న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రీ ఎంట్రీ ఇస్తానని ఇప్పుడే చెప్పలేను: డివిలియర్స్

South Africa Legend AB de Villiers uncertain of international comeback if T20 World Cup gets postponed

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేస్తానని ఇప్పుడే చెప్పలేనని సౌతాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ స్పష్టం చేశాడు. 2018లో అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసిన ఏబీ.. అప్పటి నుంచి కేవలం టీ20 లీగుల్లోనే ఆడుతున్నాడు. అయితే గతేడాది వన్డే ప్రపంచకప్ ముందు రీఎంట్రీ చేయాలనుందని తన మనసులోని కోరికను ఈ మిస్టర్ 360 బయట పెట్టగా .. సెలెక్టర్లు అంగీకరించలేదు. దానికి తగ్గట్టే ఆ మెగా టోర్నీలో సౌతాఫ్రికా కూడా తగిన మూల్యం చెల్లించుకుంది. దీంతో ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ జట్టులోకి ఏబీ తీసుకోవాలని టీమ్‌మేనేజ్‌మెంట్ భావించింది.

వాయిదా పడితే చెప్పలేం..

వాయిదా పడితే చెప్పలేం..

అయితే ప్రస్తుత కరోనా నేపథ్యంలో ఈ మెగా టోర్నీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో ఈ టీ20 ప్రపంచకప్ వాయిదా పడే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. ఇక ఏబీ డివిలియర్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పుడే అభిమానులకు లేని పోని ఆశలు కల్పించలేనన్నాడు.

టీ20 ప్రపంచకప్‌కు ఇంకా ఆరు నెలల సమయం ఉందని, అంతేకాక అప్పటికీ కరోనా తీవ్రత ఉంటే ప్రపంచకప్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేసే అవకాశం లేకపోలేదన్నాడు. దీంతో భవిష్యత్తులో తన శరీరం స్పందించే తీరును బట్టి రీ ఎంట్రీ చేయాలా ? వద్దా? అనేదానిపై నిర్ణయం తీసుకుంటానని తెలిపాడు. పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటే తన దేశం కోసం తిరిగి బరిలోకి దిగుతానని సంకేతాలు ఇచ్చాడు.

బౌచర్ ముందు నిరూపించుకుంటా..

బౌచర్ ముందు నిరూపించుకుంటా..

‘ప్రస్తుతం ఫిట్‌నెస్‌తో ఉన్నా. అయితే ప్రపంచకప్‌ను వాయిదా వేస్తే చాలా విషయాలు మారిపోతాయి. ఆ సమయంలో నా శరీరం సహకరిస్తుందో, ఆరోగ్యంగా ఉంటానో లేదో తెలియదు. మార్క్‌ బౌచర్‌తో రీఎంట్రీపై ఆసక్తిగా ఉన్నానని, జట్టు కోసం నా బాధ్యత నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పొచ్చు. కానీ అలాంటి హామీలు ఇవ్వడానికి నేను భయపడతా. లేనిపోని ఆశలు కల్పించను. అయితే 100 శాతం ఫిట్‌నెస్ సాధిస్తే అందుబాటులో ఉంటాను. 80 శాతం ఫిట్‌గా ఉంటే మాత్రం బరిలోకి దిగను. నా ఫిట్‌నెస్‌ను బౌచర్‌ ముందు నిరూపించుకునే జట్టులోకి వస్తా'అని డివిలియర్స్‌ తెలిపాడు.

22 ఏళ్ల కుర్రాడితో.. స్టార్ ఫుట్‌బాలర్ తల్లి డేటింగ్‌..!!

సహచరుల కంటే మెరుగ్గా ఉంటేనే..

సహచరుల కంటే మెరుగ్గా ఉంటేనే..

‘అంతేకాక జట్టులో స్థానం కోసం పోటీపడే వారి కంటే మెరుగ్గా ఉంటేనే బరిలోకి దిగుతా. ప్రాతినిధ్యం వహించాలనే ఆశతో రాలేను. దేశం కోసం శ్రమించాలని భావిస్తున్నా. గత ఏడాది వన్డే ప్రపంచకప్‌ జరిగిన సమయంలో ఎంతో బాధపడ్డా. జట్టులోకి నేను వస్తారని ప్రజలు భావించారు. అయితే నేను క్రికెట్‌లో పునరాగమనం చేస్తే అందులో బౌచర్‌ పాత్ర కీలకం'' అని డివిలియర్స్‌ చెప్పుకొచ్చాడు.

బౌచర్ కూడా ఫిట్‌గా ఉంటేనే..

బౌచర్ కూడా ఫిట్‌గా ఉంటేనే..

ఈ ఏడాది ఫిబ్రవరిలో సఫారీ కోచ్‌ మార్క్‌ బౌచర్‌ మాట్లాడుతూ.. ఏబీ ఫామ్‌లో ఉంటేనే టీ20 వరల్డ్‌కప్‌ జట్టుకు ఎంపిక చేస్తామని స్పష్టం చేశాడు. మెగా టోర్నీకి అత్యుతమ జట్టును ఎంపిక చేయడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ప్రపంచకప్ ముందు జరిగే కొన్ని సిరీస్‌ల సెలెక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనాలని కూడా బౌచర్ సూచించాడు. ఏబీ 100 శాతం ఫిట్‌గా ఉంటేనే జట్టులోకి వస్తాడని స్పష్టం చేశాడు. ఇప్పుడు ఏబీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

Story first published: Monday, April 13, 2020, 19:14 [IST]
Other articles published on Apr 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X