IPL 2026: హార్దిక్ పాండ్యాపై వేటు.. కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్?
ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై వేటు పడిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా చివరి నిమిషంలో దూరమయ్యాడు. అనారోగ్యంతో హార్దిక్ పాండ్యా ఆడటం లేదని తాత్కలిక సారథి సూర్యకుమార్ యాదవ్ చెప్పినా.. అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
వరుస వైఫల్యాల నేపథ్యంలోనే హార్దిక్ పాండ్యాను తప్పించి సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారని ఆరోపిస్తున్నారు. అనారోగ్యం అనే సాకుతో పక్కన కూర్చోబెట్టారని కామెంట్ చేస్తున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ 7 పరాజయాలతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీ కారణంగానే ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలను ఎదుర్కొందని ఆ జట్టు ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు.

కెప్టెన్సీతో పాటు ఆల్‌రౌండర్‌గానూ హార్దిక్ పాండ్యా విఫలమయ్యాడని, జట్టుకు భారంగా మారడంతోనే పక్కన కూర్చోబెట్టారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. తన ప్రియురాలు మహికా శర్మతో హార్దిక్ పాండ్యా అతిగా ప్రవర్తిస్తున్నాడని, ఈ వ్యవహారం ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్‌కు కూడా నచ్చలేదని కామెంట్ చేస్తున్నారు.
ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ ఫిర్యాదుతోనే బీసీసీఐ గర్ల్‌ఫ్రెండ్స్ అనుమతిపై ఆంక్షలు విధించేందుకు సిద్దమైందని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా హార్దిక్ పాండ్యాపై సొంత జట్టు అభిమానులే కోపంగా ఉన్నారు.గాయంతో జట్టుకు దూరమైన రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. అతని రాకతోనైనా ముంబై విజయాల బాటపట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
తుది జట్లు:
లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్/కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్, అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, మహమ్మద్ షమీ, మొహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్
ముంబై ఇండియన్స్: ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, విల్ జాక్స్, రాజ్ బావ, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, జస్‌ప్రీత్ బుమ్రా, ఎ.ఎమ్. గజన్‌ఫర్, రఘు శర్మ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications