న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB vs PBKS: మ్యాచ్ టర్నింగ్ పాయింట్.. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిన ఆర్‌సీబీ!

 RCB vs PBKS: Punjab Kings defeat Royal Challengers Bangalore to stay afloat in playoffs race

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కు మరో పరాజయం ఎదురైంది. పంజాబ్ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన ఆర్‌సీబీ 54 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో ఆర్‌సీబీ తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకోగా.. పంజాబ్ సజీవంగా ఉంచుకుంది. గుజరాత్ టైటాన్స్ ఆడాల్సిన చివరి మ్యాచ్‌లో ఆర్‌సీబీ తప్పక గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి తెచ్చుకుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. లివింగ్ స్టోన్(42 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 70), జానీ బెయిర్ స్టో(29 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 66) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. ఆర్‌సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ 4 వికెట్లు తీయగా.. హసరంగా రెండు వికెట్లు పడగొట్టాడు. షెహ్‌బాజ్, మ్యాక్స్‌వెల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

మ్యాక్సీ ఒక్కడే..

మ్యాక్సీ ఒక్కడే..

అనంతరం ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయాన్ని చవిచూసింది. గ్లేన్ మ్యాక్స్‌వెల్(22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 35) మినహా అంతా విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో కగిసో రబడా మూడు వికెట్లు తీయగా.. రిషి ధావన్, రాహుల్ చాహర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. హర్‌ప్రీత్ బ్రార్, అర్షదీప్ సింగ్‌కు తలో వికెట్ దక్కింది.

 విరాట్ మళ్లీ విఫలం..

విరాట్ మళ్లీ విఫలం..

210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీకి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. 2 ఫోర్లు, సిక్సర్‌తో దూకుడు కనబర్చిన విరాట్ కోహ్లీ(20) దురదృష్టవశాత్తు రబడా బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. రిషి ధావన్ వేసిన ఆ మరుసటి ఓవర్‌లో కెప్టెన్ ఫాఫ్ డుప్లిస్(10) సైతం ఔటయ్యాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన మహిపాల్ లోమ్రార్ వచ్చి రావడంతో సిక్సర్ బాదాడు. కానీ అదే ఓవర్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో ఆర్‌సీబీ 40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

పటీదార్ వికెట్‌తో టర్నింగ్...

పటీదార్ వికెట్‌తో టర్నింగ్...

ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన గ్లేన్ మ్యాక్స్‌వెల్, రజత్ పటీదార్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ముఖ్యంగా మ్యాక్స్‌వెల్ తనదైన షాట్లతో చెలరేగాడు. అతనికి రజత్ పటీదార్ కూడా రాణించాడు. సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను భయపట్టించాడు. కానీ క్రీజులో కుదురుకున్న ఈ జోడీని రాహుల్ చాహర్ విడదీసాడు. పటీదార్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఈ వికెట్ మ్యాచ్‌కే టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.

 స్టన్నింగ్ క్యాచ్..

స్టన్నింగ్ క్యాచ్..

ఆ మరుసటి ఓవర్‌లోనే గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ను హర్‌ప్రీత్ బ్రార్ పెవిలియన్ చేర్చగా.. ఎన్నో ఆశల మధ్య బరిలోకి దిగిన దినేశ్ కార్తీక్‌ను అర్ష‌దీప్ సింగ్ ఔట్ చేశాడు. దాంతో ఆర్‌సీబీ ఓటమి ఖాయమవ్వగా.. ఆ మరుసటి ఓవర్‌లో షెహ్‌బాజ్ అహ్మద్(9) రబడా క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే వానిందు హసరంగా ఆడిన భారీ షాట్‌ను బౌండరీ లైన్ మీద హర్‌ప్రీత్ బ్రార్ అద్బుతంగా ఆదుకున్నాడు. క్యాచ్ అందుకోవడంతో పాటు 6 పరుగులు సేవ్ చేశాడు. బౌండరీ లైన్‌పై గాల్లోకి ఎగిరి బంతిని అందుకున్న హర్‌ప్రీత్ బ్రార్.. సమన్వయం కోల్పోతున్నానని భావించి గాల్లోకి విసిరేసి మళ్లీ వచ్చి అందుకున్నాడు. హర్షల్ పటేల్(11) ఔటైనా.. సిరాజ్, హజెల్ వుడ్ మరో వికెట్ పడకుండా మ్యాచ్‌ను ముగించారు.

Story first published: Friday, May 13, 2022, 23:41 [IST]
Other articles published on May 13, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X