న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SA vs SL: తొలి టెస్ట్ సౌతాఫ్రికాదే.. శ్రీలంకపై ఇన్నింగ్స్ తేడాతో విజయం

South Africa seal innings win over Sri Lanka in first test

సెంచూరియన్: బౌలర్లు సత్తా చాటడంతో శ్రీలంకతో జరిగిన ఫస్ట్ టెస్ట్‌లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. నాలుగు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్‌లో సఫారీ టీమ్ ఇన్నింగ్స్ 45 రన్స్ తేడాతో గెలిచింది. 225 రన్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ లోటుతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన లంక 180కే ఆలౌటైంది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో సౌతాఫ్రికా 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

ఓవర్‌నైట్ స్కోర్ 65/2తో నాలుగో రోజైన మంగళవారం సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగించిన లంక.. బ్యాటింగ్ వైఫల్యంతో ఓటమి చవిచూసింది. రెండో ఇన్నింగ్స్‌లో కుశాల్ పెరీరా(64), హసరంగ(59), చండీమల్(25), డిక్‌వెల్లా(10) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేయగలిగారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి(2/38), నోకియా(2/47), ముల్డర్(2/39), సిపామ్లా(2/24) తలా రెండేసి వికెట్లు తీశారు.

మ్యాచ్ తొలి రోజు గాయపడిన ధనంజయ డిసిల్వా రెండో ఇన్నింగ్స్‌లోనూ శ్రీలంక 396 రన్స్ చేయగా, ఆ తర్వాత సౌతాఫ్రికా 621 పరుగుల భారీ స్కోర్ చేసింది. కాగా, ఒక్క రన్ తేడాతో డబుల్ సెంచరీ మిస్ అయిన సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్ ఫా డుప్లెసిస్(199)కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్‌లో రెండో టెస్ట్ జనవరి 3న ప్రారంభమవుతుంది.

Story first published: Wednesday, December 30, 2020, 8:48 [IST]
Other articles published on Dec 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X