న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా పరిస్థితిని చూసి మా నాన్న భోజనం కూడా చేయలేదు: రింకూ సింగ్

Rinku Singh says My father didn’t eat for 2-3 days on struggling with serious injury in career

ముంబై: ఇతర క్రికెటర్లలానే తాను కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థితికి వచ్చానని కోల్‌కతా నైట్ రైడర్స్ యువ హిట్టర్ రింకూసింగ్‌ అన్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చేలరేగిన రింకూ(15 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 40) కేకేఆర్‌ను గెలిపించినంత పని చేసి లక్నో సూపర్ జెయింట్స్‌కు ముచ్చెమటలు పట్టించాడు. 6 బంతుల్లో 21 పరుగుల చేయాల్సిన పరిస్థితుల్లో 4, 6, 6, 2తో విజయ సమీకరణాన్ని రెండు బంతుల్లో మూడు పరుగులుగా మార్చేసాడు. దాంతో కేకేఆర్ విజయం ఖాయమని అంతా భావించారు.

కానీ ఎవిన్ లూయిస్ స్టన్నింగ్ క్యాచ్‌‌తో రింకూ ఔటవ్వగా.. కేకేఆర్ 2 పరుగులతో ఓటమిపాలైంది. ఈ ఓటమి అనంతరం తీవ్ర భావోద్వేగానికి గురైన రింకూ దు:ఖాన్ని ఆపులేకపోయాడు. కేకేఆర్‌ను గెలిపించకపోయినా రింకూ సింగ్ మాత్రం అభిమానుల మనసులను గెలుచుకున్నాడు.

అందరిలానే కష్టాలు..

అందరిలానే కష్టాలు..

ఈ నేపథ్యంలోనే తాజాగా కేకేఆర్ విడుదల చేసిన ఓ వీడియోలో మాట్లాడిన రింకూ.. గడిచిన ఐదేళ్లలో అనేక కష్టాలను చవిచూశానని చెప్పాడు. 'గత ఐదేళ్లు నాకు చాలా కష్టంగా గడిచాయి. 2018లో తొలిసారి కేకేఆర్‌కు ఎంపికైనప్పుడు అవకాశాలు వచ్చినా సరిగ్గా ఆడలేకపోయా. అయినా, నా మీద టీమ్‌మేనేజ్‌మెంట్ నమ్మకం ఉంచింది.

వరుస సీజన్లలోనూ నన్ను అట్టిపెట్టుకొంది. అదే సమయంలో నా గాయాల కారణంగా చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే, నేనెప్పుడూ వెనుకబడ్డట్టు జట్టు భావించలేదు. ముఖ్యంగా గతేడాది చాలా కష్టంగా మారింది. విజయ్‌ హజారే ట్రోఫీలో మోకాలికి గాయమైంది.

గాయంతో 7 నెలలు ఆటకు దూరం..

గాయంతో 7 నెలలు ఆటకు దూరం..

సర్జరీ తర్వాత కోలుకోవడానికి 6 నుంచి 7 నెలల సమయం పడుతుందని చెప్పేసరికి తట్టుకోలేకపోయా. అప్పుడు నేను ఐపీఎల్ గురించే ఆలోచించా. దీంతో చాలా రోజుల పాటు ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. దాన్ని భరించలేకపోయా. నా పరిస్థితిని చూసి మా నాన్న రెండు, మూడు రోజుల పాటు భోజనం కూడా చేయలేదు.

దాంతో క్రికెట్‌లో ఇలాంటి గాయాలన్నీ సహజమే అని ఆయనకు నచ్చజెప్పా. ఎందుకంటే మా కుటుంబానికి నేనే ప్రధాన జీవనాధారం. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కష్టాలు తప్పవు. ఆ సమయంలో కాస్త బాధపడ్డా.. ఆత్మస్థైర్యంతో త్వరగా కోలుకుంటాననే అనుకున్నా' అని రింకూ చెప్పుకొచ్చాడు.

2018 నుంచి..

2018 నుంచి..

రింకూ సింగ్ తొలిసారి 2018లో కేకేఆర్ తరఫున అవకాశం అందుకున్నాడు. కానీ ఆశించిన రీతిలో రాణించలేక విఫలమయ్యాడు. మరుసటి సీజన్‌లోనూ తేలిపోయాడు. అదే నేపథ్యంలో 2020లోనూ ఒకే మ్యాచ్‌ ఆడి ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఇక గతేడాది మోకాలి గాయం కారణంగా మొత్తం టోర్నీకే దూరమయ్యాడు. కానీ, ఈ ఏడాది అవకాశాలు బాగా రావడంతో వాటిని సద్వినియోగం చేసుకొన్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన రింకూ 34.80 సగటుతో 174 పరుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్‌ 148.72గా ఉంది. రాజస్థాన్ రాయల్స్‌తో ఓడిపోయే మ్యాచ్ గెలిపించాడు.

స్వీపర్‌గా పనిచేసిన రింకూ సింగ్...

స్వీపర్‌గా పనిచేసిన రింకూ సింగ్...

రింకూ సింగ్‌ది దిగువ మధ్య తరగతి కుటుంబం. ఉత్తర ప్రదేశ్‌లోని అలీగఢ్ రింకూ సింగ్ స్వస్థలం. రెండు గదులు ఉన్న ఓ చిన్న క్వార్టర్‌లో నివాసం తొమ్మిదిమంది కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటోన్నాడు. తల్లిదండ్రులు, చెల్లెలు, అన్న జీతూసింగ్, చెల్లెలు నేహాసింగ్, వదిన, వారి పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. తండ్రి ఖన్‌చంద్‌ది గ్యాస్ సిలిండర్లను డోర్ డెలివరి చేసే ఉద్యోగం. తల్లి వీణా దేవి గృహణి. జీతూసింగ్ ఆటోడ్రైవర్.

చిన్నప్పటి నుంచే క్రికెట్ పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు. డొమెస్టిక్ క్రికెట్ ఆడాలనే బలమైన కోరికతో ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. సచిన్ టెండుల్కర్, సురేష్ రైనా అతని ఆరాధ్య క్రికెటర్లు. కుటుంబాన్ని పోషించడానికి తండ్రి పడే కష్టంలో తానూ పాలుపంచుకునేవాడు. దీనికోసం ఒకదశలో ఓ ప్రైవేట్ కార్యాలయంలో స్వీపర్‌గా కొద్దిరోజులు పని చేశాడు. ఆటోడ్రైవర్‌గానూ కష్టపడ్డాడు.పెద్దగా చదువుకోలేదు. తొమ్మిదో తరగతిలోనే చదువును మానేశాడు.

Story first published: Thursday, May 19, 2022, 15:36 [IST]
Other articles published on May 19, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X