్ సునీల్ గవాస్కర్ అన్నాడు. తరుచూ ఫిట్ నెస్ సమస్యలతో బాధపడే రోహిత్ శర్మ‌కు బదులు మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీలా ఫిట్‌గా ఉంటూ.. అన్ని మ్యాచులకు అందుబాటులో ఉండే ఆటగాడికే అవకాశమివ్వాలని సూచించాడు.

రోహిత్ శర్మ ఫిట్‌నెసే..

రోహిత్ శర్మ ఫిట్‌నెసే..

'భారత జట్టును నడిపించాలంటే ఫిట్‌నెస్ చాలా ముఖ్యం. ప్రస్తుతం టెస్టు కెప్టెన్సీ రేసులో సీనియర్‌ ఆటగాడు రోహిత్‌ శర్మ ముందంజలో ఉన్నాడు. కానీ, అతని ఫిట్‌నెస్‌ సమస్యే అందర్నీ కలవరపెడుతోంది. తొడకండరాల గాయం కారణంగా సౌతాఫ్రికా పర్యటనకు రోహిత్ దూరమయ్యాడు. భవిష్యత్తులో అది పునరావృతమయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అతడికి టెస్టు పగ్గాలు అప్పగిస్తే.. జట్టును నడిపించగలడా? అనే సందేహం కలుగుతోంది.

కోహ్లీలాంటి ఫిట్‌నెస్ ఉన్నోడు..

కోహ్లీలాంటి ఫిట్‌నెస్ ఉన్నోడు..

టీమిండియా భవిష్యత్తు దృష్ట్యా.. విరాట్ కోహ్లీలా ఫిట్‌గా ఉండి, సుదీర్ఘకాలం కెప్టెన్‌గా కొనసాగే ఆటగాడిని ఎంచుకోవాలి. కెప్టెన్‌గా ప్రతీ మ్యాచ్‌కు అందుబాటులో ఉండే ఆటగాడు అవసరం. పొట్టి ఫార్మాట్‌లో కెప్టెన్‌గా రోహిత్‌ శర్మకు తిరుగులేని రికార్డుంది. దాన్ని ఎవరూ కాదనలేరు. 34 ఏళ్ల హిట్‌మ్యాన్‌ ఎంత కాలం టెస్టు క్రికెట్లో కొనసాగుతాడో కచ్చితంగా చెప్పలేం. ఇలాంటి పరిస్థితుల్లో అతనికి టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించి మరింత ఒత్తిడి పెంచవద్దు.'అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

పంత్ సరైనోడు..

పంత్ సరైనోడు..

భార‌త జ‌ట్టు త‌ర్వాతి టెస్టు కెప్టెన్‌గా యువ ఆట‌గాడైనా వికెట్ కీప‌ర్ రిష‌భ్ పంత్‌కు అవకాశం ఇవ్వాలని గవాస్కర్ అభిప్రాయ‌ప‌డ్డాడు. యువ ఆట‌గాడైనా రిష‌భ్ పంత్‌కు ఆ అవ‌కాశం ఇవ్వ‌డం ద్వారా భార‌త జ‌ట్టుకు సుదీర్ఘ కాలం పంత్ కెప్టెన్‌గా ఉండ‌డానికి అవ‌కాశం ఉంటుందని తెలిపాడు. అలాగే ఐపీఎల్‌లో రికీ పాంటింగ్ ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్‌గా త‌ప్పుకున్న‌ప్పుడు రోహిత్ శ‌ర్మ‌కు ఆ బాధ్య‌త అప్ప‌గించార‌ని గ‌వాస్క‌ర్ గుర్తు చేశాడు. దీంతో రోహిత్ కెప్టెన్సీతోపాటు బ్యాటింగ్‌లోనూ బాగా రాణించాడ‌ని తెలిపాడు. అలాగే రిష‌బ్ పంత్‌కు కూడా టీమిండియా కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే కెప్టెన్సీతోపాటు బ్యాటింగ్‌లోనూ మ‌రింత‌ రాణించ‌గ‌లుగుతాడ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు.

Story first published: Tuesday, January 18, 2022, 17:10 [IST]
Other articles published on Jan 18, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X