న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

14 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ పర్యటనకు సౌతాఫ్రికా!

South Africa cricket team announced tour of Pakistan in early 2021

కరాచీ: సౌతాఫ్రికా క్రికెట్ టీమ్ పద్నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్ పర్యటనకు వెళ్లనుంది. జనవరిలో మొదలయ్యే ఈ టూర్‌లో తమ జట్టుతో సఫారీ టీమ్ రెండు టెస్ట్‌లు, మూడు టీ20లు ఆడుతుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) బుధవారం ప్రకటించింది. ఈ మేరకు సౌతాఫ్రికా బోర్డు నుంచి కన్ఫర్మేషన్ రావడంతో టూర్ షెడ్యూల్‌ను కూడా ఖారారు చేసింది. దీని ప్రకారం జనవరి 26-30 మధ్య కరాచీలో ఫస్ట్ టెస్ట్ జరుగుతుంది. రెండో టెస్ట్‌కు (ఫిబ్రవరి 4-8)కు రావల్పిండి ఆతిథ్యం ఇస్తుంది.

లాహోర్ వేదికగా ఫిబ్రవరి 11, 13, 14వ తేదీల్లో మూడు టీ20ల సిరీస్ ప్లాన్ చేశారు. రెండు సిరీస్‌ల కోసం జనవరి 16వ తేదీనే సౌతాఫ్రికా టీమ్ కరాచీలో అడుగుపెడుతుందని పీసీబీ తెలిపింది. కొన్ని రోజుల ఐసోలేషన్‌లో ఉన్న తర్వాత ట్రెయినింగ్ సెషన్స్‌లో పాల్గొంటుందని చెప్పింది. సఫారీ టీమ్ చివరగా 2007లో పాక్ టూర్‌కు వచ్చింది. కరాచీ టెస్ట్‌లో 160 రన్స్ తేడాతో గెలిచి సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది. ఆ తర్వాత 2010, 2013లో యూఏఈ వేదికగా పాక్‌తో తలపడింది.

Story first published: Thursday, December 10, 2020, 12:09 [IST]
Other articles published on Dec 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X