ఒరేయ్ ఆజామూ.. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుందిరా!(వీడియో)
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్ మరోసారి నవ్వుల పాలయ్యాడు. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను కాపీ కొట్టబోయి అభాసుపాలయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారగా.. అభిమానులు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. జుగుప్సాకరమైన వ్యాఖ్యలతో సెటైర్లు పేల్చుతున్నారు.
పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) 2026 సీజన్లో బాబర్ ఆజామ్ సారథ్యం వహించిన పెషావర్ జల్మీ టీమ్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో అద్భుతమైన బ్యాటింగ్తో (588) రాణించిన బాబర్ ఆజామ్.. పెషావర్ జల్మీకి టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా టైటిల్ స్వీకరించిన బాబర్ ఆజామ్.. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం రోహిత్ శర్మ చేసిన ఐకానిక్ సెలెబ్రేషన్స్ను అనుకరించే ప్రయత్నం చేశాడు. కానీ అతని వల్ల కాకపోవడంతో మధ్యలోనే ఆపేసాడు.
అదే జట్టుకు ఆడిన ఇప్తికర్ అహ్మద్ రోహిత్ తరహాలో సెలెబ్రేట్ చేసుకుంటూ టైటిల్ అందుకున్నాడు.రోహిత్ శర్మలా బాబర్ ఆజామ్ సెలెబ్రేట్ చేసుకోకపోవడంతో ఇండియన్ ఫ్యాన్స్ అతనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. 'ఒరేయ్ ఆజామూ.. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుందిరా'అని ఎగతాళి చేస్తున్నారు.
ఈ విమర్శలను పక్కనపెడితే.. ఈ సీజన్తో బాబర్ ఆజామ్ ఫామ్ అందుకున్నాడు. పేలవ ప్రదర్శనతో పాకిస్థాన్ జట్టులో చోటు కోల్పోయిన అతను మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడు. పీఎస్ఎల్ విజయానంతరం మీడియాతో మాట్లాడిన బాబర్ ఆజామ్.. మూడు ఫార్మాట్లలో కొనసాగుతానని స్పష్టం చేశాడు. మూడు ఫార్మాట్లు ఆడటం కీలకమని, ఒక ఫార్మాట్ ఆడటం వల్ల మరో ఫార్మాట్లో మేలు జరుగుతుందని చెప్పాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ అనంతరం తన బ్యాటింగ్పై ప్రత్యేక ఫోకస్ పెట్టి, లోపాలను సరిచేసుకున్నట్లు చెప్పుకొచ్చాడు.
'ప్రపంచకప్ నుంచి వచ్చాక సరిగ్గా రాణించలేకపోయాను. చాలా నిరుత్సాహానికి లోనయ్యాను. పీఎస్ఎల్కు 10 రోజులు మాత్రమే సమయం ఉండగా.. నా తప్పులు, గేమ్ ప్లాన్ మార్పులను పరిశీలించుకున్నాను. నా టెక్నిక్, మానసిక స్థితిపై వర్క్ చేశాను. నేను నా సహజమైన ఆటను ఆడుతాను. నా క్రికెటింగ్ షాట్స్కు కట్టుబడి ఉంటాను. పిచ్, మ్యాచ్ పరిస్థితి, జట్టు డిమాండ్ ఏదైతే.. దాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నా'అని బాబర్ ఆజామ్ ముగించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications