న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs MI: ముంబై చేతిలో ఓడినా.. నయా రికార్డు లిఖించిన చెన్నై!

Sam Curran-Imran Tahir record highest 9th wicket partnership in IPL history after MI beat CSK by 10 wickets
IPL 2020,CSK vs MI : Sam Curran-Imran Tahir Record Highest 9th Wicket Partnership In IPL History

షార్జా: ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. శుక్రవారం ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నైపై ముంబై ఇండియన్స్ 10 వికెట్లతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఓడినా చెన్నై అరుదైన ఘనతను అందుకుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్‌ చరిత్రలోనే తొమ్మిదో వికెట్‌కు అత్యధికంగా 43 పరుగుల భాగస్వామ్యం జోడించింది.

కరన్-తాహిర్..

కరన్-తాహిర్..

జట్టు స్కోర్‌ 71 పరుగుల వద్ద కౌల్టర్‌నైల్‌ బౌలింగ్‌లో శార్దూల్‌ ఠాకుర్‌(11) ఔటయ్యాక.. సామ్‌కరన్‌(52), ఇమ్రాన్‌ తాహిర్‌(13 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడారు. వీరిద్దరూ ఆఖరి బంతి వరకు క్రీజులో నిలిచి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. ఆఖరి బంతికి కరన్ ఔటైనా.. ఐపీఎల్ చరిత్రలో 9 వికెట్‌కు నమోదైన అత్యధిక బాగస్వామ్యాన్ని నెలకొల్పిన జోడీగా కరన్- ఇమ్రాన్ ద్వయం నిలిచింది.

గతంలో రెండు సార్లు చెన్నైనే..

గతంలో రెండు సార్లు చెన్నైనే..

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రికార్డు ఇప్పటి వరకు కూడా చెన్నై ఆటగాళ్లపైనే ఉంది. 2013లో ధోనీ-అశ్విన్ 41 రన్స్ భాగస్వామ్యం అందించగా.. 2018లో డ్వేన్ బ్రావో, ఇమ్రాన్ తాహిర్‌లు కూడా 41 రన్స్ పార్ట్‌నర్‌షిప్ అందించారు. తాజా మ్యాచ్‌తో ఇమ్రాన్, కరన్ ఈ 41 పరుగుల భాగస్వామ్యాన్ని అధిగమించారు.

చిత్తయిన చెన్నై..

చిత్తయిన చెన్నై..

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైని ముంబై పేసర్లు గడగడలాడించారు. ట్రెంట్ బౌల్ట్(4/18), జస్ ప్రీత్ బుమ్రా(2/25), రాహుల్ చాహర్ (2/22) ధాటికి చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 114 రన్స్ చేసింది. సామకరన్ (42 బంతుల్లో 4 ఫోర్, 2 సిక్స్‌లతో 52) మినహా అంతా దారుణంగా విఫలమయ్యారు. ధోనీ(16 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్‌తో 16), జడేజా(7), ఫాఫ్(1) తీవ్రంగా నిరాశపరిచారు. అనంతరం చెన్నై ఓపెనర్లు ఇషాన్ కిషన్(37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 68 నాటౌట్), క్వింటన్ డికాక్(37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46 నాటౌట్) సూపర్ బ్యాటింగ్‌తో 12.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 116 పరుగులు చేసి ఘనవిజయాన్నందుకుంది.

ఆ వ్యూహంలో భాగంగానే ఫీల్డింగ్ తీసుకున్నా: కీరన్ పొలార్డ్

Story first published: Saturday, October 24, 2020, 16:25 [IST]
Other articles published on Oct 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X