న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: బ్యాటింగ్ చేస్తూ రిషభ్ పంత్ కోతి వేషాలు.. నవ్వు ఆపుకోలేకపోయిన కామెంటేటర్స్ (వీడియో)

Rishabh Pant runs sideways after hitting the ball to deep cover (Video)

కేప్‌టౌన్: సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ (139 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 100 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగాడు. గత కొంతకాలంగా నిలకడలేమి ఫామ్‌తో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న అతను వాటికి తన ఆటతో బదులిచ్చాడు. అయితే సెంచరీ ఇన్నింగ్స్‌ను పంత్ ఆస్వాదిస్తూ ఆడాడు. మైదానంలో ఎప్పటిలానే తన చిలిపి పనులతో నవ్వులు పూయించాడు. ఓవైపు భారీ షాట్లతో అలరించిన భారత వికెట్ కీపర్ మరో వైపు క్రీజులో తన కోతేశాలతో ఆకట్టుకున్నాడు.

చిలిపి పనులతో..

కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔటైన అనంతరం టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోతుండటంతో టెయిలండర్లతో కలిసి పోరాడిన పంత్.. ఆ క్రమంలో భారీ షాట్లే ఆడాడు. సింగిల్స్ తీసే అవకాశం ఉన్నా తీయకుండా ఎక్కువగా తానే స్ట్రైక్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే పరుగులు తీసే ఆస్కారం ఉన్నా.. తీయకుండా క్రీజులో ఉండిపోయిన పంత్.. ఉత్తిగా ఉండలేక పక్కకు పరుగెత్తుతూ రన్ తీసాడు. క్రీజులో సైడ్‌కు పరుగెత్తి రన్ తీస్తున్నట్లు షో చేశాడు. ఇక పంత్ చేసిన పనికి మైదానంలో నవ్వులు పూసాయి. కామెంటేటర్లు అయితే గట్టిగా అరుస్తూ పంత్ చర్యకు నవ్వుకున్నారు.

చేజారిన బ్యాట్..

భారత రెండో ఇన్నింగ్స్ 60వ ఓవర్‌లో పంత్ సరదాగా ఇలా చేశాడు. ఆ ఓవర్ రెండో బంతిని కవర్స్ దిశగా ఆడి.. సైడ్స్ పరుగెత్తాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక అంతకుముందు అదే ఓవర్‌ తొలి బంతికి స్టెప్ ఔటై రిషభ్ పంత్‌ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బ్యాట్ అతని చేతి నుంచి జారిపోగా.. బంతి బౌండరీకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు ఆ బ్యాట్ ఎవరీకి తాకలేదు. ఇక గతంలో కూడా పంత్ ఇలా బ్యాట్‌ను విడిచిపెట్టాడు. సింగిల్ హ్యాండ్‌తో సిక్స్‌లు కూడా బాదాడు. బ్యాట్ చేజారిన వీడియో కూడా నెట్టిం వైరల్‌గా మారింది.

ధోనీ రికార్డు బద్దలు..

ధోనీ రికార్డు బద్దలు..

ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన పంత్.. సఫారీ గడ్డపై ఈ ఘనతను అందుకున్న తొలి ఆసియా వికెట్ కీపర్‌గా గుర్తింపు పొందాడు. అంతేకాకుండా సౌతాఫ్రికా గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన తొలి ఆసియా వికెట్ కీపర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు. 2010-11 సౌతాఫ్రికా పర్యటనలో మహేంద్ర సింగ్ ధోనీ సెంచూరియన్ వేదికగా 90 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉండగా.. తాజాగా రిషభ్ పంత్ దాన్ని అధిగమించాడు. ధోనీనే కాకుండా శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర(89), బంగ్లాదేశ్ ప్లేయర్ లిటన్ దాస్(70)ను కూడా వెనక్కినెట్టాడు. సంగక్కర 2002-03లో ఈ పరుగులు చేయగా.. లిటన్ దాస్ 2017-18లో సాధించాడు.

విజయం దిశగా సౌతాఫ్రికా..

విజయం దిశగా సౌతాఫ్రికా..

భారత్ విధించిన 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా నిలకడగా ఆడుతూ విజయం దిశగా దూసుకెళ్తుంది. 23 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. క్రీజులో డీన్ ఎల్గర్(27 బ్యాటింగ్), కీగన్ పీటర్సన్ (22 బ్యాటింగ్) ఉన్నారు. సౌతాఫ్రికా విజయానికి ఇంకా 142 పరుగులు అవసరం కాగా.. భారత్‌కు 9 వికెట్లు అవసరం. ఓపెనర్ ఎయిడెన్ మార్క్‌రమ్(16) మహమ్మద్ షమీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అంతకుముందు 57/2 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్ పంత్ అజేయ సెంచరీ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ అంతా విఫలమవడంతో 198 పరుగులకే కుప్పకూలింది.

Story first published: Thursday, January 13, 2022, 21:39 [IST]
Other articles published on Jan 13, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X