ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో అశ్విన్!

దుబాయ్: ఇటీవలే టెస్ట్ క్రికెట్‌లో 400 వికెట్ల మైలు రాయి అందుకున్న టీమిండియా స్టార్ స్పిన్నర్ రవించంద్రన్ అశ్విన్ మరో అరుదైన ఘనతకు చేరువయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కొత్తగా ప్రవేశపెట్టిన ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో చోటు దక్కించుకున్నాడు. ఫిబ్రవరి నెలలో ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ముగ్గురి ఆటగాళ్లను ఐసీసీ నామినేటింగ్ కమిటీ ఎంపికచేసింది. ఈ జాబితాను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. పురుషుల క్రికెట్ కేటగిరీలో టీమిండియా స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​‌తో పాటు ఇంగ్లండ్​ కెప్టెన్​ జో రూట్, వెస్టిండీస్​ బ్యాట్స్​మన్​ కైలీ మేయర్స్​ ఉన్నారు.

ఆల్‌రౌండ్ షోతో..

భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్ట్‌లు ఫిబ్రవరిలోనే జరిగాయి. ఈ మూడింటిలో అశ్విన్ అదరగొట్టాడు. బంతితో మ్యాజిక్ చేసి 24 వికెట్లు తీసిన అశ్విన్.. అటు బ్యాటింగ్‌లోనూ చెలరేగాడు. సెంచరీతో 176 పరుగులు చేశాడు. ఈ ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తోనే ఐసీసీ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఇక భారత్​తో జరిగిన తొలి టెస్టులో జోరూట్ డబుల్ సెంచరీ (218) సాధించిన విషయం తెలిసిందే. అలాగే అహ్మదాబాద్​ వేదికగా జరిగిన పింక్​-టెస్టులో 5 వికెట్లు ఘనతను అందుకున్నాడు. ఈ సిరీస్​లో ఇప్పటివరకు జరిగిన మూడు టెస్టుల్లో రూట్​.. 333 రన్స్​ చేసి, 6 వికెట్లను సాధించాడు.

సంచలన ఇన్నింగ్స్‌తో..

సంచలన ఇన్నింగ్స్‌తో..

మరోవైపు వెస్టిండీస్ ప్లేయర్ కైల్ మేయర్స్ సెన్సేషన్ బ్యాటింగ్‌తో యావత్ క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు.​ అరంగేట్రం టెస్టు నాలుగో ఇన్నింగ్స్​లోనే 210 పరుగులతో అజేయంగా నిలిచి.. బంగ్లాదేశ్‌పై చారిత్రక విజయాన్నందించాడు. మరోవైపు మహిళా క్రికెటర్ల జాబితాలో టామీ బ్యూమాంట్​(ఇంగ్లండ్​), బ్రూక్ హాలిడే(ఆస్ట్రేలియా), నాట్ సైవర్(ఇంగ్లండ్​) 'ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​'కు పోటీ పడుతున్నారు. టామీ బ్యూమాంట్ న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్ 231 రన్స్ చేయగా.. న్యూజిలాండ్‌కు చెందిన బ్రూక్ హాలిడే 110 పరుగులతో పాటు 2 వికెట్లు తీసింది. ఇంగ్లండ్ ప్లేయర్ నాట్ సైవర్ 5 వికెట్లతో పాటు 96 పరుగులు చేసింది.

ఓటింగ్ ఏలా అంటే..

ఓటింగ్ ఏలా అంటే..

మూడు ఫార్మాట్లలోని ప్రతీ క్యాటగిరీకి ముగ్గురు నామినీలను ఆన్-ఫీల్డ్ పనితీరు, ఆ నెల రోజుల కాలంలో కనబర్చిన అద్భుత ప్రదర్శన ఆధారంగా ఐసీసీ అవార్డు నామినేటింగ్ కమిటీ నిర్ణయిస్తుంది. ఇది ప్రతి నెల మొదటి రోజున జరుగుతుంది. ఒకటో తేదీ నుంచి చివరి తేదీ వరకు చూపిన ప్రతిభ, పనితీరును రికార్డ్ చేస్తుంది. షార్ట్‌ లిస్ట్‌లో ఉన్న ఆటగాళ్లను స్వతంత్ర ఐసీసీ ఓటింగ్ అకాడమీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఓటింగ్ ద్వారా విజేతను ఎంపిక చేస్తారు. ఐసీసీ ఓటింగ్ అకాడమీలో మాజీ క్రికెటర్లతో పాటు సీనియర్ జర్నలిస్ట్‌లు, బ్రాడ్ కాస్టర్స్, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌కు సంబంధించిన సభ్యులు ఉంటారు.

ఐసీసీ డిజిటల్ ఛానెళ్లలో నెలలో ప్రతి రెండవ సోమవారం విజేతలను ప్రకటిస్తారు.

ఈ అవార్డు ఎందుకు?

ఈ అవార్డు ఎందుకు?

అంతర్జాతీయ క్రికెట్​లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు ప్రతినెలా 'ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌' అవార్డును ఇవ్వాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) జనవరిలో నిర్ణయించింది. ఏడాది పొడవునా అన్ని ఫార్మాట్లలో పురుషులు, మహిళా క్రికెటర్ల ఉత్తమ ప్రదర్శనల గుర్తించేందుకు ఈ అవార్డులను ఇవ్వనున్నట్లు తెలపింది. దీనిలో భాగంగానే జనవరి నెలకుగానూ 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్'గా టీమిండియా యువ క్రికెటర్​ రిషబ్​ పంత్​ అందుకున్నాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, March 2, 2021, 18:05 [IST]
Other articles published on Mar 2, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X