న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అభాగ్యులకు గంగూలీ అండ.. రూ.50 లక్షల విరాళం

 Sourav Ganguly to donate Rs 50 lakh worth rice to underprivileged people

కోల్‌కతా: కరోనాపై పోరాడేందుకు అన్ని రంగాల సెలెబ్రిటీలు ముందుకొస్తున్నా.. కోట్ల ఆదాయం ఉన్న క్రికెటర్లు ఒక్క రూపాయి సాయం ప్రకటించరే.. అనుకుంటున్న తరుణంలో బీసీసీఐ బాస్, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ముందుకొచ్చాడు.

దాదా చేయుత..

దాదా చేయుత..

కరోనా లాక్‌డౌన్‌తో తిండి కోసం అల్లాడుతున్న అభాగ్యులను ఆదుకోవడానికి ఈ కోల్‌కతా ప్రిన్స్ చేయుతనందించాడు. కరోనా మహమ్మారితో సరిగ్గా భోజనం కూడా అందని జీవులకు బియ్యం అందించేందుకు రూ.50 లక్షల విరాళాన్ని అందజేసి తన పెద్ద మనసును చాటుకున్నాడు. బీసీసీఐ బాస్‌గా క్రికెటర్లు విరాళల కార్యక్రమానికి నాంది పలికాడు.

గేల్.. నువ్వే నా క్వారంటైన్‌ పార్ట్‌నర్.. రమ్ తీసుకురావడం మర్చిపోకు: మహిళా క్రికెటర్

మరింత మంది..

మరింత మంది..

లాల్ బాబా రైస్ సంస్థతో సంయుక్తంగా దాదా ఈ సాయం చేయనున్నాడు. భద్రత, రక్షణ కల్పించడం కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఉంచిన అభాగ్యులకు గంగూలీ బియ్యం అందజేయనున్నాడని క్రికెట్ అసోసియేషన్ బెంగాల్ (క్యాబ్) ఓ ప్రకటనలో తెలిపింది.

‘గంగూలీ చూపించిన ఈ చొరవ.. ప్రజలకు సేవ చేయడానికి మరింత మంది ముందుకొచ్చేలా చేస్తుందని ఆశిస్తున్నాం'అని క్యాబ్ పేర్కొంది.

600 కేసులు..

600 కేసులు..

ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం స‌ృష్టిస్తుండటం.. భారత్‌లో కూడా బాధితుల సంఖ్య 600కు పైగా చేరడంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించింది. దీంతో ఎందరో అభాగ్యులు, ముఖ్యంగా బిచ్చగాళ్లకు తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు. ఇక కరోనా బారిన పడకుండా బెంగాల్ ప్రభుత్వం వారిని గవర్నమెంట్ పాఠశాలల్లో ఉంచింది. వీరికి దాతల సాయంతో భోజన సౌకర్యం కల్పిస్తుంది. వీరికే సాయం చేయడానికి దాదా ముందుకొచ్చాడు.

గంగూలీని చూసైనా..?

గంగూలీని చూసైనా..?

ఇప్పటికే క్రీడారంగం నుంచి భారత రెజ్లర్ బజరంగ్ పూనియా తన 6 నెలల జీతం ప్రకటించగా.. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన స్నేహితుల సాయంతో అభాగ్యులకు భోజన వసతి కల్పిస్తోంది. ఇక కోట్ల ఆదాయం ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ ఇంత వరకు ఎలాంటి విరాళలు ప్రకటించలేదు. సాయం చేసింది కూడా లేదు. గంగూలీ చూపించిన చొరవతోనైనా అభాగ్యులకు చేయుతను అందిస్తారని వారి అభిమానులు ఆశతో ఎదురు చూస్తున్నారు.

Story first published: Wednesday, March 25, 2020, 20:55 [IST]
Other articles published on Mar 25, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X