న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరో 20 నుంచి 30 రన్స్ చేస్తే 2011 ప్రపంచకప్ గెలిచేవాళ్లం: శ్రీలంక క్రికెటర్

Sri Lanka star allrounder Angelo Mathews recalls 2011 World Cup final loss to India


కొలంబో: భారత్-శ్రీలంక మధ్య ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా జరిగిన 2011 ప్రపంచకప్ ఎన్నో మలుపులు.. మరెన్నో భావోద్వేగాలతో ఓ థ్రిల్లింగ్ సినిమాను తలపించింది. టాస్ అయోమయంతో ప్రారంభమైన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేపట్టిన లంక.. మహేళ జయవర్దనే సెంచరీతో భారత్ ముందు భారీ లక్ష్యాన్నే ఉంచింది. అనంతరం ఆదిలోనే ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్‌ను కోహ్లీ-గంభీర్ కీలక భాగస్వామ్యంతో గట్టెక్కించగా.. ధోనీ ముందుకు తీసుకెళ్లాడు. ఒత్తిడిని అధిగమించలేక గంభీర్ శతకం చేజార్చుకున్నా.. యూవీతో కలిసి మహీ కులశేఖర బౌలింగ్‌లో అద్భుత సిక్సర్‌తో చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తూ చిరస్మరణియ విజయాన్నందించాడు. అయితే ఈ మ్యాచ్‌లో లంక మరో 20 నుంచి 30 రన్స్ చేస్తే ఫలితం వేరేలా ఉండేదని ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ అన్నాడు. ఓ యూట్యూబ్ చాట్‌షోలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
IND VS SL 2020 : Sri Lanka Recall Angelo Mathews For The T20I Series Against India
ప్రత్యేక ప్రపంచకప్..

ప్రత్యేక ప్రపంచకప్..

‘అది నా తొలి వన్డే ప్రపంచకప్. అప్పటికే నేను 2009, 2010 టీ20 ప్రపంచకప్‌లు ఆడాను. కానీ 2011 వరల్డ్‌కప్ మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే మాకు అనుకూలమైన పరిస్థితుల్లో ఆడటం. ఫైనల్ వరకు మేం అద్భతంగా ఆడాం. ఫైనల్లో కూడా బాగానే ఆడాం. దురదృష్టవశాత్తు సెమీఫైనల్ విజయం తర్వాత ఫైనల్ కోసం ఎదురుచూస్తున్న క్రమంలో నేను గాయపడ్డా. అదే నన్ను తీవ్రంగా బాధించింది.

ఫైనల్‌కు ముందు గాయం..

ఫైనల్‌కు ముందు గాయం..

కండరాల గాయంతో కనీసం నడవలేని పరిస్థితి నెలకొంది. డాక్టర్లు కూడా నేను ఆడటం కష్టమన్నారు. కానీ అదృష్టవశాత్తు నన్ను జట్టుతో తీసుకెళ్లారు. నేను ఆడగలిగితే బరిలోకి దింపాలనుకున్నారు. కానీ అది జరగలేదు. ఇక ఫైనల్లో మేం 320 పరుగులు చేసుంటే.. బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన భారత్‌కు మేం గట్టిపోటీనిచ్చేవాళ్లం. భారత్ పిచ్‌లన్నీ రోడ్లలా ఫ్లాట్‌గా ఉంటాయి. బ్యాట్స్‌మెన్‌ను ఆపడం చాలా కష్టం. అలాగే విధ్వంసక బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత్‌ను అడ్డుకోవడం ఇంకా కష్టం. పైగా వాంఖడే కూడా పెద్ద స్డేడియం కాదు. బంతిని హిట్ చేస్తే బౌండరీకి వెళ్తుంది.

 గంభీర్-విరాట్ సూపర్ ఇన్నింగ్స్..

గంభీర్-విరాట్ సూపర్ ఇన్నింగ్స్..

మేం 20 నుంచి 30 పరుగులు చేసుంటే గెలిచేవాళ్లం. గంభీర్-విరాట్ అద్భుతంగా ఆడారు. వారికి జతగా ధోనీ మిగతా పనిని పూర్తి చేశాడు. మొత్తానికి అదో అద్భుతమైన మ్యాచ్'అని మాథ్యూస్ చెప్పుకొచ్చాడు. ఇక ధోనీకి ఇది వరుసగా రెండో ఐసీసీ టోర్నీ కాగా.. ఆ తర్వాత 2013 చాంపియన్స్ ట్రోఫీ గెలిచి.. ఐసీసీ ట్రోఫీలన్నీ గెలిచిన ఏకైక కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు.

Story first published: Monday, July 20, 2020, 15:38 [IST]
Other articles published on Jul 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X