న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డే/నైట్ టెస్ట్‌లో రాణించాలంటే అదెంతో కీలకం.. కోహ్లీసేనకు సచిన్ అడ్వైజ్!

Sachin Tendulkar’s advice to Virat Kohli for day-night Test
Ind vs Aus 2020,1st Test : Sachin Tendulkar Advises Virat Kohli To Be Respectful Of Conditions

ముంబై: డే/నైట్ టెస్ట్‌ల్లో రాణించాలంటే టైమ్‌ను ఫాలో అవ్వాలని భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సూచించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫస్ట్ డే/నైట్ టెస్ట్ నేపథ్యంలో కోహ్లీ సేనకు సచిన్ విలువైన సలహా ఇచ్చాడు. ఎప్పటికప్పుడూ టైమ్‌ను ఫాలో అవుతూ.. పరిస్థితులకు తగ్గట్లు వ్యూహాలు రచించాలన్నాడు. డే/నైట్ టెస్ట్‌ల్లో టైమ్ చాలా కీలకమన్నాడు. ఇక డే/నైట్ టెస్ట్‌ల విషయంలో ఆస్ట్రేలియాకు అపార అనుభవం ఉండగా.. భారత్ కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడింది. అది కూడా బలహీనమైన బంగ్లాదేశ్‌తో ఆడింది. ఈ క్రమంలో కోహ్లీసేనకు సచిన్ డే/నైట్ చిట్కా చెప్పాడు.

 టైమ్‌ను అనుసరించాలి..

టైమ్‌ను అనుసరించాలి..

‘నేను ఇప్పటి వరకు చూసిన పింక్ బాల్ టెస్ట్‌ల్లో టైమ్ చాలా కీలక పాత్ర పోషించింది. ఆటగాళ్లందరికి సమయంపై మంచి అవగాహన ఉండాలి. సూర్యస్తమయం ఎప్పుడూ, ఉష్ణోగ్రతలు ఎప్పుడు తగ్గుతాయి, డ్యూ ప్రభావం ఎప్పడుంటుంది, ఏ సమయంలో మైదానం పచ్చికగా మారుతుందనే విషయాలు పూర్తిగా తెలుసుండాలి. ఇక బంతి ఎక్స్‌ట్రా బౌన్స్ అవుతున్న సమయంలో బౌలర్లను, పరిస్థితులను గౌరవించాలి.

ఆ సమయంలో బౌలర్లను గౌరవించాలి..

ఆ సమయంలో బౌలర్లను గౌరవించాలి..

ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ విషయాని వస్తే.. ఇక్కడ ఫస్ట్ సెషన్‌లో కొంచెం దూకుడుగా ఆడాలి. అవకాశాలను సృష్టించుకుంటూ బౌలర్లపై ఎదురు దాడికి దిగాలి. అయితే కోల్‌కతాలో కంటే ఆస్ట్రేలియాలో సూర్యాస్తమయం కొంచెం ఆలస్యంగా ఉండవచ్చు. కోల్‌కతా 4.30 నుంచి 6.30 మధ్యలో సూర్యాస్తమయం ఉంటుంది. ఈ టైమ్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి. బౌలర్లను, పరిస్థితులను గౌరవిస్తూ ఆడాలి. అలాగే మంచి భాగస్వామ్యాలను నెలకొల్పేందుకు ప్రయత్నించాలి. బంతి మొత్తం తడిసే వరకు ఓపికగా ఆడాలి. ఆ తర్వాతే దూకుడుగా ఆడాలి.

ప్రత్యర్థిని అలానే..

ప్రత్యర్థిని అలానే..

బహుషా ఆసీస్‌లో సెకండ్ సెషన్ చివర్లో, లాస్ట్ సెషన్ ప్రారంభంలో బంతి కొంచెం ఎక్కువగా స్పందిస్తుందనుకుంటా. ఈ సమయంలో దూకుడును ఎంత అనుచుకుంటే అంతమంచింది. చాలా క్రమశిక్షణగా బ్యాటింగ్ చేయాలి. కోల్‌కతాలో పింక్ బాల్ మ్యాచ్ జరిగినప్పుడు ఇదే కోహ్లీతో నేను మాట్లాడాను. సూర్యస్తమయ సమయంలో రెండు వికెట్లు చేతిలో ఉన్నా డిక్లేర్ చేయడం ఉత్తమమని చెప్పా. అక్కడ మరో 20 పరుగులు చేసే అవకాశం ఉన్నా.. ప్రత్యర్థి టాపార్డర్‌ను ఔట్ చేయవచ్చు. అప్పుడు 120 పరుగులను కాపాడుకోవచ్చని చెప్పా. ఈ సిరీస్‌లో కూడా అదే రిపీట్ చేయాలి.'అని సచిన్ చెప్పుకొచ్చాడు.

 సీన్ రివర్స్..

సీన్ రివర్స్..

ఇక ఫస్ట్ ఇన్నింగ్స్‌లో సచిన్ చెప్పిన వాదనకు భిన్నంగా భారత బ్యాటింగ్ కొనసాగింది. పరుగుల ఖాతా తెరవకుండానే ఆదిలోని ఓపెనర్ పృథ్వీ షా వికెట్ కోల్పోవడంతో భారత్ తీవ్ర ఒత్తిడికి లోనైంది. దాంతో పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితమవ్వడంతో ఫస్ట్ సెషన్‌లో 25 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 41 పరుగులు మాత్రమే చేసింది. క్రీజులో కుదురుకున్న మయాంక్ అగర్వాల్‌ను కమిన్స్ ఔట్ చేయడంతో భారత్ దూకుడును కొనసాగించలేకపోయింది. ఆ తర్వాత పుజారా- కోహ్లీ కూడా డిఫెన్స్‌కే పరిమితయ్యారు. ఈ జోడీ క్రీజులో కుదురుకుంటుండగా.. పుజారాను లయన్ ఔట్ చేయడంతో భారత్ దూకుడుగా ఆడలేకపోయింది.

Story first published: Thursday, December 17, 2020, 15:18 [IST]
Other articles published on Dec 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X