న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్మిత్‌ను నాలుగు బంతుల్లో ఔట్ చేస్తా: అక్తర్

Shoaib Akhtar sure of dismissing Steve Smith Just Four Balls

కరాచీ: నిలకడకే మారుపేరైనా ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌ను నాలుగు బంతుల్లోనే ఔట్ చేస్తానని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తెలిపాడు. బాల్‌టాంపరింగ్ వివాదంతో ఏడాదిపాటు ఆటకు దూరమైన స్మిత్.. గతేడాది జరిగిన యాషెస్ సిరీస్‌లో అసాధారణ ఆటను ప్రదర్శించాడు. ఏ ఫార్మాట్‌లోనైతే అవమానానికి గురయ్యాడో అందులోనే తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. జట్టు మొత్తం విఫలమైనా ఒక్కడిగా పోరాడి.. తానేంత పవర్ ఫుల్‌ బ్యాట్స్‌మన్‌నో ప్రపంచానికి చాటాడు. ఈ ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన స్మిత్ 110.57 సగటుతో 774 పరుగులు చేశాడు.

అయితే ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ బౌలర్ల సహనానికి సవాల్‌గా నిలిచిన స్మిత్.. జోఫ్రా ఆర్చర్ బౌన్సర్లను ఆడటంలో మాత్రం తడబడ్డాడు. దీంతో ఇతర బౌలర్లు కూడా బౌన్సర్లనే అస్త్రాలుగా అతనిపై ప్రయోగించారు. అక్తర్ కూడా బౌన్సర్లతోనే స్మిత్‌ను బోల్తా కొట్టిస్తానని ధీమా వ్యక్తం చేశాడు.

మూడు హర్టింగ్ బౌన్సర్లు వేసి.. నాలుగో బంతికి ఔట్ చేస్తానని తన వ్యూహాన్ని వెల్లడించాడు. ఇంతకీ స్మిత్‌ను ఔట్ చేస్తానని అక్తర్ చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే.. కరోనా పుణ్యమా క్రికెట్ టోర్నీలు రద్దవ్వడంతో స్టార్ క్రికెటర్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఫాంటసీ క్రికెట్ తెగ హల్‌చల్ చేస్తోంది.

క్రికెట్ వెబ్‌సైట్స్ అన్నీ... మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్ల మధ్య పోటీ ఉంటే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో పోస్ట్‌లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్రిక్ ఇన్‌ఫోన్ విరాట్-షేన్ వార్న్, స్టీవ్ స్మిత్-షేన్ వార్న్, బాబర్-మెక్ గ్రాత్, సచిన్-రషీద్‌లు తలపడితే ఎలా ఉంటుందో ఊహించండంటూ ..ఓ క్వశ్చన్ పోల్ పెట్టింది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అక్తర్ దీనిపై స్పందించాడు. ఈ వయసులో కూడా స్టీవ్ స్మిత్‌ను నాలుగంటే నాలుగు బంతుల్లోనే ఔట్ చేస్తానని ట్వీట్ చేశాడు.

ఇక ప్రతీ విషయంపై స్పందిస్తూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటున్న ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్.. కరోనా ఫండ్ రైజింగ్ కోసం భారత్- పాక్ ద్వైపాక్షిక సిరీస్ నిర్వహించాలని ప్రతిపాదించి చివాట్లు తిన్నాడు. తాజాగా గంభీర్, సెహ్వాగ్‌కు పబ్లిక్‌లో మాట్లాడటం తెలియదని కామెంట్ చేశాడు. ఇలా ఏదో ఒకటి మాట్లాడుతూ తరుచూ వార్తల్లో నిలుస్తున్నాడు.

పాంటింగ్ తీసుకున్న అత్యంత చెత్త నిర్ణయం అది: షేన్ వార్న్పాంటింగ్ తీసుకున్న అత్యంత చెత్త నిర్ణయం అది: షేన్ వార్న్

Story first published: Tuesday, May 12, 2020, 15:34 [IST]
Other articles published on May 12, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X