న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దారులు మూసుకుపోయాయి: సఫారీలతో టీ20 సిరిస్‌కు ధోని ఎంపిక కష్టమే!

South Africa’s Tour To India : MS Dhoni Unlikely To Play T20Is As Selectors In Favour Of Pant
South Africa’s tour to India: MS Dhoni unlikely to play T20Is as selectors in favour of Rishabh Pant

హైదరాబాద్: సెప్టెంబర్‌లో సఫారీలతో జరగనున్న మూడు టీ20 సిరిస్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఎంపిక కష్టమేనని అంటున్నారు క్రీడా విశ్లేషకులు. దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనలో భాగంగా మూడు టీ20లు, మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది.

ఆర్చర్ బంతి తగలగానే ఫిలిప్ హ్యూస్ విషాదం గుర్తుకు వచ్చింది: స్టీవ్ స్మిత్‌ఆర్చర్ బంతి తగలగానే ఫిలిప్ హ్యూస్ విషాదం గుర్తుకు వచ్చింది: స్టీవ్ స్మిత్‌

టీ20 సిరిస్ కోసం సెలక్షన్ కమిటీ సెప్టెంబర్ 4న జట్టుని ఎంపిక చేయనుంది. ఈ నేపథ్యంలో వెస్టిండిస్ పర్యటనలో టీ20 సిరిస్‌కు ఎంపిక చేసిన జట్టునే కొనసాగించే ఆలోచనలో సెలక్షన్ కమిటీ ఉన్నట్లు బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. విండిస్ పర్యటనలో కోహ్లీసేన 3-0తో సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.

ధోని సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నప్పటికీ సెలక్టర్లు అతడిని పరిగణనలోకి తీసుకోరని సమాచారం. ఇప్పటికే యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మూడు ఫార్మాట్లలో సత్తా చాటుతున్నాడు. మరోవైపు వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్ ఉన్న నేపథ్యంలో జట్టుని ఇప్పటి నుంచే అందుకు సన్నద్ధం చేయాల్సి ఉంటుంది.

యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు

యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు

టీ20 వరల్డ్‌కప్‌ కోసం యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు కల్పించడంతో పాటు ఆ దిశగా వారిని నడిపించాల్సిన బాధ్యత జట్టు మేనేజ్‌మెంట్‌పై ఉంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ "టీ20 వరల్డ్‌కప్‌కు ముందు టీమిండియా కేవలం 22 టీ20లను మాత్రమే ఆడనుంది. సెలక్టర్లు ఈ విషయంలో పూర్తి క్లియర్‌గా ఉన్నారు. ఇది ముందుకు వెళ్లాల్సిన సమయం" అని అన్నారు.

వికెట్ కీపర్లను సిద్ధం చేసేందుకు

వికెట్ కీపర్లను సిద్ధం చేసేందుకు

"పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ముగ్గురు వికెట్ కీపర్లను సిద్ధం చేసేందుకు సెలక్టర్లు ప్రణాళికలు వేస్తున్నారు. ముఖ్యంగా టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని" అని ఆయన తెలిపారు. ఇంగ్లాండ్ వేదకగా వన్డే వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని అందరూ భావించారు.

వేటు పడింది..: యాషెస్‌లో నాలుగు, ఐదు టెస్టులకు అంఫైర్లు మార్పు

విండిస్ పర్యటనకు అందుబాటులో లేని ధోని

విండిస్ పర్యటనకు అందుబాటులో లేని ధోని

అయితే, అందుకు భిన్నంగా వెస్టిండిస్ పర్యటనకు తాను అందుబాటులో ఉండటం లేదని... రెండు నెలలు పాటు క్రికెట్ దూరమై.. భారత ఆర్మీలోని పారాచూట్ రెజిమెంట్‌లో సేవలందించాడు. ఈ నేపథ్యంలో ధోని భవిష్యత్తు నిర్ణయంపై సెలక్టర్లు అతడితో ఇంకా మాట్లాడలేదని తెలుస్తోంది. రిటైర్మెంట్ విషయానికి వస్తే అతడి వ్యక్తిగత నిర్ణయమని అన్నారు.

రిటైర్మెంట్ అనేది వ్యక్తిగత నిర్ణయం

రిటైర్మెంట్ అనేది వ్యక్తిగత నిర్ణయం

"రిటైర్మెంట్ అనేది అతడి వ్యక్తిగత నిర్ణయం. సెలెక్టర్లు లేదా మరొకరు విషయంలో కలగజేసుకునే హక్కు ఎవరికీ లేదు. అయితే, 2020 వరల్డ్ టి20 కోసం రోడ్‌మ్యాప్‌ను నిర్ణయించే హక్కు మాత్రం సెలక్టర్లు ఉంది. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్‌కు ఎక్కువ అవకాశం ఉంది" అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

PKL 2019: టేబుల్ టాపర్‌కు యు ముంబా షాకిస్తుందా?

ధోనీని ఎంపిక చేయని పక్షంలో

ధోనీని ఎంపిక చేయని పక్షంలో

ధోనీని ఎంపిక చేయని పక్షంలో ఇషాన్ కిషన్ లేదా సంజు శాంసన్‌లలో ఎవరో ఒకరిని సెలక్టర్లు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, ఆంటిగ్వా వేదికగా జరిగిన తొలి టెస్టులో వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన రిషబ్ పంత్‌పై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్లోవ్స్‌ ధరించిన ప్రతీ ఒక్కరూ వికెట్‌ కీపర్‌ కాలేరంటూ రిషబ్‌పంత్‌ను ఉద్దేశించి సయ్యద్ కిర్మాణి వ్యాఖ్యానించారు.

Story first published: Wednesday, August 28, 2019, 18:09 [IST]
Other articles published on Aug 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X