న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గంగూలీ ఎలాంటి వాడో చెప్పిన అక్తర్‌!!

Shoaib Akhtar praised Sourav Ganguly in his recent Instagram post

కరాచీ: పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్ ఎప్పుడూ ఎలా ఉంటాడో ఊహించడం కొంచెం కష్టమే. వీలు చిక్కినప్పుడల్లా ప్రతి ఆటగాడిపై నోరు పారేసుకునే అక్తర్.. ఒక్కోసారి ప్రశంసలు కూడా కురిపిస్తాడు. ఇప్పుడు మాత్రం టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీని పొగడ్తలతో ముంచెత్తాడు. ఇది ఆశ్చర్యంగా అనిపిస్తున్నా.. ఇదే నిజం. రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేసి దాదాను ఆకాశానికి ఎత్తేశాడు. ఫొటోలో దాదాతో కలిసి అక్తర్ ఎదో మాట్లాడుతున్నాడు.

దాదా గొప్ప కెప్టెన్

దాదా గొప్ప కెప్టెన్

భారత్‌-పాకిస్తాన్ జట్లకు షోయబ్‌ అక్తర్, సౌరవ్ గంగూలీలు ఆడుతున్న రోజుల్లో మాట్లాడుకుంటున్న ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్న రావల్పిండి ఎక్స్‌ప్రెస్ ఇలా రాసుకొచ్చాడు. 'నేను ఆడే రోజుల్లో ఏ జట్టు మీదైనా పోటీపడేందుకు సిద్ధంగా ఉండేవాడిని. ఎందుకంటే.. నాకు ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం చెలాయించడమంటే ఇష్టం. నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన ప్రత్యర్థుల్లో సౌరవ్ గంగూలీ ఒకరు. అతను బలమైన ప్రత్యర్థే కాదు.. గొప్ప కెప్టెన్‌ కూడా. అతని నాయకత్వంలో నేను ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున ఆడా' అని అక్తర్‌ పేర్కొన్నాడు.

నైట్‌ రైడర్స్‌ తరఫున ఆడిన అక్తర్

నైట్‌ రైడర్స్‌ తరఫున ఆడిన అక్తర్

2008 ఐపీఎల్‌ ఆరంభ సీజన్‌లో ఆడిన షోయబ్‌ అక్తర్ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున మూడు మ్యాచ్‌ల్లో పాల్గొని 5 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు సరిగా లేకపోవడంతో పాక్ ఆటగాళ్లను ఐపీఎల్‌లో బీసీసీఐ ఆడనివ్వట్లేదు. అంతేకాదు దాయాది దేశాలు కేవలం ఐసీసీ మ్యాచులలోనే తలపడుతున్నాయి. అక్తర్‌ పాక్‌ తరపున 46 టెస్టుల్లో 176 వికెట్లు, 163 వన్డేల్లో 247 వికెట్లు, 15 టీ20ల్లో 19 వికెట్స్ పడగొట్టాడు. పాకిస్థాన్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 224 మ్యాచ్‌లు ఆడిన అక్తర్.. 444 వికెట్లతో ప్రపంచంలో అత్యంత భయంకరమైన బౌలర్లలో ఒకరిగా నిలిచాడు. 2003 వన్డే ప్రపంచకప్‌లో గంటకి 161.3కిమీ వేగంతో బంతిని విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

బుమ్రా అన్ని ఫార్మాట్లు ఆడడం కష్టం

బుమ్రా అన్ని ఫార్మాట్లు ఆడడం కష్టం

భారత స్పీడ్​స్టర్ జస్పీత్ బుమ్రా అన్ని ఫార్మాట్లు ఎక్కువ కాలం ఆడలేడని షోయబ్ అక్తర్ తాజాగా అభిప్రాయపడ్డాడు. బుమ్రాది చాలా క్లిష్టమైన బౌలింగ్ యాక్షన్ అని, దీంతో అతడు త్వరగా నడుము గాయానికి గురవుతాడన్నాడు. 'బుమ్రాది చాలా కష్టమైన బౌలింగ్ యాక్షన్. అన్ని ఫార్మాట్లు అతడు ఎక్కువకాలం ఆడలేడు. అతడు టెస్టు క్రికెట్ ఆడడం సాహసోపేతమే. బుమ్రా చాలా కష్టపడుతూ ఏకాగ్రతగా ఉంటాడు. కానీ అతడి నడుము పరిస్థితి ఏంటి?. యాక్షన్ వల్ల అతడు బంతి వేసేటప్పుడు నడుముపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. దీనివల్ల అతడిని నడుము గాయం తొందరగా వస్తుందనుకుంటున్నా' అని అక్తర్ అభిప్రాయపడ్డాడు.

IPL 2020: ముంబైకి గుడ్ న్యూస్.. లీగ్ మొత్తానికి అందుబాటులో మలింగ!!

Story first published: Tuesday, August 11, 2020, 18:59 [IST]
Other articles published on Aug 11, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X