న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్ 40 ఏళ్ల వరకు ఆడొచ్చు.. ధోనీ మాత్రం 38 ఏళ్లకే రిటైర్ అవ్వాలా?

Sreesanth Says MS Dhoni the Don of Indian Cricket, Would Love to Play as Long as Possible

తిరువనంతపురం: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ పై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ సీనియర్ క్రికెటర్ శ్రీశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుధవారం ధోనీ రిటైర్స్ ట్యాగ్ ట్రెండ్ అవడం.. గురువారం దానికి కౌంటర్‌గా ధోనీ నెవర్ రిటైర్స్ ట్యాగ్ ట్రెండ్ చేయడంతో ధోనీ వీడ్కోలు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది.

ఇప్పటికే చాలా మంది మాజీ క్రికెటర్లు ధోనీకి మద్దతుగా నిలవగా.. హలోయాప్‌లో చిట్‌చాట్ చేసిన శ్రీశాంత్ కూడా మహీ మరికొన్ని రోజులు ఆడుతాడని స్పష్టం చేశాడు. అతనిపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఇక ధోనీ సారథ్యంలో భారత్ గెలిచిన 2007 టీ20 ప్రపంచకప్, 2011 వరల్డ్‌కప్‌ టీమ్స్‌లో శ్రీశాంత్ ఓ సభ్యుడనే విషయం తెలిసిందే.

ధోనీ ఓ డాన్..

ధోనీ ఓ డాన్..

ఇక లైవ్ సెషన్‌లో ధోనీ రిటైర్మెంట్ వ్యవహారాన్ని ఓ అభిమాని ప్రస్తావించగా.. ధోనీ చాలా ఫిట్‌గా ఉంటాడని, మరికొన్నేళ్లు క్రికెట్ ఆడే సత్తా అతనికి ఉందని శ్రీశాంత్ బదులిచ్చాడు. ‘నాకు తెలిసి ధోనీ చాలా ఫిట్‌‌గా ఉంటాడు. నాకన్నా, ఆఖరికి సంజూ శాంసన్ కన్నా ఫిట్‌గా ఉంటాడు. అతనో డాన్. అతన్ని అందుకోవడం చాలా కష్టం. దేశం తరఫున ఆడాటాన్ని బాగా ఇష్టపడుతాడు. అది అతని రక్తంలోనే ఉంది. అయినా అతని వయసు 38 ఏళ్లే. సచిన్ టెండూల్కర్, మిగతా క్రికెటర్లు చాలా మంది 40 ఏళ్ల వరకు కూడా ఆడారు.'అని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు.

స్టోక్స్ నీకంత సీన్ లేదు..

స్టోక్స్ నీకంత సీన్ లేదు..

గతేడాది జరిగిన ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో మ్యాచ్ విన్నర్ అయిన ధోనీలో గెలవాలనే కసి కనిపించలేదని ఆ జట్టు ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ వివాదాస్పద రీతీలో తన బుక్‌లోరాసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై శ్రీశాంత్ స్పందించాడు. ధోనీ గురించి స్టోక్స్ కు ఏమి తెలుసని మాట్లాడుతున్నాడని మండిపడ్డాడు. ‘స్టోక్స్ నీకేం తెలుసు. ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తావు? నీవు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నువ్వు ధోనీని ఔట్ చేయలేవు. అతని గురించి మాట్లాడే సీన్ నీకు లేదు'అని శ్రీశాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

రీఎంట్రీకి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు..

రీఎంట్రీకి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు..

ఇక ధోనీ ఓ దిగ్గజమని, అతను పునరాగమనం చేయడానికి ఎలాంటి టోర్నీలు ఆడాల్సిన అవసరంలేదని, నేరుగా భారత జట్టులో చేరవచ్చిన శ్రీశాంత్ అభిప్రాయపడ్డాడు.‘ధోనీ పునరాగమనం చేయడానికి ఐపీఎల్ అవసరం లేదు. బ్లూ జెర్సీ ధరిస్తే చాలు అతను అన్ని విధాలుగా సిద్దమైపోతాడు. ఆర్మీ దుస్తులు ధరించిన రోజున ఓ ప్రొఫెషనల్ సైనికుడవుతాడు. అతనికి ప్రాక్టీస్ అవసరం లేదు. 'అని శ్రీశాంత్ స్పష్టం చేశాడు.

ఇక పాకిస్థాన్‌ తో మ్యాచ్ అంటే ధోనీ సిక్సర్లతో వీరవిహారం చేసేవాడని శ్రీశాంత్ గుర్తు చేసుకున్నాడు. మ్యాచ్‌కు ముందు ఏ బౌలర్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టాలో అడిగి మరి బాదేవాడన్నాడు. ఓసారి తాను మహమ్మద్ ఆసిఫ్‌లో బౌలింగ్ కొట్టాలని చెప్పానని, చెప్పినట్లుగానే ధోని చాలా లాంగ్ సిక్సర్ కొట్టాడని శ్రీశాంత్ గుర్తు చేసుకున్నాడు.

చెన్నై తరఫున ఆడుతా..

చెన్నై తరఫున ఆడుతా..

మళ్లీ ఐపీఎల్‌లో ఆడే అవకాశం వస్తే చెన్నైసూపర్ కింగ్స్ తరఫున ఆడతానని శ్రీశాంత్ తన మనసులో కోరికను బయటపెట్టాడు. ప్రత్యర్ధి జట్ల కెప్టెన్లను ఔట్ చేసేందుకు ఎక్కువ ఇష్టపడతానన్న ఈ కేరళ పేసర్.. ఐపీఎల్ లో ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తన ఫేవరెట్ జట్లని చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది ఐపీఎల్ జరిగితే ముంబై ఇండియన్స్ ట్రోఫీ గెలవాలని కోరుకుంటానని తెలిపాడు. కరోనా కారణంగా బౌలర్లు బంతిపై ఉమ్మి రాయకూడదన్న కొత్త నిబంధనపై స్పందిస్తూ.. కొంచెం కష్టమేనని, కానీ, నిబంధన అయినప్పుడు తప్పనిసరిగా అందరూ పాటించాల్సిందేనన్నాడు. ఏబీ డివిలియర్స్ గొప్ప ఆటగాడని తెలిపిన శ్రీ... అతడ్ని 7 సార్లు ఔట్ చేసినట్లు గుర్తు చేసుకున్నాడు.

కరోనా వైరస్ చైనా కుట్రే.. డ్రాగన్ కంట్రీపై భజ్జీ ఫైర్!

Story first published: Friday, May 29, 2020, 18:48 [IST]
Other articles published on May 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X