మా అన్న గెలిచాడు: టీమిండియా స్టార్ స్పిన్నర్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తుంది. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులతో పాటు క్రికెటర్లు విజయ్ సంచలన విజయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ స్థాపించిన రెండేళ్ల వ్యవధిలోనే అధికారం దక్కించుకోవడం అద్భుతమని కొనియాడుతున్నారు.
టీమిండియా మిస్టరీ స్పిన్నర్, తమిళనాడు క్రికెటర్ వరుణ్ చక్రవర్తీ కూడా దళపతి విజయ్ విజయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 'మా అన్న గెలిచాడు'అనే అర్థం విజయ్‌తో ఉన్న ఫొటోను షేర్ చేశారు. 'అన్న లవ్‌యూ.. నువ్వే మా బలం'అని ఇన్‌స్టా స్టోరీలో పేర్కొన్నారు.

దళపతి విజయ్ తమిళనాడు రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించింది. ప్రధాన కూటములైన అధికార డీఎంకే, విపక్ష అన్నాడీఎంకేల 50 ఏళ్ల ఆధిపత్యానికి తెరదించింది. 234 స్థానాలు కలిగిన తమిళనాడు అసెంబ్లీలో విజయ్ టీవీకే పార్టీ 110 సీట్లలో ఆధిక్యం కొనసాగిస్తోంది. మ్యాజిక్ ఫిగర్‌కు 118 స్థానాలు అవసరం కాగా.. అత్యధిక సీట్లు గెలిచిన పార్టీగా ఇతరుల సాయంతో టీవీకే అధికారం చేపట్టే అవకాశం ఉంది.
ఈ ఎన్నికల్లో తమిళ ప్రజలు విజయ్‌కి పట్టం కట్టి స్పష్టమైన మార్పు కోరుకున్నారు. డీఎంకే, అన్నాడీఎంకే హోరాహోరీ పోరు మధ్య యువత, న్యూట్రల్ ఓట్లను ఆకర్షించిన విజయ్ అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. దళపతి విజయ్ పక్కా ప్లాన్‌తో ఈ విజయాన్ని సొంతం చేసుకున్నారు. పకడ్బందీ గ్రౌండ్ వర్క్‌తో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ ఎలెక్షన్‌లోనే సెంచరీ కొట్టారు.
పార్టీ పెట్టకముందే తన అభిమాన సంఘాలతో ప్రజలకు చేరువయ్యారు. సామాజిక సంక్షేమ కార్యక్రమాలతో వారి మనసులను గెలుచుకున్నారు. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యలు చేపట్టడం, విద్యా కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం వంటి పనులతో తాను అధికారంలోకి వస్తే మేలు చేయగలననే విశ్వాసాన్ని ప్రజలకు కలిగించారు. పాలన, అవినీతి, సామాజిక న్యాయం వంటి అంశాలను విజయ్ తరుచూ తన సినిమాల్లో ఉండేలా చూసుకున్నారు.
ముఖ్యంగా డీఎంకే, అన్నాడీఎంకేతో పాటు బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగారు. పారదర్శక పాలన, ఉద్యోగావకాశాలు, సంక్షేమ విధానాలను లక్ష్యంగా చేసుకుని, యువతను ఆకర్షించారు. తన డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి జనాలను తనవైపు తిప్పుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications