న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: మొతేరా పిచ్‌పై దెయ్యాలేం లేవు.. విమర్శకులపై రోహిత్‌ శర్మ ఫైర్!

Rohit Sharma says Ahmedabad pitch had no demons, India also made lot of mistakes
India vs England : Rohit Sharma Slams Motera Pitch Critics ‘It Was A Nice Pitch To Bat On’

అహ్మదాబాద్‌: భారత్, ఇంగ్లండ్ మధ్య రెండు రోజుల్లోనే ముగిసిన డే/నైట్ టెస్ట్‌కు ఆతిథ్యమిచ్చిన మొతెరా పిచ్‌పై పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు గప్పించడంపై టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పిచ్‌ను తప్పుపట్టాల్సిన పని లేదని, నేరుగా వికెట్లకు విసిరిన బంతులకే చాలా మంది బ్యాట్స్‌మెన్ ఔటయ్యారని స్పష్టం చేశాడు. ఇంగ్లండ్‌తో గురువారం ముగిసిన ఈ పింక్ టెస్ట్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

అయితే ఈ పిచ్ టెస్ట్‌లకు సూటవ్వదని భారత, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు విమర్శించారు. అసలు టెస్ట్ మ్యాచ్‌కు ఇలాంటి వికెట్ ఇస్తారా? అంటూ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం వర్చువల్‌గా మీడియాతో మాట్లాడిన హిట్ మ్యాన్ వివరణ ఇచ్చాడు. పిచ్‌పై దెయ్యాలేం లేవన్నాడు.

దెయ్యాలేం లేవు..

దెయ్యాలేం లేవు..

'ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఆటగాళ్లే కాకుండా టీమిండియా బ్యాట్స్‌మెన్‌ కూడా తప్పులు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో మేం సరిగ్గా ఆడలేకపోయాం. పిచ్‌ విషయంలో ఎలాంటి తప్పు లేదు. స్ట్రైట్ బాల్స్‌కే చాలా మంది ఔటయ్యారు. దానిపై దెయ్యాలు కూడా లేవు. ఒక్కసారి కుదురుకుంటే ఈ పిచ్‌ మీద పరుగులు చేయవచ్చు. అయితే, స్పిన్‌కు అనుకూలించే ఇలాంటి పిచ్‌ మీద జాగ్రత్తగా ఆడాలి.'అని రోహిత్‌ తెలిపాడు.

డిఫెన్స్ చేయవద్దు..

డిఫెన్స్ చేయవద్దు..

'పరుగులు చేయాలంటే కాస్త ఆలోచించాలి. ప్రతీ బంతిని డిఫెన్స్‌ చేయడం కూడా సరికాదు. అలా చేస్తే కొన్నిసార్లు బంతి అనూహ్యంగా తిరిగి వికెట్ల మీదకు దూసుకెళ్తుంది. పరిస్థితులను బట్టి షాట్‌లు ఆడేందుకు కూడా వెనుకాడొద్దు. నేను బ్యాటింగ్‌ చేసేటప్పుడు వికెట్‌ కాపాడుకోవడం ఒక్కటే నా ఉద్దేశం కాదు.. పరుగులు కూడా చేయాలనుకున్నాను. మంచి బంతులను గౌరవిస్తూనే చెడ్డ బంతులను వేటాడా' అని రోహిత్‌ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 66 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 25 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

8 సిక్సర్లతో గప్టిల్ వీరవిహారం.. రోహిత్ శర్మ రికార్డు బద్దలు!

బ్యాటింగ్ వైఫల్యమే..

బ్యాటింగ్ వైఫల్యమే..

మొతేరా పిచ్‌ బాగానే ఉందని టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ అన్నాడు. బ్యాట్స్‌మెన్ వైఫల్యం కారణంగానే మ్యాచ్ త్వరగా ముగిసిందన్నాడు. 'ఈ పిచ్ బాగుంది. ఐడియల్ టెస్ట్ పిచ్ కాదన్న మాజీల వ్యాఖ్యలు అర్థరహితం. మంచి బంతులు మ్యాచ్‌ను టర్న్ చేశాయి. నిజాయతీగా చెప్పాలంటే బ్యాటింగ్‌ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేదు.

100/3తో ఉన్న మేం 150 లోపు ఆలౌటయ్యాం. రెండు జట్ల బ్యాట్స్‌మెన్ శక్తి మేరకు ఆడలేదు. ఏదో ఒక బంతి మాత్రమే అనూహ్యంగా టర్న్‌ అవుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసేందుకు పిచ్‌ బాగానే ఉంది. 30లో 21 వికెట్లు స్ట్రెయిట్ బాల్స్‌కు పడటం విస్మయపరిచింది. మన డిఫెన్స్‌పై నమ్మకం ఉంచుకోవడమే టెస్టు క్రికెట్లో ప్రధానం. సరిగ్గా ఆడటకపోవడంతోనే మ్యాచ్‌ త్వరగా ముగిసింది. ఇదంతా స్పిన్నర్ల చలువే.' అని కోహ్లీ అన్నాడు.

మూడు ఇన్నింగ్స్‌లు..

మూడు ఇన్నింగ్స్‌లు..

మొతెరా పిచ్ టెస్ట్‌లకు ఏ మాత్రం సూటవ్వదని హర్భజన్ సింగ్ అన్నాడు. ఒకవేళ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 200పైగా పరుగులు చేసుంటే అప్పుడు భారత్ కష్టపడేదని భజ్జీ అభిప్రాయపడ్డాడు. కాగా, ఇక మీద కూడా ఇలాంటి వికెట్లే ఇస్తామంటే ప్రతీ జట్టును మూడు ఇన్నింగ్స్‌లు ఆడించాలని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ విమర్శించాడు. ఇలాంటి పిచ్ వల్ల బ్యాట్స్‌మెన్ స్కిల్స్‌కు పరీక్ష ఎదురవుతుందని, ఇది ఈ ఒక్క మ్యాచ్‌కు అయితే ఓకే కానీ తర్వాత కూడా ఇలాంటి వికెట్లే ఇస్తామంటే ఏ క్రికెటర్ కూడా ఒప్పుకోడని ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్‌మన్ కెవిన్ పీటర్సన్ అన్నాడు.

Story first published: Friday, February 26, 2021, 13:00 [IST]
Other articles published on Feb 26, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X