టెన్షన్ వద్దు.. మూడు ఫార్మాట్లు ఆడుతాను: బాబర్ ఆజామ్
పాకిస్థాన్ తరఫున మూడు ఫార్మాట్లు ఆడుతానని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్ స్పష్టం చేశాడు. ఈ విషయంలో సందేహం అక్కర్లేదన్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) 2026 సీజన్‌లో తాను సారథ్యం వహించిన పెషావర్ జల్మీ టీమ్‌ను బాబర్ ఆజామ్ విజేతగా నిలబెట్టాడు. ఈ టోర్నీలో బాబర్ ఆజామ్ 588 పరుగులతో సత్తా చాటాడు.
గత కొద్ది రోజులుగా పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడిన బాబర్ ఆజామ్.. పీఎస్‌ఎల్‌తో టచ్‌లోకి వచ్చాడు. ఒకప్పుడు కోహ్లీతో పోటిపడిన బాబర్ ఆజామ్.. ఫామ్ కోల్పోయి పాకిస్థాన్ జట్టులో చోటు కూడా కోల్పోయాడు. అయినా పట్టువదలని బాబర్ ఆజామ్.. పీఎస్‌ఎల్‌లో సత్తా చాటి పాకిస్థాన్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు.
తీన్ ఫార్మాట్స్ ఖేలుంగే..
పీఎస్‌ఎల్ 2026 సీజన్ విజయానంతరం మీడియాతో మాట్లాడిన బాబర్ ఆజామ్.. ఏ ఫార్మాట్‌లకు ప్రాధాన్యత ఇస్తారని మీడియా ప్రతినిథి ప్రశ్నించగా.. 'టెన్షన్ వద్దు. మూడు ఫార్మాట్లు ఆడుతాను.’అని బాబర్ ఆజామ్ స్పష్టం చేశాడు. క్రికెటర్లు ఫార్మాట్‌లను ఎంచుకోవద్దని అభిప్రాయపడ్డాడు.
ప్రతీ ప్లేయర్ మూడు ఫార్మాట్లు ఆడాలని, అలా చేయడం వల్ల వారి సామర్థ్యాలు మెరుగుపడుతాయని తెలిపాడు. 'ఆటగాడు కేవలం ఆడటానికే. ప్రతి ఒక్కరూ అన్ని ఫార్మాట్‌లు ఆడాలి, టీ20లు, వైట్ బాల్‌కే పరిమితం కాకూడదు. రెడ్ బాల్ క్రికెట్ అపారమైన అనుభవాన్ని, ఇన్నింగ్స్ నిర్మాణం, సహనాన్ని అందిస్తుంది. దేశవాళీ నాలుగు రోజుల క్రికెట్ భారీ ఇన్నింగ్స్‌లు ఆడే అనుభవం ఇస్తుంది.

మూడు ఫార్మాట్లు ఆడాలి..
ఒక ఫార్మాట్ ఆడటం వల్ల మరొక ఫార్మాట్‌కు సహాయపడుతుంది .రెడ్ బాల్ గేమ్ టీ20లు, వన్డేల్లో మేలు చేస్తుంది. టెస్ట్ మ్యాచ్‌ల్లో పెంపొందించుకునే సహనం, మానసిక స్థితి వైట్-బాల్ క్రికెట్‌లో ఉపయోగపడుతుంది. గత కొద్ది రోజులుగా బ్యాటింగ్‌లోనాపై పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోయాను. ఇలా జరగడం మామూలే. కొన్నిసార్లు ప్రణాళికలు సరిగ్గా అమలు కావు. మీరు ఎంత ప్రయత్నించినా.. కొన్ని విషయాలు మీకు అనుకూలంగా ఉండవు.
ఇలాంటి పరిస్థితుల్లో రెండు అడుగులు వెనక్కి వేసి, స్వీయ విశ్లేషణ చేసుకోవాలన్నాడు. తప్పులను విశ్లేషించి వాటిని సరిదిద్దుకోవాలి. నేను అదే చేశాను. నా సన్నిహితులు అపారమైన మద్దతు ఇచ్చారు. నా కుటుంబం, స్నేహితులు నన్ను ప్రోత్సహించారు. కోచ్‌లతో మాట్లాడి, నా ఆటను మెరుగుపర్చుకున్నాను.
నా తప్పులను సరిదిద్దుకున్నా..
ప్రపంచకప్ నుంచి వచ్చాక సరిగ్గా రాణించలేకపోయాను. చాలా నిరుత్సాహానికి లోనయ్యాను. పీఎస్‌ఎల్‌కు పది రోజులు మాత్రమే సమయం ఉండగా.. నా తప్పులు, గేమ్ ప్లాన్ మార్పులను పరిశీలించుకున్నాను. నా టెక్నిక్, మానసిక స్థితిపై పనిచేశాను. నేను నా సహజమైన ఆటను ఆడుతాను. నా క్రికెటింగ్ షాట్స్‌కు కట్టుబడి ఉంటాను. పిచ్, మ్యాచ్ పరిస్థితి, జట్టు డిమాండ్ ఏదైతే.. దాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నా’అని బాబర్ ఆజామ్ ముగించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications