Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

22 ఏళ్ల కుర్రాడితో.. స్టార్ ఫుట్‌బాలర్ తల్లి డేటింగ్‌..!!

Brazil footballer Neymar Mother Announces Dating Boy 6 Years Younger Than Him

రియో డి జనీరో: 'ప్రేమకు వయసుతో సంబంధం లేదు.. మనసులు కలిస్తే చాలు' అనే మాటలు మరోసారి నిరూపితమయ్యాయి. బ్రెజిల్‌ స్టార్‌ ఫుట్‌బాలర్, ప్యారిస్‌ సెయింట్‌-జెర్మయిన్‌ క్లబ్‌ జట్టు ఫార్వర్డ్‌ ప్లేయర్‌ నెమార్‌ తల్లి నడీనె గొంజాల్వెస్‌ (52) లేటు వయసులో ప్రేమలో పడింది.

అది కూడా తన కొడుకు నెమార్ కన్నా 6 ఏళ్ల చిన్నవాడైన యువకుడితో కావడం విశేషం. దీంతో ఈ లేటు ప్రేమవ్యవహారం హాట్ టాపిక్ అయింది. నాలుగేళ్ల క్రితమే భర్త సీనియర్ నెమార్ సాంటోస్‌తో విడాకులు తీసుకున్న ఆమె.. తమ 25 ఏళ్ల వివాహ బంధానికి గుడ్ బై చెప్పింది.

అనంతరం టియాగొ రమోస్‌ అనే 22 ఏళ్ల యువకుడితో కొద్ది కాలంగా డేటింగ్‌ చేస్తుంది. తాజాగా టియాగొతో కలిసి ఉన్న ఫొటోని నడీనె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడంతో వీరి బంధం బహిర్గతమైంది. ఈ ఫొటోకు తమ బంధాన్ని వివరించలేం.. మమ్మల్ని వదిలేయండి అనే వ్యాఖ్యలను క్యాప్షన్‌గా పేర్కొంది. ఇక ఈ ఫొటోపై 'కొత్త బంధంలో సంతోషంగా ఉండు అమ్మా' అని నెమార్‌ కామెంట్‌ చేయడం గమనార్హం.

ఇక టియాగొ..నెమార్‌కు వీరాభిమాని. ఇదే విషయాన్ని తెలియజేస్తూ 2017లో నెమార్‌‌కు అతను బ్రదర్ అంటూ ఓ మేసేజ్ కూడా చేశాడు. ప్రస్తుతం ఇది నెట్టింట హల్‌చల్ చేస్తోంది. 'నెమార్..నువ్వో అద్భుతమైన ఆటగాడివి. నీకు నేను వీరాభిమాననే విషయాన్ని నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నీ ఆటను చూసి నేను ఎంతో స్పూర్తిని పొందా. ఏదో ఒక రోజు ఈ మెసేజ్‌ను నీతో చదువుతానని ఆశిస్తున్నా. సోదరుల్లా మనమిద్దం కలిసి ఆడుతాం. నువ్వు నా డ్రీమీ బాయ్.. నిన్ను కలుస్తాననే నమ్మకం కూడా నాకుంది. దేవుని ఆశిస్సులతో విజయాలందుకుంటూ సంతోషంగా ఉండూ'అని టియాగో మెసేజ్ చేశాడు. ప్రస్తుతం తన అభిమాన ఆటగాడి తల్లితో డేటింగ్ చేస్తుండటంతో ఈ మెసేజ్ మరో సారి చర్చనీయాంశమైంది.

ఇక నెమార్‌ కరోనా కట్టడికి భారీ విరాళమిచ్చిన సంగతి తెలిసిందే. అతను 10 లక్షల డాలర్ల (రూ. 7,64, 18,241) విరాళం ప్రకటించినట్లు అక్కడి స్థానిక టీవీ చానల్‌ తెలిపింది. ఈ మొత్తాన్ని 'యూనిసెఫ్‌'తో పాటు టీవీ వ్యాఖ్యాత లూసియానో హక్‌ ఆధ్వర్యంలో జరుగుతోన్న చారిటీ క్యాంపెయిన్‌ కోసం వినియోగించనున్నారు.

Story first published: Monday, April 13, 2020, 18:15 [IST]
Other articles published on Apr 13, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+