Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెహ్వాగ్ మరో దేశం తరఫున ఆడుంటే ఖచ్చితంగా ఆ ఘనతనందుకునేవాడు: పాక్ మాజీ క్రికెటర్

Rashid Latif Says Virender Sehwag would’ve easily crossed 10,000 Test runs if he played for another country

కరాచీ: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఏమాత్రం భయంలేని ఆటగాడనే విషయం తెలిసిందే. ఏనాడు వ్యక్తిగత రికార్డులపై దృష్టిపెట్టని ఈ విధ్వంసకర బ్యాట్స్‌మన్.. ట్రిపుల్, డబుల్ సెంచరీలను కూడా సిక్సర్లతో సాధించేవాడు.

క్రీజులో దిగితే నిర్భీతితో ఆడే నజఫ్‌గర్ నవాబ్.. తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై దాడికి దిగేవాడు. ముఖ్యంగా దాయాదీ దేశం పాకిస్థాన్‌ను తన బ్యాటింగ్‌తో గజగజలాడించాడు. ఎంతలా అంటే 2003-04 ద్వైపాక్షిక సిరీస్‌లో నాటి పాక్ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్.. సెహ్వాగ్ తమ సింహ స్వప్నమని చెప్పేలా వణికించాడు. అలాంటి అద్భుత బ్యాట్స్‌మన్ కనీసం వీడ్కోలు మ్యాచ్ లేకుండా కెరీర్‌ను ముగించాడు. సెహ్వాగ్ అభిమానులకు ఇప్పటికి ఇది బాధించే విషయమే.

సచిన్, ద్రవిడ్ నీడలో..

సచిన్, ద్రవిడ్ నీడలో..

అయితే ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ వీరూపై ప్రశంసల జల్లు కురిపించాడు. సెహ్వాగ్ మరో దేశం తరఫున ఆడి ఉంటే.. సంప్రదాయక ఫార్మాట్‌లో పది వేల పరుగులు సునాయసంగా చేసేవాడని తెలిపాడు. ఇక 104 టెస్ట్‌లు ఆడిన సెహ్వాగ్ 23 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలతో 8,586 పరుగులు చేశాడు. 10వేల క్లబ్‌కు మరో 1424 పరుగుల దూరంలో ఉండిపోయాడు. సచిన్, ద్రవిడ్ నీడలో సెహ్వాగ్‌ ప్రతిభకు రావాల్సిన గుర్తింపు దక్కలేదని ఓ యూట్యూబ్ చానెల్ చిట్‌చాట్‌లో లతీఫ్ అభిప్రాయపడ్డాడు. వీరూ.. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టు మొత్తాన్ని ప్రభావితం చేసేవాడన్నాడు.

పిచ్, బౌలర్లుతో సెహ్వాగ్‌కు సంబంధం లేదు..

పిచ్, బౌలర్లుతో సెహ్వాగ్‌కు సంబంధం లేదు..

‘సెహ్వాగ్ తన ఆటతో ఆథిపత్యం కనబర్చేవాడు. మేము ఓపెనర్లగా బరిలోకి దిగితే పిచ్‌ స్వభావం, బౌలర్లు ఎవరు అనే విషయాన్ని ఫోకస్‌ చేసేవాళ్లం. సెహ్వాగ్‌ది మాత్రం అలాంటి నైజం కాదు. పిచ్, బౌలర్‌తో సెహ్వాగ్‌కు ఏమాత్రం అవసరంలేదు. దూకుడే అతని మంత్రం. గ్లెన్‌ మెక్‌గ్రాత్‌, బ్రెట్‌ లీ, వసీం అక్రమ్‌, షోయబ్‌ అక్తర్‌ వంటి స్టార్‌ బౌలర్లు బౌలింగ్‌ చేసినా సెహ్వాగ్‌ బెదిరేవాడుకాదు.

బౌలర్‌కు భయపడిన సందర్భం సెహ్వాగ్‌ కెరీర్‌లోనే లేదు. అతను అత్యంత ప్రభావవంతమైన క్రికెటర్‌. సెహ్వాగ్‌ ఆటను చూసి ప్రత్యర్థి జట్లు వణికిపోయేవి. భారత జట్టులో సెహ్వాగ్‌ ఒక చెరగని ముద్ర వేశాడు. వరల్ఢ్‌ క్రికెట్‌లో ఒక విజయవంతమైన ఆటగాడు సెహ్వాగ్‌.'అని లతీఫ్‌ కొనియాడాడు.

అతని రికార్డులే అతనేంటో చెబుతాయి..

అతని రికార్డులే అతనేంటో చెబుతాయి..

‘సెహ్వాగ్ ఏంటో అతని రికార్డులే చెబుతాయి. టెస్ట్ క్రికెట్‌లో 8వేలకు పైగా పరుగులు చేశాడు. కానీ అతనికి రావాల్సిన గుర్తింపు రాలేదు. ఇతర క్రికెటర్లు నీడలోనే ఉండిపోయాడు. సచిన్, ద్రవిడ్‌తో కలిసి ఆడాడు. అతనే కనుక వేరే దేశం తరఫున ఆడి ఉంటే చాలా సులువుగా 10 వేల పరుగులు పూర్తి చేసేవాడు. ఈ రికార్డుకు కేవలం 1500 పరుగుల దూరంలో నిలిచిపోయాడు.'అని ఈ పాక్ మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు.

12 ఏళ్లు అయినా ఆ రికార్డు చెక్కు చెదరలే..

12 ఏళ్లు అయినా ఆ రికార్డు చెక్కు చెదరలే..

2004లో ముల్తాన్ వేదికగా పాకిస్థాన్‌పై భారత్ తరఫున తొలి ట్రిపుల్ సెంచరీ చేసిన సెహ్వాగ్.. మరో నాలుగేళ్లకు 2008లో సౌతాఫ్రికాపై మరో త్రిశతకంతో మెరిసాడు. అతను చేసిన 319 పరుగులు ఇప్పటికీ టెస్ట్‌ల్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్. 12 ఏళ్లు అయిన ఈ రికార్డు చెక్కు చెదరలేదు. ఇక 2013లో హైదరాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్ ఆడిన సెహ్వాగ్.. అనంతరం నిలకడలేమి ఆటతో జట్టుకు దూరమై క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

ధావన్ ఓ ఇడియట్.. ఫస్ట్ బాల్ ఆడటానికి ఇష్టపడడు: రోహిత్ శర్మ

Story first published: Saturday, May 9, 2020, 17:39 [IST]
Other articles published on May 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+