అతని కోసమే హర్‌ప్రీత్ బ్రార్ తీసుకున్నాం: పంజాబ్ కింగ్స్

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వికెట్ కండీషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆర్‌సీబీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు. ఇన్నింగ్స్ సాగుతున్న కొద్ది ఈ తరహా వికెట్లు బ్యాటింగ్ అనుకూలంగా మారుతాయని, అంతేకాకుండా ఒక వైపు బౌండరీ చాలా చిన్నగా ఉందని చెప్పాడు. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని, గత మ్యాచ్‌ల్లో తాము ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చామని చెప్పాడు. జట్టులోని ప్రతీ ఒక్కరు తమతమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారని చెప్పాడు. అదే జోరును ఈ మ్యాచ్‌లోనూ కొనసాగిస్తామని తెలిపాడు.

టాస్ ఓడిపోవడంపై బాధగా లేదని, ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచి ఒత్తిడి కలిగిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. స్కోర్ బోర్డుపై పరుగులుంటే ఏ జట్టుకైనా డిఫెండ్ చేసుకోవడం ఈజీ అవుతుందన్నాడు. జట్టులో ఒక్క మార్పు చేశామన్న మయాంక్.. సందీప్ శర్మ స్థానంలో లెగ్ స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్‌ను తీసుకొచ్చామని చెప్పాడు. ఆర్‌సీబీపై లెఫ్టార్మ్ స్పిన్నర్ల ఆధిపత్యం కొనసాగుతుందని, అందుకే అతన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చామని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే సమష్టిగా రాణించడం చాలా ముఖ్యమని చెప్పాడు.

ఇక విరాట్ కోహ్లీ కోసమే హర్‌ప్రీత్ బ్రార్‌ను జట్టులోకి తీసుకొచ్చినట్లు అర్థమవుతోంది. గతంలో విరాట్‌ను హర్‌ప్రీత్ బ్రార్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ సీజన్‌ ఫస్టాఫ్‌లో ఆర్‌సీబీపై పంజాబ్ అద్భుత విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా ముఖ్యం. ఆర్‌సీబీ గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువవుతోంది. ఓడితే మాత్రం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది.

తుది జట్లు:

పంజాబ్ కింగ్స్: జానీ బెయిర్ స్టో, శిఖర్ ధావన్, భానుక రాజపక్స, మయాంక్ అగర్వాల్, జితేశ్ శర్మ, లియామ్ లివింగ్ స్టోన్, రిషి ధావన్, కగిసో రబడా, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్, ఆర్ష్‌దీప్ సింగ్

ఆర్‌సీబీ: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), రజత్ పటిదార్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్, మహిపాల్ లోమ్రోర్, షెహ్‌బాజ్ అహ్మద్, వానిందు హసరంగా, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, జోష్ హజెల్ వుడ్

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, May 13, 2022, 19:30 [IST]
Other articles published on May 13, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X