న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రిషభ్ పంత్‌ను మోసం చేసిన క్రికెటర్ అరెస్ట్!

Rishabh Pant cheated of Rs 1.63 crore by conman cricketer

ముంబై: టీమిండియా వికెట్ కీపర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌‌ను ఓ లోకల్ క్రికెటర్ దారుణంగా మోసం చేసాడు. హర్యానాకు చెందిన మ్రినాంక్ సింగ్... ఖరీదైన వాచీలను, మొబైల్ ఫోన్లను తక్కువ ధరకే అమ్మిపెడతానని ఆశ చూపించి... పంత్ దగ్గర్నుంచి రూ.1.63 కోట్ల విలువైన సొత్తును తీసుకుని పరారయ్యాడు. రిషభ్ పంత్‌కు ఖరీదైన వాచీలకు బాగా ఇష్టం. ఫ్రాంక్ ముల్లర్ వాన్‌గార్డ్ యాచ్‌కింగ్ సిరీస్‌కి చెందిన వాచీని కొనుగోలు చేసేందుకు రూ.36 లక్షల 25 వేల 120 చెల్లించాడు. అలాగే మరో క్రేజీ కలర్ రిచర్డ్ మిల్లే వాచీ కోసం మరో రూ.62 లక్షల 60 వేలను వెచ్చించి కొనుగోలు చేశాడు.

అయితే వాచీలు తిరిగి అమ్మిబెడతానని నమ్మించి, వాటిని తీసుకుని,బోగస్ చెక్‌తో పంత్‌ను మోసం చేశాడు. తాను మోసమోయానని గ్రహించిన రిషభ్ పంత్, అతని మేనేజర్ పునీత్ సోలంకి పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జనవరి 2021లో మ్రినాంక్ సింగ్, రిషభ్ పంత్‌తో పాటు అతని మేనేజర్ పునీత్ సోలంకిని కలిసాడు. తాను ఓ కొత్త వ్యాపారం మొదలెట్టానని ఖరీదైన లగ్జరీ వాచీలు, బ్యాగులు, జ్యూవెలరీని కొనుగోలు చేసి వాటిని విక్రయిస్తుంటానని నమ్మబలికాడు. తాను చాలామంది క్రికెటర్లకు ఇలా వాచీలు అమ్మినట్టు రిఫరెన్సులు చూపించాడు...

పాత వాచీలు ఎక్కవ ధరకు అమ్మిబెట్టి, తక్కువ ధరకు వాచీలు ఇప్పిస్తానని మ్రినాంక్ సింగ్ చెప్పిన మాటలను నమ్మిన రిషబ్ పంత్, సోలంకి... అతనికి ఓ ఖరీదైన వాచీ, కొన్ని బంగారు నగలను అందించారు. ఫిబ్రవరిలో వాటిని రిషభ్ పంత్ నుంచి రీసేల్ కోసం కొనుగోలు చేసినట్టుగా రూ.1 63 లక్షల 70 వేల 731 లకు మ్రినాంక్ సింగ్ చెక్కు ఇచ్చాడు. అయితే అది బౌన్స్ కావడంతో మ్రినాంక్‌ పై రిషభ్ పంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ కేసుపై ఏడాదికి పైగా విచారణ జరగగా గత వారం కోర్టులో హాజరుపరచాల్సిందిగా న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. అతన్ని అరెస్టు చేసిన జుహు పోలీసులు, అతని దగ్గర నుంచి రూ.6 లక్షల నగదు రికవరీ చేశారు. మ్రినాంక్ సింగ్ చేతిలో చాలా మంది మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు.

ఐపీఎల్ 2022 సీజన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ నిష్క్రమించిన విషయం తెలిసిందే. ముంబైతో గెలవాల్సిన మ్యాచ్‌లో అనవసర తప్పిదాలతో పంత్ సేన ఓటమిపాలైంది.

Story first published: Monday, May 23, 2022, 22:36 [IST]
Other articles published on May 23, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X