PKL 2019: టేబుల్ టాపర్‌కు యు ముంబా షాకిస్తుందా?

హైదరాబాద్: ప్రో కబడ్డీ ఏడో సీజన్‌లో భాగంగా టేబుల్ టాపర్ దబాంగ్ ఢిల్లీ బుధవారం యు ముంబాతో తలపడనుంది. సొంతగడ్డపై దబాంగ్ ఢిల్లీ ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి మూడో మ్యాచ్‌కి సిద్ధమైంది. మరోవైపు గత మ్యాచ్‌లో యు ముంబా విజయం సాధించి ఉత్సాహాంతో బరిలోకి దిగుతోంది.
కాగా, ఢిల్లీ అంచెలో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు మొత్తం 14 మ్యాచ్‌లు జరగ్గా అందులో 12 మ్యాచ్‌ల్లో యు ముంబానే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు నవీన్ కుమార్‌పైనే ఉన్నాయి. ఈ సీజన్‌లో దబాంగ్ ఢిల్లీ తరుపున నవీన్ కుమార్ టాప్ రైడర్‌గా కొనసాగుతున్నాడు.

సూపర్-10 రైడ్లతో
వరుసగా ఎనిమిది సార్లు సూపర్-10 రైడ్లతో నవీన్ కుమార్ ఆకట్టుకున్నాడు. ప్రో కబడ్డీ లీగ్‌లో పటిష్టమైన ఢిఫెన్స్‌ను కలిగి ఉన్న జట్లలో యు ముంబా ఒకటి. ఈ నేపథ్యంలో యు ముంబా ఢిఫెన్స్‌ను నవీన్ కుమార్ ఎలా చేధిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఇక, కెప్టెన్ జోగిందర్ నర్వాల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తన అనుభవంతో జట్టుని విజయాల బాట పట్టిస్తున్నాడు.

దబాంగ్ ఢిల్లీ
ఆడినవి: 9
గెలిచినవి: 7
టై: 1
ఓడనవి: 1
విన్ రేట్: 77.78%
బెస్ట్ రైడర్: నవీన్ కుమార్
బెస్ట్ డిఫెండర్: జోగిందర్ నర్వాల్

ఐదు విజయాలతో ఆరో స్థానంలో
ఈ సీజన్‌లో యు ముంబా ఇప్పటివరకు మొత్తం పది మ్యాచ్‌లు ఆడి ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. అయితే, గత ఐదు మ్యాచ్‌ల్లో యు ముంబై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన దాఖలా లేదు. అయితే, గత మ్యాచ్‌లో తమిళ తలైవాస్‌పై విజయం ఆ జట్టుకు ఊరటనిచ్చేదే.

రైడర్‌గా అతుల్ రాణిస్తే
ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ఫజిల్ అట్రాచలితో పాటు సందీప్ నర్వాల్ రాణించాల్సిన అవసరం ఉంది. గత మ్యాచ్‌లో అతుల్ ఎమ్ఎస్ తన అద్భుత ప్రదర్శనతో తమిళ తలైవాస్‌పై విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. మరోసారి ఈ మ్యాచ్‌లో కూడా రైడర్‌గా అతుల్ రాణిస్తే యు ముంబాకు తిరుగుండదు.

యు ముంబా
ఆడినవి: 10
గెలిచినవి: 5
టై: 0
ఓడనవి: 5
విన్ రేట్: 50%
బెస్ట్ రైడర్: అభిషేక్ సింగ్
బెస్ట్ డిఫెండర్: ఫజల్ అట్రాచలి
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications