Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: రోహిత్ వైల్డ్‌ఫైర్ షో.. లక్నో ఖేల్‌ఖతమ్!

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు తమ పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది. వరుసగా మూడు ఓటముల తర్వాత విజయాన్నందుకుంది. సోమవారం వాంఖడే మైదానం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ముంబై విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ ఓటమితో లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. 9 మ్యాచ్‌ల్లో 7 ఓటములతో ముంబై ఇండియన్స్‌‌తో కలిసి ఇంటిబాట పట్టింది.

IPL 2026 Rohit Sharma and Ryan Rickelton Power MI to Victory LSG Knocked Out of Playoffs Race

పాపం పూరన్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. నికోలస్ పూరన్(21 బంతుల్లో ఫోర్, 8 సిక్స్‌లతో 63) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగగా.. మిచెల్ మార్ష్(25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 44), ఎయిడెన్ మార్క్‌రమ్(25 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 31 నాటౌట్), హిమ్మత్ సింగ్(31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 నాటౌట్) విలువైన పరుగులు జోడించారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో కార్బిన్ బోష్(2/20) రెండు వికెట్లు తీయగా.. అల్లా ఘజన్‌ఫర్, విల్ జాక్స్, రఘు శర్మ తలో వికెట్ తీసారు.

అనంతరం ముంబై ఇండియన్స్ 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 229 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్(32 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 83), రోహిత్ శర్మ(44 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 84) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నారు. నమన్ ధీర్(12 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్2తో 23 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. లక్నో బౌలర్లలో మణిమరన్ సిద్దార్థ్(2/47) రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, మోహ్‌సిన్ నఖ్వీ చెరో వికెట్ పడగొట్టారు.

Story first published: Monday, May 4, 2026, 23:35 [IST]
Other articles published on May 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+