న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే జట్టులోమూడు మార్పులు చేశాం: కేన్ మామ

SRH vs KKR: Kolkata opt to bat; both sides tweak playing XI, Natarajan, Sundar return after injury

పుణే: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు కీలక మార్పులతో ఈ మ్యాచ్ బరిలోకి దిగుతున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి నటరాజన్, వాషింగ్టన్, జాన్సెన్ తిరిగి రాగా.. కేకేఆర్ జట్టులోకి షెల్డన్ జాక్సన్, ఉమేశ్ యాదవ్ తిరిగొచ్చారు. ఇక ఈ వికెట్‌ ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టుకే అడ్వాంటేజ్ ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నానని కేకేఆర్ సారథి శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.

ముందుగా బ్యాటింగ్ చేయడం తమ జట్టుకు కలిసొస్తుందని చెప్పాడు. ప్యాట్ కమిన్స్ గాయపడటంతో జట్టులో మార్పులు చేయాల్సి వచ్చిందన్నాడు. కోర్ స్ట్రెంగ్త్‌తో బరిలోకి దిగుతున్నామని, శుభారంభం అందుకుంటే మ్యాచ్‌పై పట్టు సాధించవచ్చన్నాడు.

ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ సారథి కేన్ విలియమ్సన్ సైతం టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకునేవాడినని చెప్పాడు. నటరాజన్, వాషింగ్టన్ జట్టులోకి వచ్చారని, ఫరూఖీ స్థానంలో జాన్సెన్ బరిలోకి దిగుతున్నాడని తెలిపాడు. గత మ్యాచ్‌ల్లో తాము సామర్థ్యం మేరకు రాణించలేదని, ఈ మ్యాచ్‌లో తమ బెస్ట్ ఇస్తామని ధీమా వ్యక్తం చేశాడు. కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇప్పటికే గల్లంతవ్వగా.. సన్‌రైజర్స్ ఈ మ్యాచ్ కీలకం

తుది జట్లు:

కేకేఆర్: వెంకటేశ్ అయ్యర్, అజింక్యా రహానే, నితీశ్ రాణా, శ్రేయస్ అయ్యర్, సామ్ బిల్లింగ్స్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేశ్ యాదవ్, టీమ్ సౌథీ, వరుణ్ చక్రవర్తీ

సన్‌రైజర్స్: అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, నికోలస్ పూరన్, శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, ఉమ్రాన్ మాలిక్

Story first published: Saturday, May 14, 2022, 19:31 [IST]
Other articles published on May 14, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X