న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

251 మ్యాచ్‌ల్లో 103 సార్లంటే మాటలా! కోహ్లీ.. నువ్వు అసాధారణ ఆటగాడివోయ్!

Sunil Gavaskar says We should look forward to Virat Kohlis next 1000 runs

కాన్‌బెర్రా: వన్డే క్రికెట్‌లో 12వేల పరుగుల మైలురాయి అత్యంత వేగవంతంగా అందుకున్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై భారత దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో హాఫ్ సెంచరీతో రాణించిన కోహ్లీ(63) 12వేల పరుగులను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఫలితంగా 251 మ్యాచ్‌ల్లోనే ఈ ఫీట్‌ను సాధించిన తొలి క్రికెటర్‌గా కోహ్లీ రికార్డుకెక్కాడు. ఈ క్రమంలోనే మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును అధిగమించాడు. ఈ ఘనతపై మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన సునీల్‌ గావస్కర్‌.. కోహ్లీ అసాధారణ ఆటగాడంటూ ప్రశంసించాడు.

12వేల రన్స్ సులువా?

12వేల రన్స్ సులువా?

అన్ని ఫార్మాట్లలో విరాట్ ఆధిపత్యం కొనసాగుతుందని, అండర్‌-19 ప్లేయర్‌గా కోహ్లీని చూసిన దగ్గర్నుంచీ అతను రోజురోజుకూ మెరగవుతూనే ఉన్నాడని తెలిపాడు. ఆటను ఎప్పటికప్పుడు మార్చుకోవడానికి చాలా శ్రమింస్తున్నాడని, సూపర్‌ ఫిట్‌ క్రికెటర్‌ కావడానికి చాలా వదలుకున్నాడని లిటిల్ మాస్టర్ చెప్పుకొచ్చాడు.‘కోహ్లీ కేవలం యువ క్రికెటర్లకే ఆదర్శ కాదు.. ఫిట్‌నెస్‌పై దృష్టి సారించే వాళ్లందరికీ అతనొక స్ఫూర్తి. ఒక ఫార్మాట్‌లో 12వేలకు పైగా పరుగులంటే ఎంతో ప్రతిభ ఉండాలి. అతను ఆడిన 251 వన్డే మ్యాచ్‌ల్లో 103 సార్లు యాభైకి పైగా పరుగులు చేశాడంటే అతని ప్రదర్శన నిజంగా అసాధారణం.

మరోకరికి కష్టమే..

మరోకరికి కష్టమే..

వన్డేల్లో 43 సెంచరీలు, 60 హాఫ్‌ సెంచరీలు అతని ఖాతాలో ఉన్నాయి. అత్యంత వేగంగా విరాట్ సాధించిన ఈ ఫీట్‌ను మరొకరు సాధిస్తారని నేను అనుకోవడం లేదు.

హాఫ్‌ సెంచరీలను శతకాలుగా మార్చుకోవడానికి కోహ్లీలోని నిలకడే కారణం. విరాట్ తదుపరి వెయ్యి పరుగులు గురించి మనం వేచిచూద్దాం. మరో 5 నుంచి 6 నెలల్లోనే దాన్ని సాధిస్తాడని ఆశిద్దాం'అని గవాస్కర్ తెలిపాడు. ఆసీస్‌తో మూడో వన్డేలో కోహ్లీ 63 పరుగులకే పరిమితమయ్యాడు. దాంతో ఈ ఏడాది సెంచరీ చేయకుండా తన ఆటను ముగించాడు. 2008 తర్వాత ఓ క్యాలండర్ ఇయర్‌లో సెంచరీచేయకపోవడం కోహ్లీకి ఇదే తొలిసారి.

చాలా తెలివిగా ఆడాడు..

చాలా తెలివిగా ఆడాడు..

మూడో వన్డేలో భారత్‌ను గెలిపించిన హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలపై కూడా సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. మరీ ముఖ్యంగా పాండ్యాను పొగడ్తలతో ఆకాశానికెత్తాడు. మ్యాచ్‌కు తగ్గట్టు పాండ్యా హిట్టింగ్ చేశాడని కొనియాడాడు. 'మూడో వన్డేలో హార్దిక్ పాండ్యా చాలా తెలివిగా బ్యాటింగ్ చేశాడు. అతని ఆటలో పరిపక్వత కనిపించింది. తొలి వన్డేలో 90 పరుగుల వద్ద ఔటయ్యాడు. మూడో వన్డేలో విరాట్ కోహ్లీ ఔటైన తర్వాత.. తాను చివరి వరకూ క్రీజులో ఉండాల్సిన అవసరాన్ని హార్దిక్ గుర్తించాడు' అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, December 3, 2020, 15:22 [IST]
Other articles published on Dec 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X