న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెహ్వాగ్, గంభీర్‌కు పబ్లిక్‌లో ఎలా మాట్లాడాలో తెలియదు: అక్తర్

Shoaib Akhtar Says Virender Sehwag, Gautam Gambhir don’t know how to speak in public

కరాచీ: టీమిండియా మాజీ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్‌లకు పబ్లిక్‌లో ఎలా మాట్లాడాలో తెలియదని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు.కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ సోషల్ మీడియా వేదికగా తరుచూ ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతున్నాడు. ఆదివారం హలో మైబైల్ యాప్‌లో చిట్‌చాట్ చేసిన అక్తర్.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

నోటికేదొస్తే అదే..

నోటికేదొస్తే అదే..

భారత మాజీ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్ మంచివారంటూనే వారిపై విమర్శలు గుప్పించాడు.‘సెహ్వాగ్, గంభీర్ చాలా మంచి వ్యక్తులు. మానవత్వం కలిగిన ఆటగాళ్లు. కానీ టీవీ షోలో మాత్రం తమ నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతారు. నేను కూడా వారిలా మాట్లాడగలను. చెడు మాటలు చెప్పగలను. కానీ నేను అలా చేయను. ఎందుకంటే.. చిన్న పిల్లలు టీవీ షోలు చూస్తారు.'అని చెప్పుకొచ్చాడు.

ఆ హీరో ఫ్యాన్స్‌ను చూసి..

ఆ హీరో ఫ్యాన్స్‌ను చూసి..

మైదానంలో దూకుడుగా ఉండే అక్తర్..సెహ్వాగ్‌‌తో చోటు చేసుకున్న వివాదంపై కూడా స్పందించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో చెత్తగా మాట్లాడొద్దని, ఈరోజు ఫాదర్స్ డే అని, కిడ్‌గా నీ గురించి మేము కేర్ తీసుకుంటామని సెహ్వాగ్‌తో అన్నానని అక్తర్ గుర్తు చేసుకున్నాడు. పైకి చాలా మొరటుగా, కోపిష్టిగా తాను కనిపిస్తున్నా.. తన మనసు చాలా సున్నితమని ఈ పాక్ పేసర్ చెప్పుకొచ్చాడు. షారుఖ్ అభిమానులు చూపించే అభిమానంతో ప్రేమగా ఉండటం తెలుసుకున్నానని అక్తర్ చెప్పుకొచ్చాడు.

‘నాలో చాలా సున్నితత్వం ఉంది. కానీ పైకి మాత్రం నేను చాలా సీరియస్, దూకుడైన బౌలర్‌గా కనిపిస్తాను. ప్రేమగా ఉండటం షారుఖ్ కాన్ ఫ్యాన్స్ నుంచి నేర్చుకున్నా.'అని అక్తర్ తెలిపాడు. ‘షారుఖ్ తన అభిమానులను నిత్యం కలుసుకుంటాడు. ఆ సమయంలో ఫాన్స్ చాలా సంతోషిస్తారు. షారుఖ్ నాకు అన్నయ్య లాంటివాడు. అలాగే అమీర్ ఖాన్ కూడా'అని ఈ ఫాస్టెస్ట్ పేసర్ చెప్పుకొచ్చాడు.

ముంబైలో సెటిల్ అవుతా..

ముంబైలో సెటిల్ అవుతా..

నువ్వు బిలినియర్ అయితే ఏం చేస్తావని ఓ అభిమాని ప్రశ్నించగా.. తనకే అంత సంపద ఉంటే ముంబైకి వచ్చి సెటిల్ అవుతానన్నాడు. ఇక అప్‌కమింగ్ పాకిస్థాన్ క్రికెటర్ నజీమ్ షా అచ్చం తన యాటిట్యూడే కలిగి ఉన్నాడని, అతనిలో తనను చూసుకుంటున్నానని అక్తర్ తెలిపాడు. రాబోయే రోజుల్లో అత్యంత పవర్ ఫుల్ ప్లేయర్‌గా ఎదుగుతాడని చెప్పుకొచ్చాడు.

ఆ రికార్డు కోహ్లీదే..

ఆ రికార్డు కోహ్లీదే..

'మోడ్రన్ డే క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా లాంటి దిగ్గజ క్రికెటర్లను మళ్లీ చూడలేం. దీంతో పాటు క్రికెట్ నాణ్యత కూడా బాగా తగ్గింది. అయితే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన 100 సెంచరీల రికార్డుని విరాట్ కోహ్లీ బద్దలు కొట్టగలడు. ప్రస్తుతం కోహ్లీ చాలా దూకుడుగా ఆడుతున్నాడు. 120 సెంచరీలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే.. అతడు కృతనిశ్చయంతో ఆడుతున్నాడు' అని అక్తర్ అన్నాడు.

సెహ్వాగ్ మరో దేశం తరఫున ఆడుంటే ఖచ్చితంగా ఆ ఘనతనందుకునేవాడు: పాక్ మాజీ క్రికెటర్

Story first published: Monday, May 11, 2020, 16:30 [IST]
Other articles published on May 11, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X