IPL 2026: ఆర్‌సీబీకి బిగ్ షాక్.. స్వదేశం వెళ్లిపోయిన స్టార్ ప్లేయర్!
ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస విజయాలతో జోరుమీదున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కి బిగ్ షాక్ తగిలింది. వేలి గాయంతో బాధపడుతున్న ఆ జట్టు విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ స్వదేశం వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. గత ఏప్రిల్ 18న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫిల్ సాల్ట్ చేతి వేలికి గాయమైంది.
డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ బౌండరీ వద్ద బంతిని ఆపేందుకు డైవ్ చేసినప్పుడు ఫిల్ సాల్ట్ ఎడమచేతి వేలికి తీవ్ర గాయమైంది. ఈ గాయంతో అతను ఇప్పటికే మూడు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. ఫిల్ సాల్ట్ గాయం తీవ్రతపై ఆర్‌సీబీ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. అయితే మెరుగైన వైద్యం కోసం అతను యూకే వెళ్లినట్లు తెలుస్తోంది.

అతను తిరిగి వచ్చే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. ఈ సీజన్ ఆరంభంలో పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడిన ఫిల్ సాల్ట్ ఆ తర్వాత టచ్‌లోకి వచ్చి విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. 6 ఇన్నింగ్స్‌ల్లో 168.33 స్ట్రైక్‌రేట్‌తో 202 పరుగులు చేశాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీతో కలిసి పవర్ ప్లేలో మెరుపు ఆరంభాన్ని అందిస్తున్నాడు.
సాల్ట్ గైర్హాజరీలో జాకోబ్ బెతెల్ బరిలోకి దిగుతున్నా.. అతను ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. దాంతో కోహ్లీపై అదనపు ఒత్తిడి పడి ఆర్‌సీబీ బ్యాటింగ్ ఆర్డర్‌పై ప్రభావం చూపుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో ఉన్న ఆర్‌సీబీకి ఫిల్ సాల్ట్ గైర్హాజరీ పెద్ద ఎదురుదెబ్బగా మారింది. జాకోబ్ బెతెల్ రూపంలో మంచి ప్రత్యామ్నాయం ఉన్నా.. అతను ఇంకా తన సత్తా చూపించలేదు.
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఆర్‌సీబీ పేలవ బ్యాటింగ్ ప్రదర్శనతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం ఆర్‌సీబీకి 6 రోజుల విశ్రాంత లభించగా.. ఆర్‌సీబీ ఆటగాళ్లు సేద తీరుతున్నారు. కొందరు తమ స్వస్థలాలకు వెళ్లగా.. మరికొందరు మాల్దీవ్స్‌కు వెళ్లారు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మే7న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లోపు తిరిగి జట్టులో చేరనున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications