SRH vs RCB ప్రివ్యూ: వార్నర్ vs కోహ్లీ బోణీ కొట్టేదెవరో? తుది జట్లు ఇవే!

IPL 2020: SRH vs RCB Match Preview, Pitch Report | Warner VS Kohli | Oneindia Telugu

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌లో తమ తొలి మ్యాచ్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్దమైంది. సోమవారం జరిగే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో తలపడనుంది. బెంగళూరుకు కూడా ఇదే ఫస్ట్ మ్యాచ్. ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉన్న ఆటగాళ్లు ఇరు జట్లలో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలున్నాయి. ఇక విజయంతోనే ఐపీఎల్ 2020 జర్నీని ప్రారంభించాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఈ ఇరు జట్లు 15 సార్లు తలపడగా 8-6తో సన్‌రైజర్స్ లీడ్‌లో ఉంది. అదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తోంది. మరీ ఏ జట్టు శుభారంభాన్ని అందుకుంటుదో చూడాలి!

యువ ఆటగాళ్లు విరాట్ సింగ్, అభిషేక్ శర్మ, ప్రియమ్ గార్గ్, అబ్దుల్ సమద్‌లో ఒకరిద్దరూ వీరికి అండగా నిలవనున్నారు. ఈ కుర్రాళ్లపై మేనేజ్‌మెంట్‌తో పాటు వార్నర్ చాలా నమ్మకం పెట్టుకున్నాడు. అప్గాన్ ప్లేయర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీలో ఎవరిని ఎంచుకుంటారో చూడాలి. దుబాయ్ పిచ్ నేపథ్యంలో ఇద్దరిని బరిలోకి దింపే అవకాశం ఉంది. ఎప్పుడూ బలంగా కనిపించే బౌలింగ్ అటాక్‌పై ఈసారి డౌట్స్ ఉన్నాయి. భువీ, సందీప్ శర్మ, సిద్దార్థ్ కౌల్, ఖలీల్ అహ్మద్ ఉన్నప్పటికీ వీళ్లకి తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ లేదు. ఫాబియన్ అలెన్, మిచెల్ మార్ష్‌లో బెంచ్‌కే పరిమితం కావచ్చు.

 డేవిడ్ వార్నరే బలం..

డేవిడ్ వార్నరే బలం..

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధాన ఆయుధం.. జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నరే. ఈ ఆసీస్ బ్యాట్స్‌మన్‌కు ఐపీఎల్‌లో తిరుగేలని రికార్డు ఉంది. మూడుసార్లు ఆరెంజ్ గ్యాప్ గెలిచిన వార్నర్.. 2016లో జట్టుకు టైటిల్ అందించాడు. ఈసారి కూడా అతనిపై భారీ అంచనాలున్నాయి. ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ జానీ బెయిర్ స్టోతో కలిసి ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తుది జట్టులో ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మనీశ్ పాండే, విజయ్ శంకర్ మిడిలార్డర్‌ను నడిపించనున్నారు.

యువ ఆటగాళ్లు విరాట్ సింగ్, అభిషేక్ శర్మ, ప్రియమ్ గార్గ్, అబ్దుల్ సమద్‌లో ఒకరిద్దరూ వీరికి అండగా నిలవనున్నారు. ఈ కుర్రాళ్లపై మేనేజ్‌మెంట్‌తో పాటు వార్నర్ చాలా నమ్మకం పెట్టుకున్నాడు. అప్గాన్ ప్లేయర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీలో ఎవరిని ఎంచుకుంటారో చూడాలి. దుబాయ్ పిచ్ నేపథ్యంలో ఇద్దరిని బరిలోకి దింపే అవకాశం ఉంది. ఎప్పుడూ బలంగా కనిపించే బౌలింగ్ అటాక్‌పై ఈసారి డౌట్స్ ఉన్నాయి. భువీ, సందీప్ శర్మ, సిద్దార్థ్ కౌల్, ఖలీల్ అహ్మద్ ఉన్నప్పటికీ వీళ్లకి తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ లేదు. ఫాబియన్ అలెన్, మిచెల్ మార్ష్‌లో బెంచ్‌కే పరిమితం కావచ్చు.

గెలుపుతో మొదలుపెట్టాలి..

గెలుపుతో మొదలుపెట్టాలి..

గత సీజన్‌లో తీవ్రంగా నిరాశపరిచిన ఆర్‌సీబీ.. ఈసారి కొత్త ఉత్సాహంతో కనిపిస్తోంది. జట్టులో సమస్యలను పరిష్కరించుకుని ఎలాగైన టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ వారి ప్రధాన ఆయుధాలు. ఆరోన్ ఫించ్‌తో బ్యాటింగ్ బలం మరింత పెరిగింది. దేశవాళీ క్రికెట్‌లో అదరగొట్టిన మహారాష్ట్ర ప్లేయర్ దేవదత్ పడిక్కల్‌తో ఫించ్ ఇన్నింగ్స్ ప్రారంభించవచ్చు. శివమ్ దుబే, మోయిన్ అలీ, వాషింగ్టన్ సందర్, క్రిస్ మోరిస్ ఆల్‌రౌండర్లుగా బరిలోకి దిగవచ్చు.

ఇక బౌలింగ్‌లో.. యుజ్వేంద్ర చహల్‌కు తోడు మెయిన్ అలీ, ఆడమ్ జంపా, వాషింగ్టన్ సుందర్, పవన్ నేగితో స్పిన్ విభాగం బలంగా కనిపిస్తోంది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ కీలకం కానున్నాడు. నవదీప్ సైనీ, ఉమేశ్ యాదవ్‌లతో కలిసి అతను పేస్ బాధ్యతలను పంచుకోనున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ బెంచ్‌కే పరిమితం కావచ్చు.

పిచ్ రిపోర్టు, ముఖాముఖి..

పిచ్ రిపోర్టు, ముఖాముఖి..

కింగ్స్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మైదానంలోనే ఈ మ్యాచ్ జరుగుతుండటంతో ఆ మ్యాచ్ పరిస్థితులే రిపీట్ కానున్నాయి. స్పిన్‌కు బాగా అనుకూలించే పిచ్. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌కే మొగ్గు చూపవచ్చు. తొలుత బౌలింగ్ అనుకూలిస్తూ.. తర్వాత బ్యాటింగ్‌కు సులువయ్యే పరిస్థితులుంటాయి. రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇక గత ఐదు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరో రెండు గెలిచాయి. ఒక వర్షంతో రద్దయింది.

తుది జట్లు(అంచనా)

తుది జట్లు(అంచనా)

సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో(కీపర్), మనీష్ పాండే, విరాట్ సింగ్, విజయ్ శంకర్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, అభిషేక్ శర్మ, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: ఆరోన్ ఫించ్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఏబీ డివిలియర్స్(వికెట్ కీపర్), శివమ్ దూబే, మోయిన్ అలీ, వాషింగ్టన్ సుందర్, క్రిస్ మోరిస్, నవదీప్ సైనీ, యుజ్వేంద్ర చాహల్, ఉమేశ్ యాదవ్

అంపైర్ తప్పుడు నిర్ణయానికి కింగ్స్ పంజాబ్ బలి.. మండిపడుతున్న ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, September 21, 2020, 10:25 [IST]
Other articles published on Sep 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X