
డ్రాగన్ కంట్రీ వ్యూహం ఇదే..
గురువారం (మే 28న) చైనాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదనే కథనాన్ని రాయిటర్స్ ట్వీట్ చేసింది. దీన్ని రీట్వీట్ చేస్తూ భజ్జీ చైనాపై తనకున్న ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు. ‘ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ను వ్యాప్తి చేసి.. ప్రతీ ఒక్కరు ఇబ్బంది పడుతుంటే తీరిగ్గా కూర్చుని.. పీపీఈ కిట్స్, మాస్క్‌లను ప్రపంచదేశాలకు అమ్ముకుంటూ వారి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడమే చైనా వ్యూహం.' అని మండిపడ్డాడు.
చైనాపై అనుమానాలు..
ఇక ప్రపంచ దేశాలన్నీ రెండున్నర నెలలపాటు పూర్తిగా స్వీయ నిర్భంధంలోకి వెళ్లినా.. ఈ వైరస్ ప్రభావం ఏ మాత్రం తగ్గకపోగా మరింత వేగంగా విస్తరిస్తుంది. కానీ వైరస్ పుట్టిన చైనాలో మాత్రం పూర్తిగా అదుపులోకి రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. కరోనా వైరస్ చైనా కుట్రలో భాగమనే ఫీలింగ్ కలుగుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. హర్భజన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 59 లక్షల మంది ఈ వైరస్ భారిన పడగా.. భారత్‌లో ఆ సంఖ్య 1.65 లక్షలు పెరిగింది.

నకిలీ కిట్లపై కూడా...
ఇక చైనాపై భజ్జీ ఆగ్రహం వ్యక్తం చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో చైనా నకిలీ పీపీఈ కిట్లను ఎగుమతిచేస్తుందని వచ్చిన వార్తలపై కూడా ఈ సీనియర్ స్పిన్నర్ భగ్గుమన్నాడు. వెంటనే చైనా ఉత్పత్తులను నిషేధించాలన్నాడు. ‘ఉద్దేశ పూర్వకంగానే చైనా నకిలీ కిట్స్ ఇతర దేశాలకు పంపిస్తుంది. ముందు చైనా దిగుమతులను బాయ్‌కట్ చేయాలి. మనం వారికన్నా అద్బుతమైన కిట్స్‌ను తయారు చేసుకోగలం'అని భజ్జీ ట్వీట్ చేశాడు.

భజ్జీ పశ్చాతాపం..
2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఓకే ఓవర్‌లో మూడు సిక్సర్లు సమర్పించుకోవడాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ గుర్తుచేసుకున్నాడు. 'మిస్బా ఒక సిక్స్ కొట్టగానే నాపై ఒత్తిడి పెరిగింది. తర్వాత బంతిని ఎలా విసిరాలి అనేదానికంటే వేగంగా ఓవర్‌ని పూర్తి చేయాలనుకున్నా. ఆ క్రమంలో యార్కర్ బంతుల్ని కూడా సంధించా' అని తెలిపాడు. బ్యాట్స్‌మన్ ఎవరైనా సిక్స్ లేదా రెండు సిక్సర్లు లేదా మూడు సిక్సర్లు కొట్టవచ్చు కానీ కీలక సమయంలో అలా పరుగులు ఇవ్వడం సరైంది కాదని భజ్జీ పశ్చాతాపం చెందాడు.
భారత్ ఉద్దేశపూర్వకంగా ఓడిందనలేదు.. పాక్ మాజీ క్రికెటర్‌పై స్టోక్స్ ఫైర్


Click it and Unblock the Notifications












