న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీసేనను పాక్ జట్టుతో పోల్చిన సంజయ్.. మండిపడుతున్న ఫ్యాన్స్!

Sanjay Manjrekar Says India under Virat Kohli reminds me of Pakistan under Imran Khan, Netizens Fire

హైదరాబాద్: భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ మరోసారి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఇటీవల స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను విమర్శించిన అతను తీవ్ర ట్రోలింగ్‌కు గురైన విషయం తెలిసిందే. తాజాగా న్యూజిలాండ్ గడ్డపై అదరగొట్టిన కోహ్లీ సేనను కొనియాడే క్రమంలో ఒకప్పటి పాకిస్థాన్ జట్టుతో పోల్చి మరోసారి చేయి కాల్చుకున్నాడు.

శివమ్ దూబే చెత్త రికార్డు.. యువరాజ్ సిక్స్ సిక్సర్లకు బలైన స్టువర్ట్ బ్రాడ్ తర్వాత..శివమ్ దూబే చెత్త రికార్డు.. యువరాజ్ సిక్స్ సిక్సర్లకు బలైన స్టువర్ట్ బ్రాడ్ తర్వాత..

ఇమ్రాన్ టీమ్ గుర్తొస్తుంది..

ఇక న్యూజిలాండ్ గడ్డపై 5-0తో టీ20 సిరీస్ నెగ్గిన భారత్ నయా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌ చివరి మూడు మ్యాచ్‌ల్లో భారత్ అద్భుతం చేసింది. ఓటమి అంచు నుంచి అద్భుతంగా పోరాడి విజయాన్నందుకుంది. ఈ క్రమంలోనే కోహ్లీసేనను చూస్తే ఒకప్పడు ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ జట్టుకు గుర్తుకు వస్తుందని సంజయ్ మంజ్రేకర్ ట్వీట్ చేశాడు.

‘కోహ్లీ సారథ్యంలోని భారత జట్టును చూస్తే నాకు ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీలోని పాకిస్థాన్ జట్టు గుర్తుకు వస్తుంది. జట్టుగా బలమైన ఆత్మవిశ్వాసం కలిగిన ఇమ్రాన్ ఖాన్ సేన.. కొత్త విధానానికి నాంది పలికింది. ఓడిపోయే మ్యాచ్‌లను కూడా ఏలా గెలవచ్చో ప్రపంచానికి తెలియజేసింది. అది కేవలం ఆత్మ విశ్వాసం బలంగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది.' అని ట్వీట్ చేశాడు.

పోల్చడానికి నీకు ఇంకో దేశమే దొరకలేదా?

అయితే కోహ్లీ సేనను దాయదీ దేశంతో పోల్చడాన్ని భారత అభిమానులు తప్పుబడుతున్నారు. ‘80/90లోని వెస్టిండీస్ టీమ్‌తో పోల్చు లేకుంటే 2000లోని ఆస్ట్రేలియా టీమ్‌తో కంపేర్ చేయ్. తక్కువ ప్రమాణాలు కలిగిన నిన్ను మేం ఏమాత్రం నిందించలేం' ఒకరు మండిపడగా.. దాదా సారథ్యంలోని భారత జట్టు ఎందుకు గుర్తుకురాలేదని మరొకరు ప్రశ్నించారు. ఇక పాకిస్థాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఎలా పనిచేస్తున్నారో రివ్యూ ఇవ్వండని ఇంకొకరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పోల్చడానికి నీకు ఇంకో దేశమే దొరకలేదా? అని మరొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వారెవ్వా.. సూపర్ ఫీల్డింగ్‌తో సిక్సర్‌ను అడ్డుకున్న శాంసన్ (వీడియో)

బ్యాట్స్‌మన్ కీపర్ దొరికిండు..

సిరీస్ ఆసాంతం ఆకట్టుకొని మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన కేఎల్ రాహుల్‌పై కూడా సంజయ్ ప్రశంసల జల్లు కురిపించాడు. టీమ్‌మేనేజ్‌మెంట్ ఇచ్చిన ప్రతీ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నాడని ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్‌ను కొనియాడాడు. కోహ్లీ, రోహిత్ లేకున్నా.. రాహుల్ కెప్టెన్సీ‌లో అదరగొట్టాడని తెలిపాడు. మొత్తానికి ఈ సిరీస్‌తో బ్యాట్స్‌మన్ కీపర్ దొరికిండని ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు.

తదుపరి సంజూ శాంసన్, రిషబ్ పంత్

ఇక సంజూ శాంసన్, రిషబ్ పంత్ తదుపరి భారత్ బ్యాటింగ్ అస్త్రాలని, వారి పవర్ హిట్టింగ్‌తో పాటు కెప్టెన్ కోహ్లీ స్మార్ట్ బ్యాటింగ్ ను అందిపుచ్చుకోవాలన్నాడు.

బుమ్రాకు సలహా.. నెటిజన్ల ఫైర్

బుమ్రాకు సలహా.. నెటిజన్ల ఫైర్

న్యూజిలాండ్‌తో మూడో టీ20 సూపర్‌ ఓవర్‌లో బుమ్రా 17 పరుగులు ఇవ్వడంతో అతనికి భారత కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ ఓ ఉచిత సలహా ఇచ్చాడు. 'బుమ్రా సూపర్‌ ఓవర్‌ను చూశాను. అతడో అద్భుతమైన బౌలర్. కానీ.. క్రీజుని మరింత ఉపయోగించుకుని వివిధ కోణాల్లో వైవిధ్యమైన బంతుల్ని వేయాలి' అని సంజయ్‌ ఓ ట్వీట్ ద్వారా సలహా ఇచ్చాడు. ఇది నెటజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఇప్పటికే అనేకసార్లు నెటిజన్ల విమర్శల బారిన పడ్డ మంజ్రేకర్‌ను మళ్లీ దుమ్మెత్తిపోశారు. 'సాధారణ ప్లేయర్‌ అయిన నువ్వు.. ప్రపంచ నంబర్‌ వన్ బౌలర్‌ బుమ్రాకే సలహా ఇస్తున్నావా?' అంటూ మండిపడ్డారు.

Story first published: Monday, February 3, 2020, 16:35 [IST]
Other articles published on Feb 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X