
పంత్ మ్యాచ్ విన్నర్..
న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన మూడో వన్డే వర్షం కారణంగా రద్దవ్వడంతో టీమిండియా 0-1తో సిరీస్ కోల్పోయింది. మూడో వన్డే రద్దయ్యిన అనంతరం మీడియా సమావేశం పాల్గొన్న శిఖర్ ధావన్‌ను సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై ప్రశ్నించగా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమది సరైన నిర్ణయమేనని చెప్పుకొచ్చాడు. 'ఇంగ్లండ్‌లో రిషభ్ పంత్ సెంచరీ చేశాడు. సెంచరీ చేసిన ఏ ఆటగాడికైనా జట్టు నుంచి మద్దతు లభిస్తుంది. ఓవరాల్‌గా చూస్తే రిషభ్ పంత్ ఓ మ్యాచ్ విన్నర్. అతనికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది.

సంజూ వెయిట్ చేయాలి..
చాలా విశ్లేషణల తర్వాతే రిషభ్ పంత్‌కు అండగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. సంజూ శాంసన్ కూడా వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. అయితే కొన్నిసార్లు అద్భుతంగా రాణించినా వేచి చూడక తప్పదు. సంజూ కూడా ఓ మ్యాచ్ విన్నర్'అని ధావన్ చెప్పుకొచ్చాడు. ఈ పర్యటనలో ఫలితంతో సంబంధం లేకుండా సానకూల, ప్రతికూల అంశాలను ఈ యంగ్ టీమ్‌తో చర్చించడంతో పాటు విశ్లేషించామని తెలిపాడు. ఈ సిరీస్‌లో ఏకైక సానుకూలాంశం టీమ్ బాండింగ్ అని చెప్పాడు. మరో సానుకూలంశం ఏంటేంటే ప్రధాన జట్టులో ఎవరైన గాయపడితే వారి స్థానల్లో ఆడేందుకు ఆటగాళ్లు సిద్దంగా ఉన్నారని చెప్పాడు.

పంత్ కంటే సంజూనే బెటర్..
ఈ ఏడాది పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రిషభ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. ఇప్పటి వరకు 12 వన్డేల్లో 10 ఇన్నింగ్స్‌లు ఆడిన అతను 37.33 యావరేజ్‌తో 336 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు రెండు హాఫ్ సెంచరీలున్నాయి. తాజా న్యూజిలాండ్ పర్యటనలో అతను 15, 10 పరుగులతో విఫలమయ్యాడు. ఏకైక మ్యాచ్ ఆడిన సంజూ శాంసన్ 36 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఈ ఏడాది 10 వన్డే మ్యాచ్‌ల్లో 9 ఇన్నింగ్స్‌లు ఆడిన సంజూ 71 యావరేజ్‌తో 284 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సార్లు సంజూ నాటౌట్‌గా నిలిచాడు. అత్యుత్తమ స్కోర్ 86 నాటౌట్‌గా ఉంది.

సుందర్ ఒక్కడే..
వర్షంతో రద్దయిన మూడో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 47.3 ఓవర్లలో 219 పరుగులు మాత్రమే చేసింది. వాషింగ్టన్ సుందర్(64 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 51) ఒక్కడే హాఫ్ సెంచరీతో జట్టు పరువును కాపాడగా.. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. సూర్య, అయ్యర్, దీపక్ హుడాలు కూడా జట్టుకు అండగా నిలవలేకపోయారు.
న్యూజిలాండ్ బౌలర్లలో ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్ మూడేసి వికెట్లు తీయగా.. లాకీ ఫెర్గూసర్, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సరికి 18 ఓవర్లలో వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది. వర్షం ఆగకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు.