న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అప్పుడే ఐపీఎల్ నిర్వహణపై తుది నిర్ణయం: కేంద్ర మంత్రి

 Sports Minister Kiren Rijiju Says Fate of IPL 2020 can be decided after April 15


ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్) 2020 సీజన్ భవితవ్యం ఏప్రిల్‌ 15 తర్వాతే తేలుతుందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఇచ్చే మార్గదర్శకాల ఆధారంగానే టోర్నీ నిర్వహించాలా? లేదా అనే విషయంపై క్లారిటీ వస్తుందన్నారు. క్రికెట్‌ పర్యవేక్షణ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉందని, ఈ క్యాష్ రిచ్ లీగ్ నిర్వహణ వ్యవహారం అదే చూసుకుంటుందన్నారు.

'పరిస్థితులకు అనుగుణంగా ఏప్రిల్‌ 15 తర్వాత ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేస్తుంది. బీసీసీఐ క్రికెట్‌ను మాత్రమే చూసుకునే సంఘం. క్రికెట్‌ ఒలింపిక్‌ క్రీడా కాదు కాబట్టి దాని సంగతి అది చూసుకుంటుంది. టోర్నీలు జరగాలా వద్దా అన్నది కాదిక్కడ ప్రశ్న. లక్షల మంది హాజరవుతారు కాబట్టి ప్రజల సంక్షేమం గురించే అసలు ప్రశ్న' అని కిరణ్‌ రిజిజు తెలిపారు.

ఇక కరోనా వైరస్‌ కట్టడి చేసేందుకు కేంద్రం అన్ని క్రీడా ఫెడరేషన్లకు మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. వీలైతే టోర్నీలు వాయిదా వేయాలని, అలా కుదరని పోటీలను ప్రేక్షకుల్లేకుండా నిర్వహించాలని ఆదేశించింది. ముఖ్యంగా జన సమూహాలు లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఈ నేపథ్యంలో మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్‌ను బీసీసీఐ ఏప్రిల్‌ 15కు వాయిదా వేసింది. సౌతాఫ్రికాతో జరగాల్సిన వన్డే సిరీస్‌ను రద్దు చేసింది. ఇక దేశవాళీ టోర్నీలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

బీసీసీఐ.. ధోనీ మాకు కావాలి.. టీ20 ప్రపంచకప్ ఆడాలి!!బీసీసీఐ.. ధోనీ మాకు కావాలి.. టీ20 ప్రపంచకప్ ఆడాలి!!

Story first published: Thursday, March 19, 2020, 20:55 [IST]
Other articles published on Mar 19, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X