అందుకే హార్దిక్ పాండ్యాను పక్కనపెట్టాం: సూర్యకుమార్ యాదవ్
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరం కాగా.. సూర్యకుమార్ యాదవ్ తాత్కలిక సారథిగా జట్టును నడిపిస్తున్నాడు. అనారోగ్యంతో అతను ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడని టాస్ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు.
హార్దిక్ గైర్హాజరీతో తాను సారథ్య బాధ్యతలను చేపట్టినట్లు వెల్లడించాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే బౌలింగ్ ఎంచుకున్నామని చెప్పాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. ప్రత్యేక కారణం ఏం లేదు. పిచ్ చూడటానికి బాగుంది. వాతావరణం ఉక్కపోతగా ఉండటంతో పాటు గాలి వీయడం లేదు. గత 2-3 మ్యాచ్‌ల్లో ఇక్కడ రెండో ఇన్నింగ్స్‌లో ఏం జరిగిందో మేం చూశాం.
రోహిత్ ఆడుతున్నాడు..
కాబట్టి తర్వాత బ్యాటింగ్ చేయడం కొంచెం సులవు అవుతుంది. అందుకే ఆ ప్రయోజనాన్ని ఉపయోగించుకుని మొదట మా బౌలర్లకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. ఈ మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా అనారోగ్యంతో దూరమయ్యాడు. అందుకే అతని స్థానంలో నేను కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాను. తుది జట్టులో మార్పులు ఉన్నాయి. ట్రెంట్ బౌల్ట్ స్థానంలో కార్బిన్ బాష్ జట్టులోకి వచ్చాడు. అలాగే రోహిత్ శర్మ కూడా రీఎంట్రీ ఇచ్చాడు.

నిజాయితీగా చెప్పాలంటే ముంబై ఇండియన్స్ జట్టు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటుందని అనుకోలేదు. కానీ ఈ నిజాన్ని కాదనలేం. ఇదంతా ఆటలో భాగం. ప్రతీ ఒక్కరూ బాధ్యత తీసుకొని ఆడాల్సిన అవసరం ఉంది. ఆటను ఆస్వాదించాలి. మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. మాకు ఇంకా ఐదు మ్యాచ్‌లు ఉన్నాయి. వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు గెలవడానికి ప్రయత్నిస్తాం. మా ఆటను ఆస్వాదిస్తూ.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తాం.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
మా ఓనర్ కోసం గెలుస్తాం..
మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ అన్నాడు. ఇది బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్ అని, ఎంతటి లక్ష్యాన్నైనా ఇక్కడ ఛేదించవచ్చని తెలిపాడు. 'ఈ సీజన్ మాకు చాలా కష్టంగా సాగింది. మా ఓనర్ సంజీవ్ గోయెంకా కోసం, అభిమానుల కోసం ఈ మ్యాచ్ గెలుస్తామని ఆశిస్తున్నా. ముకుల్ స్థానంలో ఇంగ్లిస్ వచ్చాడు. అక్షత్ రఘువంశీ కూడా బరిలోకి దిగుతున్నాడు. బౌలింగ్ మార్పుల గురించి తర్వాత నిర్ణయిస్తాం.'అని పంత్ చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్/కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్, అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, మహమ్మద్ షమీ, మొహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్
ముంబై ఇండియన్స్: ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, విల్ జాక్స్, రాజ్ బావ, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, జస్‌ప్రీత్ బుమ్రా, ఎ.ఎమ్. గజన్‌ఫర్, రఘు శర్మ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications